సాక్షికి బీజేపీ నేత దినకర్ లీగల్ నోటీసులు

269

సాక్షి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా తప్పుడు వార్తతో క్యారెక్టర్ అసెసినేషన్ చేసినందుకు మా అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసు ఇవ్వడం జరిగింది.

వ్యక్తిగతంగా నన్ను మరియు భారతీయ జనతా పార్టీ పేరుని తప్పుడు వార్తతో నష్టపరిచే ప్రయత్నం సాక్షి మీడియా చేసింది.

వైయస్ ఆర్ సీ పి కి మరియు తెలుగుదేశం పార్టీ కి మధ్య సారూప్యత కుటుంభ, వారసత్వ రాజకీయాలు. మీ వ్యక్తిగత పోరులో మమ్మల్ని పావులుగా సాక్షి మీడియా ద్వారా వై ఎస్ ఆర్ సీ పి వాడుకోవాలనుకోవడం దుర్మార్గం.

సాక్షి మీడియాలో వండి వార్చిన తయారి వార్తలను వై ఎస్ ఆర్ సీ పి సానుభూతిపరులు సోషల్ మీడియా లో ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందుతూ తప్పడు ప్రచారలకు మూలం అవుతున్నారు.

ఇప్పటికే ఈ అంశాన్ని మా పార్టీ పెద్దల దృష్టికి నేను తెచ్చాను.

సాక్షి మీడియాతోపాటు, నా పై అవాస్తవాలను దుష్ప్రచారం సోషల్ మీడియా లో చేసిన ప్రతిఒక్కరి పై చట్టపరమైన చర్యలు ఏందుకు తీసుకోకూడదో తెలపాలని లీగల్ నోటీసులను సాక్షి మీడియా యాజమాన్యానికి మరియు డీజీపీ గారికి పంపడం జరిగింది.

ఈ తప్పుడు వార్తలో కుట్రదారులందరినీ బహిర్గతం చెయ్యాలి, ఈ తప్పుడు సమాచారం ఇచ్చినవారు ఎవరో నిగ్గు తేల్చాలి.