తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ మరోసారి చురకలు పెట్టింది. ప్రజలకు సమాచారం అందించాలని హైకోర్టు చెప్పినా ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి… ఎన్ని వెంటిలెటర్స్ ఉన్నాయి.. ఎంత మంది చికిత్స పొందుతున్నారు…అనే సమాచారం ఇవ్వాలని కోరింది. పత్రికల్లో ప్రతి రోజు న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు కరోనా సమాచారం తెలపాలంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు ఏవిధంగా పట్టిక వేసి హెడ్ లైన్స్ లో చూపుతారో అదే తరహాలో కేసుల వివరాలు చూపాలంది. హెల్త్ బులిటెన్ లో తప్పులు ఇస్తే ఉరుకోమని హెచ్చరించింది. కోర్ట్ ఆదేశాలమేరకు ప్రతిరోజు సమాచారం ఇస్తామని సీఎస్ తెలిపారు. ఈ మేరకు సమాచార హక్కు కమిషనర్  అరవింద్ కు సీఎస్ ఆదేశాలు జేరిచేసారు. ప్రయివేటు హాస్పిటల్ వారు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపడ్డం లేదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే ఇప్పటికే కొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు నోటిసులు ఇచ్చామని సీఎస్ తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రయివేటు హాస్పిటల్ పై నిఘా ఉంచామని సీఎస్ వెల్లడించారు. కలెక్టర్లు, పోలీసులు వైద్య అధికారులు అందరూ నిరంతరం కరోనా నివారణకు పాటుపడుతున్నారని సీఎస్ అన్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయని సీఎస్ తెలిపారు. కరోనా పై ప్రభుత్వం ఎందుకు విస్తృత ప్రచారం చేపట్టడం లేదని కోర్ట్ ప్రశ్నించింది. ప్రతి హాస్పిటల్ వద్ద ఎలక్ట్రానిక్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది. యాప్ లు విడుదల చేయడం వలన సామాన్య ప్రజలకు అర్ధం కాదని కోర్ట్ తెలిపింది. ప్రతి హాస్పిటల్ వద్ద డీస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని సీఎస్ కోర్ట్ కు తెలిపారు. HITM యాప్  ను ప్రతి ఒక్కరు  డౌన్ లోడ్ చేసుకోవాలని సీఎస్ కోరారు.పూర్తి సమాచారం యాప్ లో ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయని సీఎస్ తెలిపారు. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశామన్నారు. కాగా రాపిడ్ కిట్లతో రిజల్ట్ 40 శాతం మాత్రమే కరెక్ట్ గా వస్తుందని కోర్ట్ చెప్పింది. దాంతో రాజస్థాన్ లో రాపిడ్ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేశారని గుర్తుచేసింది. మన రాష్ట్రంలో రాపిడ్ కిట్ల వాడకం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హై కోర్ట్ ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటల్ ల ఆగడా ల పై ఇప్పటి వరకు 726 ఫిర్యాదులు అందాయని సీఎస్ తెలిపారు. తదుపరి నివేదిక లో ఆ 726 ఫిర్యాదులు పై ప్రైవేట్ హాస్పిటల్ ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్ట్ సూచించింది. తదుపరి విచారణ ను ఆగస్ట్ 13 కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner