యాదాద్రి : చౌటుప్పల్ సమీపంలోని దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్‌జిటి నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందంటూ చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై బెంచ్.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. చౌటుప్పల్‌లో ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉంటారు. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరించి కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner