జగన్ పార్టీని రద్దు చేయండి

297

కేంద్ర ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.

నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదే

జాతీయ అధ్యక్షుడు మహబూబ్ భాష, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ స్పష్టం.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నీ రద్దు చేయాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తో కలిసి ఢిల్లీ లోకేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు .యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గా రిజిస్టర్ అయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా పిలుచుకోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు .ఒక పేరుతో రిజిస్టర్ అయి తమ పార్టీ పేరుతో చలామణి అవుతున్న జగన్ పార్టీపై కేంద్రఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేయడంతో జగన్ పార్టీకి, ఆపార్టీ నాయకులు వైయస్సార్ అనే పేరును ఎక్కడ ఉపయోగించరాద నీ, ఎన్నికల కమిషన్ పలుమార్లు సూచించిందని అయినప్పటికీ అధికార బలంతో తమ పార్టీ పేరు ఉపయోగించుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు .జగన్ తమ మేనిఫెస్టోలో ను,నవరత్నాలు కార్యక్రమంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉపయోగించుకుంటున్నారని, ఇటీవల ఎంపీ రఘురామ కష్ణ రాజు కు పంపిన షోకాజ్ నోటీసు లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు నే వాడుకుంటూ న్నారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముస్లిం సోదరుల ఓట్లతో అధికారం లో కి వచ్చిన జగన్, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును దౌర్జన్యంగా , అక్రమంగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని మహ బూబ్ భాష, అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కి ఛేందిన పెద్దలు తమ పార్టీ నాయకులు కార్యకర్తలను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయకుంా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్  సునీల్ అరోరా ను కలిసేందుకు వచ్చిన వా రికి ఆయన అందుబాటులో లేక పోవడం తో ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ దేవేంద్ర శర్మ ను కలిసి వారు పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును అందజేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోక పోతే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామనిమహ బూబ్ భాష ,అబ్దుల్ సత్తార్ జీ తెలిపారు.

2 COMMENTS