పాలసీల పేరుతో సామాన్యుడికి టోపీ పెడుతున్న వైసిపి సర్కార్

393

– వెలగపూడిగోపాల కృష్ణ ప్రసాద్, శ్రీనివాసరాజు,అడ్డురి

ప్రకృతి సిద్దముగా లభించగా నదుల ద్వారా వచ్చిన ఇసుక మాత్రం రాజకీయ నాయకులు, అధికారులు,బడా బాబుల పేరిట కనక వర్షము వలె కోట్లాది రూపాయలు జేబులు నింపుకొంటున్నారు.వారివల్ల అమాయక ఓటరు (ప్రజలు) ప్రభుత్వాలు మారుతున్న వచ్చినవారి చేతులో మోసపోవటం వారికి పరిపాటు అయ్యింది.
వీటన్నిటికీ కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా పోషిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఇసుక నిల్వ కేంద్రల్లో పరిశీలనకు అన్ని జిల్లాల్లో భాజపా శ్రేణులు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఊర్మిలా నగర్ లోగల సోమా కంపనీ యార్డ్ నందు పార్టీ నేతలతో ఇసుక రవాణా రిజిస్టర్ బుక్కులు పరిశీలించడం జరిగింది .అక్కడ ఉన్న ఇసుకకు మిగిలిన స్టాకు నకు పొంతనలేదు అని మా దృష్టికి రావటం జరిగిందని భాజపా నాయకులు వాపోయారు.ఇసుక రిచ్ లనందు ఒక లారికి మినిమం 18 టన్నుల కెపాసిటీ వుండాగా వారు 30 టన్నుల ఇసుకనింపి బయట బ్లాక్ లో అమ్మి వేలాది రూపాయలు దండుకొంటున్నారని నాయకులు ఆరోపించారు.రోజుకో పాలసీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ భవన నిర్మాణ కార్మికుల చావులకు కారణం అవుతున్నారని ఆరోపించారు.ఈ విపత్కర పరిస్థితులు ఇలానే కోనసాగితే నిర్మాణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతాయని హెచ్చరించారు.ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక 2014 కు ముందు 3 నుండి 4 వేలకు దొరికేదని అదే ట్రాక్టర్ ను ఈ ప్రభుత్వం 10 వేలు చేసిందని దుయ్యబట్టారు.ఇక్కడ ఇసుక కొరత అంటూ అదే ఇసుక కోట్లాది రూపాయలు నాయకులు దండుకోవటం కోసం ఇసుకను ఎస్కార్ట్ వాహనాలు పెట్టి మరీ రాష్ట్రాలు దాటిస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో భాజపా నగర్ మాజీ అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్,అధికార ప్రతినిధులు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్,యు. శ్రీనివాసరాజు,వుల్లూరి గంగాధర్,భోగవల్లి శ్రీధర్ ఇంకా ఇతర నాయకులు పాల్గొన్నారు.