నల్ల పోచమ్మ ఆలయాన్ని పునర్నిర్మించాలి

428

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో నల్ల పోచమ్మ గుడి ని కూల్చేసినందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సికింద్రాబాద్ అసెంబ్లీ సీతాఫలమండి డివిషన్లోని చిలకలగూడ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయంలో బిజెపి సీతాఫలమండి డివిజన్ ప్రెసిడెంట్ అంబాలా రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యధులుగా కనకట్ల హరి అరవింద్ కుమార్ గారు బీజేపీ సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ సీనియర్ నాయకులూ మేకల సారంగపాణి గారు కృష్ణ మూర్తి గారు ప్రభు గుప్త గారు అజయ్ నాయుడు భాస్కర్ గిరి ప్రతాప్ అన్న మామిడి నగేష్ రాకేష్ లడ్డు రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కనకట్ల హరి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన తప్పుకు ప్రజలను శిక్షించకుండా తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని కరోనా వ్యాధి పూర్తిగా నిర్ములించాలని నల్ల పోచమ్మ తల్లిని కట్ట మైసమ్మ తల్లిని కోరారు అదేవిధంగా తెరాస ప్రభుత్వం వెంటనే నల్ల పోచమ్మ ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేసారు.