మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

95

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం
మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం
గవర్నర్ ఆమోదంతో ఏర్పాటు కానున్న మూడు రాజధానులు
వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది. శాశన రాజధానిగా అమరావతి, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి.
జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది.
ఈ నేపథ్యంలో, మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.