సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ప్రతిపక్ష ఉప నాయకుడు కె.అచ్చెంనాయుడును అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ముందు అరెస్టు చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు

ఈ మేరకు కె, రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు ప్రకటించినందున ఈ సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడైన కె.అచ్చెంనాయుడును అరెస్టు చేయడం సరికాదు. అరెస్టుకు వందలాది మంది పోలీసులు పంపి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం అవసరమా? ఆయనేమన్నా దేశం వదలిపెట్టి పారిపోతున్నాడా? నిజంగా ఆయన మీద కేసు ఉంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత విచారణ జరపవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు ఇదంతా చేస్తున్నదన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. నిజంగా అవినీతి జరిగితే దానిని ఎవరూ సమర్ధించరు. కాని ఆ పేరుతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో అరెస్టులకు పాల్పడి, ప్రతిపక్షాల నోరు నొక్కడం సమంజసం కాదు.

Leave a Reply

Close Bitnami banner