వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

131

ఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు.
ఇదిలా ఉంటే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా గతంలో ఈ పేరుపై అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ తరఫున షోకాజ్ నోటీస్ పంపిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమైంది. పార్టీ విషయాలపై బహిరంగంగా మాట్లాడుతున్న రఘురామ రాజుపై మండిపడ్డ వైసీపీ అగ్రనాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది.