అమరావతి రాజధానిగా కొనసాగాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించాలి:నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్‌ను ఆమోదం తెలుపడం దురదృష్టమని ఆయన అన్నారు. రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు. కచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అనేది మోసమని అన్నారు. ప్రజలందరూ ఒక్కటై, అమరావతి ప్రజల కోసం, మన రాష్ట్ర రాజధాని కృష్ణా నది ఒడ్డుపై ఉండాలని పోరాటం చేయాలని రఘురామ కృస్ణంరాజు డిమాండ్‌ చేశారు. తమకు రాజధాని వద్దని విశాఖ ప్రజలు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. ఎందుకంటే విశాఖను కూడా దగా చేస్తారని అన్నారు. కోర్టులపై విశ్వాసం ఉంచి, తమకు తాముగా ప్రజలు పోరాటం చేయాల్సి ఉందన్నారు.

By RJ

Leave a Reply

Close Bitnami banner