అచ్చెన్నాయుడిని బలిపశువును చేయాలని చూస్తున్నారు : చంద్రబాబు

352

అమరావతి : ఈఎస్‌ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ఈఎస్‌ఐ మాన్యువల్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని, కేటాయింపుల్లో మంత్రి ఎక్కడా ఉండడని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగితే.. అధికారుల పాత్రపై విచారణ జరిపించారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై అచ్చెన్నెయాడు ప్రశ్నించినందుకు.. ప్రభుత్వ అవకతవకలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపినందుకే ఆయనను అరెస్టు చేశారని చంద్రబాబు విమర్శించారు. అవినీతిపై గొంతెత్తి పోరాడే నాయకుడు అచ్చెన్నాయుడని చంద్రబాబు అన్నారు. అందుకే ఆయనను వేధిస్తున్నరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు అడినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించినట్టే.. వైసీపీ ప్రభుత్వ దోపిడిని అడ్డుకుంటున్నామనే ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు.
‘‘తప్పుడు కేసులు పెట్టి, చట్ట ఉల్లంఘన చేసి.. అచ్చెన్నాయుడిని బలిపశువును చేయాలని చూస్తున్నారు. రూ.40 వేల కోట్ల అవినీతి చేసి, 11 ఛార్జ్‌షీట్లలో ఏ-1గా ఉన్న జగన్‌.. అందరిపై బురదజల్లి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం దుర్మార్గం. జగన్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.. కాబట్టి వుయ్‌ స్టాండ్‌ విత్‌ అచ్చెన్నాయుడు అనే హాష్‌ట్యాగ్‌ దేశవ్యాప్తంగా నెంబర్‌వన్‌లో ఉంది. 14 ఏళ్లు సీఎంగా చేశాను. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చూడలేదు. ఓ నేరస్తుడే ముఖ్యమంత్రి అయి అందరిపై పైశాచికంగా కక్ష తీర్చుకుంటున్న పరిస్థితి ఏపీలో ఉంది. నవరత్నాలు.. నవమోసాలు.. జగన్‌ విధ్వంసం పరాకాష్టకు చేరింది. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి ఒక్కఛాన్స్‌ అడిగాడు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. 34 సంక్షేమ పథకాలను తీసేశారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకుంటున్నారు’’ అని  మండిపడ్డారు.

40 వేల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి.. పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నాడు

ఏ కేటాయింపుల్లో మంత్రి ఉండడు
అచ్చెన్నాయుడును బలిపశువును చేయాలనుకుంటున్నారు
కక్ష సాధింపులు తప్ప రాష్ట్రంలో పాలనే లేదు
అవినీతిపై పోరాడే నాయకుడు అచ్చెన్నాయుడని… అందుకే ఆయనను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీని అడ్డుకుంటున్నామనే ఉన్మాదంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏ కేటాయింపుల్లోనైనా మంత్రి ఉండడని… అధికారులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ ఈఎస్ఐలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగితే అధికారుల పాత్రపై విచారణ జరిపించారని… ఏపీలో మాత్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడును బలిపశువును చేయాలనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రూ. 40 వేల కోట్ల అవినీతి చేసి 11 చార్జ్ షీట్లలో ఏ1గా ఉన్న జగన్ రాక్షసానందం పొందాలనుకోవడం దారుణమని చెప్పారు. నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందని.. పైశాచికంగా కక్ష తీర్చుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ కారణాలన్నింటి వల్లే ‘వి స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా తొలి స్థానంలో ఉందని చెప్పారు. కక్ష సాధింపులు తప్ప రాష్ట్రంలో పాలన లేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయని, 34 సంక్షేమ పథకాలను తీసేశారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

పిల్లలు ఇంట్లో ఉన్నారు.. వారి మనోభావాలు ఏం కావాలి?

బాత్రూంలోకి, బెడ్రూంలోకి కూడా వెళతారా? అంటూ ఆగ్రహం
అక్రమాలపై పోరాడిన ఫలితం ఇదేనన్న చంద్రబాబు
ఇందుకేనా ఒక్క చాన్స్ అడిగింది? అంటూ ఫైర్
అక్రమ మైనింగ్, భూదందాలపై పోరాడినందువల్లే ఈ వేధింపులు అని ఆరోపించారు. ఆఖరికి బాత్రూంలోకి, బెడ్రూంలోకి కూడా వెళ్లి అచ్చెన్నను అరెస్ట్ చేశారని, ఆ సమయంలో వారి పిల్లలు కూడా అక్కడే ఉన్నారని, చదువుకున్న పిల్లలు వాళ్లు, వాళ్ల మనోభావాలు దెబ్బతినవా? అంటూ ప్రశ్నించారు. ఈ అరాచకాలకు అంతే లేకుండా పోతోందని అన్నారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చెబుతున్నవి నవరత్నాలు కాదని, నవమోసాలు అని ఎద్దేవా చేశారు. ఇందుకేనా ఒక్క చాన్స్ అని అడిగింది? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

భార్యకు చెప్పి వస్తానన్నా గానీ ఏంటా తొందర?ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తించారు?

ఓ ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేదంటూ మండిపాటు
నేరస్తుడు సీఎం అయితే అధికారులు పావులవుతారని వ్యాఖ్య
పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడ్ని వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపూరితంగా అరెస్ట్ చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశం ప్రదర్శించారు. ఓ ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం అంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగాలేదు, టాబ్లెట్లు తీసుకుని భార్యకు చెప్పివస్తానన్న వ్యక్తిని ఎందుకంత బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఐదు, పది నిమిషాల్లో ఏం జరిగిపోతుందని ప్రశ్నించారు.
“ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తించారు? నేను కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేశాను. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. ఓ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, అధికారులు అతని చేతిలో పావులుగా మారడం ఎంతో బాధాకరం” అంటూ వ్యాఖ్యానించారు. 35 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి పైకెదిగిన వ్యక్తిని, అతని కుటుంబాన్ని వేధిస్తున్నారని తెలిపారు. “ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానించారు. ఆంబోతు అని, బంట్రోతు అని అన్నారు. ఆకారం పెరగడం కాదు బుర్ర పెరగాలన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ మాటన్నారు. ఇన్ని చేసినా ప్రజల కోసం అచ్చెన్న అనునిత్యం పోరాడాడు. ఇసుక మాఫియా అంశంలో, మద్యం విషయంలో పోరాడుతున్నాడు” అంటూ అచ్చెన్నకు మద్దతు పలికారు.

శస్త్రచికిత్స జరిగి రెండ్రోజులే అయింది… బలవంతంగా తీసుకెళతారా?

ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపాటు
అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకెళతారా అంటూ మండిపడ్డారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో ఎవరికీ చెప్పకుండా, ఎక్కడెక్కడో తిప్పి, చివరికి విజయవాడ తీసుకొస్తారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. మీ కక్ష సాధింపు చర్యలకు అంతులేదా అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. “మీరు విచారణకు పిలిస్తే రానన్నాడా, మీరు నోటీసులిస్తే స్పందించలేదా, ఏంటి అచ్చెన్నాయుడు చేసిన నేరం? మీకు అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా?” అంటూ నిప్పులు చెరిగారు. అచ్చెన్నాయుడుపై ఆరోపణలన్నీ కల్పితాలేనని అన్నారు. విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్న పేరు లేదని, ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్ , విజయ్ ల పేర్లు మాత్రమే రిపోర్టులో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. మరీ దుర్మార్గంగా అచ్చెన్న ఇంటికి వెళ్లి, అరెస్ట్ గురించి చేతితో రాసిస్తారా? అంటూ మండిపడ్డారు. అచ్చెన్న అరెస్ట్ విషయాన్ని వైసీపీ వాళ్లు ఒకరోజు ముందే సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయగలిగారంటూ నిలదీశారు.