రాజధాని వికేంధ్రీకరణ.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు

653

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాట్లాడుతూ టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి లాంటి ప్రాజెక్టుని చంపేస్తుంటే ఒక్కోసారి కళ్ల వెంట నీరు వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. రాజధాని వికేంద్రీకరణపై భావోద్వేగానికి గురయ్యారు. తాను అనుభవించడానికి రాజధాని కట్టలేదన్నారు. ‘‘మూడు సార్లు ముఖ్యమంత్రి.. 40 ఏళ్ల రాజకీయం నాకు ఇంకా ఏం కావాలి?. ఆరోగ్యం బాగుంటే మరో 10 సంవత్సరాలు ఎక్కువ బతికుంటాను. అమరావతి నాకోసమేమీ కాదు. ఏదో రోజు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. ఈ రోజు చీకటి రోజు అని.. నేను చెప్పిన మాట నిజమని.. భవిష్యత్‌లో అంతా ఒప్పుకుంటారు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.