సీఎం కార్మికుల పొట్టగొడుతున్నారు: మాణిక్యాలరావు

105

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. నేడు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ.. ఇసుక దందాకు సీఎం అండ ఉందన్నారు. గనుల శాఖమంత్రి చెప్పినట్లు ఇసుక పాయింట్‌లో వ్యత్యాసం ఉందంటున్న దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవరత్నాలకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చి సీఎం కార్మికుల పొట్టగొడుతున్నారు. ఇసుక‌పై సరైన మార్గదర్శకాలు సూచించాలన్నారు. ఆన్‌లైన్‌లో కొత్త విధానమంటూ నూతన విధానం తీసుకువచ్చి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరు మారాలని మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు.