రామ్మోహన్..‌ లోకేష్‌కు సమ ఉజ్జీనే

164

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది.. అజ్ఞానం బయటపడదు. రామ్మోహన్‌ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్‌పోజ్‌ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు’ అని ట్వీట్‌ చేశారు.