బ్రాహ్మణ మహిళలకు కూడా ఆర్ధిక భరోసా కల్పించాలి

406

బ్రాహ్మణ మహిళలకు కూడా కార్పొరేషన్ నుంచిఆర్ధిక భరోసా కల్పించాలని కోరుతూ గురువారం సచివాలయం వద్ద బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుని కలిసి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మలు వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  అన్ని సామాజిక వర్గాలకు ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నారని,అదే విధముగా పురహితాన్ని,సమజాహితాన్ని కోరే నిరుపేదలైన పురోహితుల కుటుంబాలు, చిన్న చిన్న బ్రాహ్మణ కుటుంబాలలోని మహిళలకు ఆర్థిక పరిస్థితి మెండుగా లేక తీవ్రమైన ఒత్తిడి, ఇబ్బందులకు గురిఅవుతున్నారని ,ప్రభుత్వం సాయం అందిస్తే బ్రాహ్మణులు జీవితాంతం జగన్మోహన్ రెడ్డిని గుర్తుంచుకొంటారని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోనే 34 ఏళ్ల అర్చకుల వంశపారం పర్య హక్కులు కూడా నెరవేరాయని గుర్తు చేశారు. కరోనా కష్ట కాలం లో కూడా ప్రభుత్వం అర్చకులకు 5000 వేలు ఇచ్చి ఆదుకొందని కొనియాడారు.
కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  దృష్టిలో ఉంచి బ్రాహ్మణ మహిళలను ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి పట్టణాలలో బ్రాహ్మణ భవనాల నిర్మాణం త్వరలో జరుగుతుందని అన్నారు.
ఎమ్మెల్సీ అబ్యర్ధిగా నామినేషన్ వేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ని కలిసి అభినందనలు తెలియజేశారు. కలిసిన వారిలో సమాఖ్య ముఖ్య సలహాదారులు శాస్త్రి,రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర మూర్తి,క్రమశిక్షణా కమిటీ వైస్ చైర్మన్ తోలేటి రవీంద్ర,రాష్ట్ర కార్యదర్శి పోతరాజు వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.