చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను.. నయానో… భయానో.. పార్టీలోకిచేర్చుకుని ఆ సామాజికవర్గానికి చెందిన వారు.. అవకాశవాదులు, పిరికి పందలు, తమ వ్యాపార,రాజకీయ, అధికార అవసరాల కోసం నమ్మిన వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మెజార్టీ ప్రజలు భావించాలనే ఆలోచనతో.. ముఖ్యమంత్రి జగన్‍ ఆ విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నిన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ఇద్దరికీ ఆ సామాజికవర్గంలో ఎంతో విలువ ఉంది. ఆఇద్దరిని ఆ సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు గుడ్డిగా నమ్ముతారు. అలాంటి వారి నమ్మకాలను వమ్ము చేసి రాజకీయ, అధికార లబ్ది కోసం ఎంతకైనా దిగజారతారని వంశీ, కరణం పార్టీ ఫిరాయించటంతో నిన్నటి వరకు వారిద్దరినీ అభిమానించిన వారు తాజాగా ఛీ కొడుతున్నారు.

కమ్మ వారికి అధికారం కావాలి.. అవసరాలు గడవాలి.. ఆయా అధికారాలు, అవసరాల కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తాం.. రాజకీయ, అధికార లబ్ది కోసం ఎంత దూరం అయినా వెళతాం అనుకునే విధంగా జగన్‍ చేసిన ప్రయత్నాలు ఎంత వరకు ఫలించబోతున్నాయి అనే విషయం పక్కన పెడితే.. ఆసామాజికవర్గానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎంతో దిగజారిపోతున్నారని.. ఒకప్పుడు ఎలాంటి సామాజికవర్గం.. తాజాగా ఆ సామాజికవర్గం వారు పౌరుషాలు చంపుకుని నిన్నటి వరకు ఎదురించిన ప్రత్యర్ధుల కాళ్లపై పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. చివరకు మారు మూల గ్రామాలలో కూడా ఐదేళ్లు అధికారం చెలాయించిన చోటా నాయకులు కూడా తాజాగా మౌనం వహిస్తూ.. ప్రత్యర్ధులకు వంగి వంగి దండాలు పెడుతూ కాలం గడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఆ సామాజికవర్గానికి చెందిన మేధావులు 30 ఏళ్ల కిందటే విదేశాలకు వెళ్లి తమ ప్రతిభను చూపారు. ఒకప్పుడు ఆసామాజికవర్గం అంటే ప్రజలు ఎంతో భక్తిగా ఉండేవారు. ఇప్పుడు ఆసామాజికవర్గం వారిని మిగతా సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఖాతరు చేయని పరిస్థితిని మీరే కొని తెచ్చుకున్నారని కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్లు చెబుతున్నారు. ఇద్దరు మ్మెల్యేలు పార్టీ ఫిరాయించటం.. తమ వ్యాపారాలు, అవసరాల కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితిని కొని తెచ్చుకుని ఆసామాజికవర్గానికి తల వంపులు తెచ్చారంటున్నారు. జగన్‍కు ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన పథకం ప్రకారం ఆ సామాజికవర్గాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించనప్పటికీ.. చేస్తున్న ప్రయత్నాలు ముందు ముందు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner