అర్హులందరికీ ఇల్ల స్థలాలు ఇవ్వాలి

158

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు

విశాఖజిల్లా :గురువారం పాయకరావుపేట శక్తి భవనం నందు ఆర్.డి.ఓ లక్ష్మిశివజ్యోతి, ఎమ్మార్వో అంబేద్కర్‌తో ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతు అర్హులైన వారి అందరికి ఇళ్ల స్థలాల పంపిణి తప్పకుండ జరగాలని తెలియజేసారు. మరియు మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కల, ఆశయం నెరవేరాలని అధికారులకు తెలియజేసారు. ఈ విషయమై అర్హులైన వారి అందరికి ఇల్ల స్థలాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ అధికారులకు తెలియజేసారు. ఈ ప్రక్రియలో భాగంగా నె 90రోజులు ఇల్ల స్థలాల దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇచ్చే అవకాశం వున్నదని అధికారులు చెప్పడంతో జులై 8వ తేదికి అంద చేసే కార్యక్రమంలోనే అర్హులకు ఇల్ల స్థలాలు ఇవ్వాలని ప్రతి లబ్ధిదారులకు తప్పనిసరిగా అందివ్వాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వై యస్ అర్ పార్టీ నాయకులు చిక్కాల రామారావు, మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.