కొయంబత్తూరు కొత్తపేరు కొయంపుత్తూరు

362

*1018 ఏరియాల పేర్లు మార్చుతూ తమిళనాడు సర్కార్​ జీవో

చెన్నై : తమిళనాడులోని ప్రముఖ సిటీ కొయంబత్తూరు పేరు మార్చారు. ఇక నుంచి దీనిని కొయంపుత్తూరు గా పిలవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ లోనూ మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఒకటి, రెండు కాదు ఏకంగా 1018 ఏరియాల పేర్లను మార్చుతూ 38 పేజీల జీవోను పళనిస్వామి సర్కార్​ గురువారం జారీ చేసింది. బ్రిటీష్ టైం లో తమిళనాడులోని చాలా ప్రాంతాల పేర్లను ఇంగ్లీష్ యాక్సెంట్ కు అనుగుణంగా మార్చారు. అలాంటి వాటన్నింటికీ తమిళ నేటివిటీ ఉండేలా మార్పు చేస్తు్న్నారు. ఇప్పటికే మద్రాస్ ను చెన్నై గా మార్చారు. తమిళనాడులో ఊళ్ల పేర్లను జనం ఎలా పలుకుతారో అదే విధంగా మార్చుతున్నారు. 40 ప్రాంతాలకు సంబంధించి ఇంగ్లీష్ స్పెల్లింగ్ ల్లోనూ మార్పులు చేశారు. వీటిలో పలు జిల్లాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ లోనే పేర్ల మార్పుపై నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా గురువారం నుంచి మార్చిన పేర్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్స్, బోర్డులలో త్వరలోనే కొత్త పేర్లను రాయనున్నారు. కొయంబత్తూరు పేరు,స్పెల్లింగ్ మార్చటం పై సోషల్ మీడియా లో జోకులు పేలుతున్నాయి.