సహానీ.. ‘మత మార్పిళ్ల’ కహానీ తేల్చండి!

386

ఎస్సీలందరికీ గతంలో క్రిస్టమస్ కానుక
జనాభా సున్నా, చర్చిలు పదకొండు
630 మంది క్రైస్తవలున్న రె డ్డిగూడెం మండలంలోనే 68 చర్చిలు
ఆర్టీఐలో  తేలిన నిఖార్సయిన నిజాలు
6 లక్షల నుంచి 2 కోట్లకు చేరిన క్రైస్తవ జనాభా?
‘లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం’ ఫిర్యాదుతో వెలుగుచూసిన వాస్తవాలు
నివేదికలివ్వాలని ఏసీ సర్కారుకు రాష్ట్రపతి హుకుం?
మతమార్పిళ్లపై కన్నేసిన కేంద్రం
నిజమయిన రఘురామకృష్ణంరాజు మత మార్పిళ్ల ఆరోపణలు
            (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఒక్కసారి మీ చేయి మీరే గిల్లుకోండి. ఇంకా మీ తోలు మందమయితే కాల్చి వాత పెట్టుకోండి. అప్పటికీ నమ్మకపోతే, తలను గోడకేసి బాదుకోండి. ఆ.. అదీ..  ఇప్పుడు అర్ధమయిందా? హమ్మయ్య! అవును. మీరు నమ్మినా, నమ్మకపోయినా.. అఖిల కోటి బ్రహ్మాండ నాయకుడైన, మన జగనన్న పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో.. క్రైస్తవుల జనాభా అక్షరాలా రెండు కోట్లు. ఎస్. ఇదేదో ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టమన్నట్లు కాదు. నిజంగా నిఝం! అసలు క్రైస్తవ జనాభా లేని గ్రామాల్లో, అరడజనుకుగా చర్చిలున్నాయట. అదెలా సాధ్యమని మాత్రం అడక్కండి. అక్కడంతే! కేవలం క్రైస్తవులకు మాత్రమే దక్కాల్సిన సర్కారీ క్రిస్మిస్ కానుకలు, పప్పుబెల్లాల మాదిరిగా దళితులకు దానం చేసేశారట!! ఇవన్నీ అబద్ధాలు, అభూతకల్పనలు కాదు. అధికారులే అక్షరాల రూపంలో, ఆర్టీఐ ద్వారా చెప్పిన అక్షర సత్యాలు!!! ఈ దారుణాలపై ఆందోళన చెందిన,  లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతిని శరణు వేడింది. ఆ వివరాలు చూసి కోవిందుడూ ఖంగుతిన్నారట.  ఇదెలా సాధ్యమని ముక్కునవేలేసుకున్నారు. తేరుకున్న త ర్వాత, తనకు వచ్చిన ఆ నివేదికను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి పంపించారు. ‘సహానీ.. ఈ మతమార్పిళ్ల క హానీ ఏమిటో చూసి, నాకు నివేదిక పంపించమ’ని హుకుం జారీ చేశారట. అంటే.. ఈ ప్రకారంగా,  ఏపీలో మతమార్పిళ్లు జరుగుతున్నాయంటూ నెత్తీ నోరుకొట్టుకుంటున్న, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన నిజమేనని నమ్మక తప్పదా?  ఇక ఏపీలో మతమార్పిళ్లు, ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూసి తరిద్దాం రండి.

అబ్బో.. అబ్బో.. అబ్బబ్బో!

అది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారి పాలెం. ఇది 30 ఆగస్టు 2019 నాటి ముచ్చట. చంద్రన్న క్రిస్మస్‌కానుక కింద సర్కారు ఇచ్చిన నజరానాను, ఆ గ్రామంలోని ఎస్సీలందరూ అందుకున్నారట. అదేంటీ? అది కేవలం క్రిస్టియన్లకే కదా ఇచ్చేది అని.. కిలారి ఆనంద్‌పాల్ చెప్పినట్లు.. బుద్ధీ,బుర్ర లేకుండా,  ‘ఎర్రిపప్పుల్లా’ ఎదురు  ప్రశ్నించకండి. ఎస్సీలంటే క్రిస్టియన్లు అన్నదే సర్కారు సిద్ధాంతం!
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం, మద్దులపర్వ గ్రామంలో జనాభా లెక్కల ప్రకారం అసలు క్రైస్తవులే లేరు. కానీ సర్కారు లెక్కల్లో మాత్రం,  ఆ గ్రామంలో ఉన్న చర్చిల సంఖ్య జస్ట్ 11 మాత్రమేనట? అసలు క్రైస్తవులే లేని ఆ గ్రామంలో 11 చర్చిలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే, కళ్లు పేలిపోతాయంతే! నవరంధ్రాలూ మూసుకుని, పాలకులు చెప్పిన లెక్కలను.. రెండు చేతులనూ రాముడు మంచి బాలుడిలా చంకల్లో పెట్టుకుని, చెవిలో పువ్వులు పెట్టుకుని  వినాల్సిందే. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు మీ బాక్సు బద్దలవుతుందంతే!

కోవిందుడు అడిగారు.. జగన్నాధుడు ఇవ్వాల్సిందే!

రెండుకోట్ల మంది క్రైస్తవులు, 5 లక్షల మంది పాస్టర్లు జగనన్న సీఎం కావడానికి కృషి చేశారని, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.రాజేంద్ర ప్రసాద్ గారు.. వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సన్మానసభలో అప్పుడెప్పుడో సెలవిచ్చారు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6.82 లక్షలుగా ఉన్న క్రైస్తవుల జనాభా.. కేవలం 9 ఏళ్లలో 2 కోట్లకు ఎలా చేరిందని.. దేభ్యమొహాలేసుకుని  దిక్కుమాలిన లాజిక్కులు, తింగరివేషాలతో  వెధవ ప్రశ్నలు వేయకండి. ఇంకా తవ్వుకుంటూ పోతే, బోలెడన్ని విభ్రాంతికర వాస్తవాలు వెలుగుచూస్తాయి. అన్ని లోతులు తవ్వే ఓపిక, తీరిక మనకు ఉండకపోవచ్చు. కానీ లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ.. అచ్చం అదే పనిమీద తవ్వి, ఆ కథను రాష్ట్రపతికి విప్పి విపులంగా వినిపించిందట. దానితో భృకుటి ముడిచిన రాష్ట్రపతి కోవిందుడు.. ఈ మతమార్పిళ్ల వ్యవహారంపై వెంటనే నివేదిక ఇవ్వాలని జగనన్న సర్కారును ఆదేశించారట. ఆదేశించింది హైకోర్టో, సుప్రీంకోర్టో అయితే జగనన్న సర్కారు లైట్ తీసుకునేదే. కానీ ఆదేశాలిచ్చాయన రాజ్యాంగధర్మకర్త. ఇష్టం లేకపోయినా, కష్టంగానయినా సరే వివరణ ఇవ్వాలిందే!

బాబు హయాం కంటే.. మూడింతలు పెరిగిన మతమార్పిళ్లు..

గత ఏడాది నుంచీ ఏపీలో 40శాతం మతమార్పిళ్లు విజయవంతంగా పూర్తి అయినట్లు, కేంద్రానికే కాదు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ఉన్న సమాచారం. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పటి కంటే,  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత,  మూడింతలు మతమార్పిళ్లుజరిగాయని, చంద్రబాబు నాయుడు అసమర్థ వైఖరి వల్ల.. అది తెలిసినా, దానిని  అరికట్టడంలో విఫలమయ్యారని ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వానికి ఉన్న సమాచారం. అయితే జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, అంతకు మూడింతలు రెట్టించిన ఉత్సాహంతో మత మార్పిళ్లు జరుగుతున్నాయని గ్రహించింది.  ప్రధానంగా, ప్రభుత్వ నియామకాలు, అంటే వాలంటీర్లు, గ్రామ-పట్టణ సచివాలయ  ఉద్యోగులలో అధిక శాతం క్రైస్తవులనే నియమించారన్న సమాచారం సంఘ్ నాయక త్వానికి ఉంది. గత ఏడాదిలో క్రైస్తవులకు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చామని గుంటూరు జిల్లా కలెక్టర్, ,స్వయంగాక్రిస్మస్ రోజు ప్రకటించిన విషయం సోషల్‌మీడియా ద్వారా వైరల్ అయింది. ఆ ఘటనతోనే, రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవ సంతుష్టీకరణ విధానాలు సంఘ్ దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో,  ఒక దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం తర్వాతనే.. సంఘ్ నాయకత్వం, ఏపీపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి.. మళ్లీ మతమార్పిడి కలకలం

నివేదికలతో నివ్వెరబోయిన సంఘ్-బీజేపీ..

ఆ తర్వాత.. ఏపీలో చాపకింద నీరులా జరుగుతున్న మతమార్పిళ్లపై లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సీరియస్‌గా దృష్టి సారించింది. మతమార్పిళ్లపై అధ్యయనం చేసిన ఆ  సంస్థ.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను ససాక్షంగా వివవరిస్తూ, రాష్ట్రపతి రామనాధ్ కోవిందుకు ఒక నివేదిక ఇచ్చింది. దానికి స్పందించిన ఆయన.. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి సీఎస్‌ను ఆదేశించింది. దీనితో కేంద్రంలోని బీజేపీ  నాయకత్వం కూడా  అప్రమత్తమయింది. ఇంకా ఏయే జిల్లాల్లో మతమార్పిళ్లు జరుగుతున్నాయని ఆరా తీసింది. ఆ ప్రకారంగా.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవుల జనాభా 630 మంది. కానీ ఒక్క  మద్దులపర్వ గ్రామంలోనే, 11 చర్చిలు ఉండటం సంఘ్-బీజేపీ నాయకత్వాన్ని విస్మయపరిచింది. ఆ జనాభా లెక్కను తెప్పించుకోగా, అసలు ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడూ లేడని స్మష్టమయింది. దీనితో 2011 జనాభా వివరాలు తీసుకున్న సంఘ్ నాయకత్వం.. వాటిలో ఉన్న వివరాలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలను బేరీజు వేసుకుని ఖంగుతింది. ప్రధానంగా… ఒక్క కృష్ణా జిల్లాలో వచ్చిన నివేదకలే, అటు సంఘ్-ఇటు బీజేపీ నాయకత్వాన్ని నోరెళ్లబెట్టేలా  చేశాయని చెబుతున్నారు.ఇది కూడా చదవండి.. అమరావతికి హిందూ దళం!

11 గ్రామాలు.. 68 చర్చిలా?

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో 11 గ్రామాలుంటే, అందులో 68 చర్చిలు ఉన్నట్లు ప్రభుత్వ రెవిన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే.. సగటున ఒక్కో గ్రామానికి, 6 చర్చిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.  ఆ ప్రకారంగా.. ఒక్క రాజధాని జిల్లాలోనే క్రైస్తవం ఈ స్థాయిలో ఉధృతంగా విస్తరిస్తుంటే, ఇక ఎస్సీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో, ఇంకా ఏ స్ధాయిలో జరుగుతుందో తెలుసుకుని అవాక్కయినట్లు సంఘ్ వర్గాల సమాచారం. అంటే దీన్నిబట్టి.. మతం మారిన దళితులు, చర్చిలకు వెళుతున్న వారు క్రైస్తవులుగా నమోదు చేసుకోకుండా.. దళితులుగానే కొనసాగుతూ ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను, అనుభవిస్తున్నారని గుర్తించింది. ఈ  వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నట్లు గ్రహించింది. ఆ ప్రకారంగా ఎస్సీ కుల ధృవీకరణ ఉన్న వారు, క్రైస్తవులుగా ఎలా కొనసాగుతారన్న ప్రశ్న వారిలో ఉదయించింది. దీన్నిబట్టి చూస్తే… మత మార్పిళ్లను  కట్టడి చేయడంలో, ఏపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న నిర్థరణకు సంఘ్-బీజేపీ నాయకత్వం వచ్చింది.

నిజమయిన రఘురాముడి ‘మతమార్పిళ్ల’ వాదన

కాగా.. ఏపీలో జనాభా లెక్కల ప్రకారం.. 2.5 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవుల సంఖ్య, ఏకబిగిన  25 శాతానికి పెరుగుతోందని.. ఇటీవలి కాలంలో గళం విప్పిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వాదనకు, కారణం ఇదేనని సష్టమవుతోంది. రాష్ట్రంలో గత ఏడాది కాలం నుంచీ జరుగుతున్న మతమార్పిళ్లపై,  రాజు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఆయన, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని గట్టిగా వాదిస్తున్నారని జరుగుతున్న ఘటనలు, వెలుగుచూస్తున్న నివేదికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్లపై, లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతికి ఇచ్చిన నివేదిక.. రఘురామకృష్ణంరాజు అదే అంశంలో చేస్తున్న ఆందోళన పరిశీలిస్తే, రాజు ఆందోళనలో వాస్తవం ఉందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల్లో  వ్యక్తమవుతోంది. మతమార్పిళ్లపై గళెమెత్తినందుకే, రాజుపై  వైసీపీ నాయకత్వం అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతోందని, ఇటీవలే పలు హిందూ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి.. రాజు గారిపై వేటు వెనుక… క్రైస్తవ కోణం?