వైసీపీ నిరంతర సేవకుడు శ్రామికుడు కోనూరు సతీష్ శర్మ

484

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ నాయకులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసి అక్రమ కేసులు పెట్టడం చూసి టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధి గా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఓదార్పు యాత్రలో వైసీపీ పార్టీలో చేరి,బై ఎలక్షన్స్ లో అభ్యర్థుల విజయానికి కృషి చేసారు.
సోమయాజులు గారు,ఎమ్మెల్యే కోన రఘుపతి గారు,జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్,మేకతోటి సుచరిత గార్ల పిలుపు మేరకు 2014 నుంచి రాష్ట్ర బ్రాహ్మణ్యంను వైసీపీ పార్టీకి చేరువ చేయాలనే ప్రక్రియకు శ్రీకారం.
వైసీపీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ,ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా రాష్ట్రం లోని బ్రాహ్మణులను చైతన్య పరిచి,భారీ సభలను నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో దేవాలయాల కూల్చివేతే, పుష్కరాలలో జరిగిన అవినీతి ని రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ కుటుంబాలకు తెలియజేసి,బ్రాహ్మణ జాతిని చైతన్యం చేసిన వారిలో కోనూరు సతీష్ శర్మ ప్రదముడు.
2016 మే 24 వ విజయవాడ సంగీత కళాశాలలో విప్రోత్సవం అనే భారీ సభను నిర్వహించి,టీడీపీ ప్రభుత్వం లో బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగంగా విమర్శించటానికి కోనూరు సతీష్ శర్మ కేంద్ర బిందువు అయ్యారు.విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ,ఎమ్మెల్యే కోన రఘుపతి,కర్ణాటక పొరసరఫరాల శాఖా మంత్రి దినేష్ గుండురావు,టీఆర్ఎస్ ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి,ఎమ్మెల్యే వడితల సతీష్ ,జాతీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు 6 సార్లు ఎమ్మెల్యే భవర్ లాల్ శర్మ లు హిందూ సమాజానికి టీడీపీ ప్రభుత్వం లో తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది అని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించిన బ్రాహ్మణ అధ్యయన కమిటీలో సభ్యునిగా ఉండి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేసిన వారిలో కోనూరు సతీష్ శర్మ ప్రప్రదముడు.
వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ,ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్న నాయకులలో కోనూరు సతీష్ శర్మ కూడా ఒకరు.
కరోనా సమయంలో పేదలకు SC, ST, BC మరియు బ్రాహ్మణులకు నిత్యవసర సరుకులను ఆపదలో అందించిన సేవకుడుగా జిల్లా వ్యాప్తంగా కోనూరు సతీష్ శర్మ గుర్తింపు పొందారు,నాయకుల ప్రశంసలు అందుకున్నారు.పార్టీ సిద్ధాంత కర్త సోమయాజులు గారు మే 20 2018 చనిపోయారు,సోమయాజులు గారికి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు.
పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన కోనూరు సతీష్ శర్మను ప్రభుత్వ పదవిలో చూడాలని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ్యం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.