బాలసుబ్రమణ్యంని కలిసిన బండి సంజయ్

576

ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి  కె బాలసుబ్రమణ్యంని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో బీజేపీ అధ్యక్షులు సంజయ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సహకరించాల్సిందిగా కె సుబ్రహ్మణ్యం గారిని కోరడం జరిగింది.ఈ భేటీలో కరోనా లొక్డౌన్ సమయంలో తెలంగాణాలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన సేవ కార్యక్రమాల గురించి కూడా సంజయ్  ప్రస్తావించారు.