హోరెత్తనున్న.. హిందుత్వం?

664

మత మార్పిళ్లపై రోడ్డెక్కనున్న హిందూ సంస్థలు
88 శాతం ఉన్న హిందూ అర్చకులకు 16 కోట్లు
2 శాతం ఉన్న క్రైస్తవ పాస్టర్లకు 14 కోట్లా?
వైసీపీ  వాలంటీర్లతో మాయాజాలం చేస్తారా?
గుంటూరు,కృష్ణాలో పెరుగుతున్న మత మార్పిళ్లు
హిందూ ధర్మంపై త్వరలో జాతీయ మహాసభ?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో జరుగుతున్న హిందూ వ్యతిరేక- క్రైస్తవ అనుకూల విధానాలపై హిందూ సంస్థలు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా.. ఇటీవల లాక్‌డౌన్‌లో నష్టపోయిన హిందూ-క్రైస్తవ-ముస్లిం మత పెద్దలకు జగన్ సర్కారు ప్రకటించిన నిధుల ఎంపిక ప్రాతిపదికపై, హిందూ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై హిందూ సంస్థలు, నేతలతోపాటు, మఠాథిపతులు, పీఠాథిపతులు కూడా మూకుమ్మడిగా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అఖిల భారత హిందూ మహాసభ నేతృత్వంలో, ఇప్పటికే ఆ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.

ఇదీ వన్‌టైం డబ్బు లెక్క..

లాక్‌డౌన్ కారణంతో ఆదాయం కోల్పోయిన అర్చకులు, పాస్టర్లు, ముల్లాలకు ఐదు వేల రూపాయల చొప్పున ఒక్కసారికి ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రకారంగా.. 77,290 మందికి 37 కోట్ల 71 లక్షల రూపాయలివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో 33,803 మంది అర్చకులకు 16 కోట్ల 77 లక్షల రూపాయలు, 13,646 మంది ముల్లాలకు 5 కోట్ల 82 లక్షల రూపాయలు, 29,841 మంది చర్చి పాస్టర్లకు 14 కోట్ల 92 లక్షల 5 వేల రూపాయలు విడుదల చేసింది.

ఇదేం ప్రాతిపదిక..?

అయితే, ప్రభుత్వం ఐదువేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఎంపిక చేసుకున్న ప్రాతిపదిక హిందూ సంస్థల ఆగ్ర హం, అసంతృప్తికి కారణమయింది. రాష్ట్ర జనాభాలో 88 శాతానికి  ఉన్న హిందువులు, దేవాలయాలకు ప్రాతినిధ్యం వహించే అర్చకుల సంఖ్యను 33,803గా నిర్ణయించిన జగన్ సర్కారు.. కేవలం 2.8 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించే పాస్టర్ల సంఖ్యను, 29,841గా నిర్థారించడంపై హిందూ  సంస్థల ఆగ్రహానికి కారణమవుతోంది. దీనిని బట్టి.. రాష్ట్రంలో చర్చిలు తామరతంపరగా ఏవిధంగా పుట్టుకొస్తున్నాయన్న  వాస్తవం స్పష్టమవుతోందని హిందూ సంస్థల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

పాస్టర్లను ఏ ప్రాతిపదిక ఎంపిక చేశారు: జంధ్యాల రవిశంకర్

దీనిప్రకారం రాష్ట్రంలో దేవాలయాలు-అర్చకుల కంటే.. చర్చిల సంఖ్య ఎక్కువగా ఉన్నాయన్న సంకేతాలివ్వడం, హిందూమతానికి పెరుగుతున్న ప్రమాదంగా హిందు సంస్థల నేతలు గుర్తిస్తున్నట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది. ఇది కూడా చదవండి.. జగన్ సర్కారుకు.. ‘లాయర్ జంధ్యాల’ ఝలక్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రాతిపదికకు ఆధారం ఏమిటని అఖిల భారత హిందూ మహాసభ ప్రశ్నించింది. గత ఆరు నెలల క్రితం ఏపీలో జరుగుతున్న మత మార్పిళ్లు, దేవతావిగ్రహాల విధ్వంసాలకు నిరసనగా హిందూమహాసభ భారీ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆసమయంలో మతమార్పిళ్లకు సంబంధించి జరిగిన సంఘటనలపై మహాసభ నేత జంధ్యాల రవిశంకర్ మీడియా వేదికగా జగన్ సర్కారు వైఖరిని తూర్పారపట్టారు. గతంలో జంద్యాల రవిశంకర్ రాజధానిని అమరావతి నుంచి మార్చేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్న విషయం తెలిసిందే.  ఇది కూడా చదవండి.. ఏపీ మరో యుపి అవుతుందా?

‘అసలు పాస్టర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? వారిలో కేవలం క్రైస్తవ మతస్తులే ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మతం మార్చుకున్న వారూ పాస్టర్ల అవతారం ఎత్తి, ప్రభుత్వ నిధులు తీసుకుంటే ఎలా కుదురుతుంది? మతం మారితే ఎలాంటి సౌకర్యాలుంటాయో, ఉండవో చట్టం స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం గుర్తించి ఐదువేలు తీసుకున్న పాస్టర్లలో రెడ్డి,కమ్మతో సహా మతం మారిన బీసీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారు చట్టం ప్రకారం క్రైస్తవులు ఎలా అవుతారు? రెండు గుడిసెలో, రెండు గదులో అద్దెకు తీసుకుని పైన శిలువ వేసినవన్నీ చర్చిలు,  వాళ్లంతా పాస్టర్లవుతారా? అర్చకులకు ఆగమ పరీక్షలుంటాయి. దేవదాయ ధర్మాదాయ శాఖ గుర్తించిన వేదపాఠశాలలలో, వేదం చదివిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తారు. మరి ప్రభుత్వం ఐదువేల రూపాయలు ఇచ్చిన  29,841 మందిని పాస్టర్లుగా గుర్తిస్తూ ఇచ్చిన వారి వద్ద ఏమైనా సర్టిఫికెట్లు ఉన్నాయా? అసలు ప్రభుత్వ డబ్బుతో మత పెద్దలకు డబ్బులిచ్చే విధానాన్ని చట్టం అంగీకరిస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన బట్టి.. ఏపీలో ఎంత వేగంగా ప్రభుత్వ మద్దతుతో మత మార్పిడి జరుగుతుందో, ప్రభుత్వ క్రైస్తవ సంతుష్టీకరణ విధానాలు ఎంత జోరుగా సాగుతున్నాయో అర్ధమవుతోంది. దీనిపై హిందూసమాజంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మేం గతంలోనే ఓసారి విజయవాడలో, జగన్ ప్రభుత్వ క్రైస్తవ సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా భారీ ధర్నా నిర్వహించాం. ఈసారి విజయవాడ వేదికగా హిందూమహా సమ్మేళం నిర్వహించబోతున్నాం. దానికి పీఠాథిపతులు, హిందూ సంస్థలను ఆహ్వానిస్తామ’ని అఖిల భార త హిందూ మహాసభ తెలుగు రాష్ట్రాల బాధ్యుడు, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్  వెల్లడించారు.  ఇది కూడా చదవండి.. అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది! ఇప్పటికే జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన క్రైస్తవ అనుకూల విధానాలను జాతీయ స్థాయి హిందూసంస్థలు ‘తగిన వేదిక’లకు ఫిర్యాదు చేశారన్నారు. తమ అఖిల భారత సిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు కూడా ఏపీపై దృష్టి సారిస్తున్నారని జంధ్యాల వెల్లడించారు. ఇది కూడా చదవండి.. విగ్రహ విధ్వంసంపై రోడ్డెక్కనున్న పీఠాధిపతులు

ఇదిలాఉండగా.. గతంలో అమరావతి రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించిన జంధ్యాల.. బెజవాడలో హిందూమహాసభ కార్యకర్తలతో భారీ ధర్నా నిర్వహించారు. హిందువుల మనోభావాలకు ప్రతీకగా ఉన్న అమరావతిని రాజధానిగా మార్చేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి.. రాజధానిపై రంగంలోకి హిందూ మహాసభ

పాస్టర్ల సర్టిఫికెట్ లేకుండానే  ఎంపిక చేశారా?

నిజానికి పాస్టరు కావాలంటే, దానికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఏపిటీసీ వంటి సంస్థలు పాస్టర్లకు శిక్షణ ఇస్తుంటుంది. శిక్షణ ముగిసిన తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇస్తుంటాయి. కానీ, వైసీపీ వాలంటీర్లు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే, ఇష్టం వచ్చిన వారికి పాస్టర్ల కేటగిరిలో 5 వేల రూపాయలిచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో ఒక గుడిసె, దానికి ముందు శిలువ..పట్టణాల్లో రెండు గదులు, పైన శిలువనే ప్రాతిపదికగా తీసుకున్నారే తప్ప.. వారి నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేదని, పోనీ వారు ఎన్నాళ్లుగా పాస్టర్లుగా కొనసాగుతున్నారన్న వివరాలు కూడా నమోదు చేసుకోకుండానే, ఐదువేల రూపాయలిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాలంటీర్లలో చాలామంది పాస్టర్లు, వారి తనయులు కూడా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 29,841 మంది పాస్టర్లలో అసలు సిసలు  క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మతం మారిన వారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు మరచి, అంతమందికీ ఐదువేల రూపాయలు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు, ఇప్పుడు హిందూ సంస్థల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కూడా చదవండి.. మళ్లీ మతమార్పిడి కలకలం

అవన్నీ కాకిలెక్కలే: చైతన్య

ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 2.8 శాతమే ఉన్న క్రైస్తవులు గౌరవించే పార్టర్లే 29,841మంది ఉంటే, అదే ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 శాతానికి పైగా ఉన్న హిందువులు గౌరవించే అర్చకుల సంఖ్య, దేవాలయాలు ఇంకెన్ని ఉండాలని బిజెపి ధార్మిక సెల్ అధ్యక్షుడు తూములూరు చైతన్య ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించినవన్నీ కాకిలెక్కలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో ఉన్న రామాలయాలు, వాటిలో పనిచేసే అర్చకుల సంఖ్యను  పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం దేవదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాలనే పరిగణనలోకి తీసుకుని, అందులో పనిచేసే అర్చకులకే ఐదువేలు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.  కాగా అమరావతిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వ చర్యలను బీజేపీ ధార్మిక సెల్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి.. అమరావతికి అమ్మవారి సెంటి‘మంట’

చర్చి, మసీదు ఆదాయం తీసుకోరా?

‘ప్రభుత్వానికి దేవాయాల నుంచి ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు సమీకరిస్తుంది. ప్రభుత్వం గుళ్లకు నయాపైసా ఇవ్వదు. పైగా తీసుకుంటుంది.  కాబట్టి అర్చకులకు ఐదువేలు ఇవ్వడాన్ని సమర్ధించవచ్చు. కానీ చర్చి, మసీదుల నుంచి నయా పైసా ఆదాయం రాకపోయినా, వాటిలో పనిచేసే వారికి ప్రభుత్వ నిధుల నుంచి డబ్బులెలా ఇస్తారు? గుళ్ల మాదిరిగా వాటికి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు? కరోనా సమయంలో దేవాలయాలను క్వారంటైన్లుగా మార్చే ప్రయత్నం చేసిన జగన్ ప్రభుత్వం.. చర్చి, మసీదులను కూడా క్వారంటైన్లుగా మార్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? జగన్ అనుసరిస్తోన్న క్రైస్తవ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తాం. రాష్ట్రంలో  29,841మంది పాస్టర్లు ఉన్నారంటే, క్రైస్తవం ఏ స్థాయిలో చాపకింద నీరులా విస్తరిస్తుందో, దానికి జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో  హిందూ సమాజం గుర్తించాల’ని బీజేపీ ధార్మిక సెల్ అధ్యక్షుడు తూములూరు చైతన్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో చర్చి, మసీదు పెద్దలకు గౌరవ వేతనంపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు.

శిక్షణ లేని పాస్టర్ల సంఖ్యనే ఎక్కువ..

కాగా..  రాష్ట్రంలో  29,841మంది పాస్టర్లు ఉన్నారన్న ప్రభుత్వ లెక్కలపై, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు దీనిపై నిజమైన క్రైస్తవులలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండటం విశేషం. నిజానికి పాస్టరు కావాలంటే దానికి శిక్షణ అవసరమని స్పష్టం చేస్తున్నారు. కానీ అలాంటివేమీ లేకుండానే చాలామంది పాస్టర్లుగా పుట్టుకువస్తున్నారు. అలాంటి వారి వల్ల నిజమైన క్రైస్తవులకు అవకాశాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏసీటీసీలో శిక్షణ తీసుకున్న వారికి పాస్టర్ల సర్టిఫికెట్లు ఇస్తారు. డీటీహెచ్ (డిప్లమో ఇన్ థియోలజీ) చదివే వారికి డిగ్రీ, బీటీహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ థియోలజీ) చదివే వారికి ఇంటర్ కనీస అర్హతగా నిర్ణయించారు. ఇది ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల కోర్సుగా ఉంటుంది. ఆర్‌సీఎం (రోమన్ క్యాథలిక్ మిషన్)లో ఫాదర్ల కోర్సు ఏడేళ్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఎలాంటి విద్యాభ్యాసం లేకుండా, నక్కను కొట్టిన ప్రతివాడూ వేటగాడే అన్నట్లు.. ప్రతివాడూ పాస్టర్లయిపోతున్నారని వ్యాఖ్యానించారు. వీరిలో ఫాదర్లు వివాహం చేసుకోరు. కానీ పాస్టర్లు మాత్రం పెళ్లి చేసుకుంటారు.  రాయలసీమలో రెడ్డి, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు, గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లో కమ్మ కులస్తులు ఎక్కువమంది, మతం మారి పాస్టర్ల అవతారమెత్తుతున్నారని వివరించారు. వీరిలో గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని.. రావిపాడు గ్రామానికి చెందిన కమ్మ సామాజికవర్గం వారిలో ఎక్కువమంది ఇటలీ వెళ్లి, అక్కడ బిషప్, పాస్టర్లు, ఫాదర్లుగా మారి, ఏపీకి వచ్చి పెద్ద పెద్ద  చర్చిలలో పనిచేస్తున్నారని ఓ క్రైస్తవ ప్రముఖుడు వెల్లడించారు. కానీ, జగన్ సర్కారు నుంచి ఐదువేలు తీసుకున్న పాస్టర్లలో.. 65 శాతం మంది ఎలాంటి సర్టిఫికెట్, కనీసం డిగ్రీ అర్హత కూడా లేని వారున్నారని వివరించారు. ఓ గుడిసె వేసి శిలువ పెట్టి పాస్టరు అవతారమెత్తేవారి సంఖ్యనే ఎక్కువంటున్నారు.

ఏపీ-తెలంగాణలో క్రైస్తవంపై రాష్ట్రపతికి వీహీచ్‌పీ నివేదిక

కాగా ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవమతం విస్తరిస్తున్న వైనంపై.. విశ్వహిందూ పరిషత్  రూపొందించిన ఒక  నివేదికను, కొద్దికాలం క్రితం రాష్ట్రపతి రామనాధ్ కోవిందుకు వీహెచ్‌పి ప్రతినిధి బృందం అందించింది. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ, ఉత్తరాంధ్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వి.శ్రీవెంకటేశ్వర్లు, దక్షిణాంధ్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.సాయిరెడ్డి, తెలంగాణ కార్యదర్శి బండారి రమేష్‌తో కూడిన ప్రతినిధి బృందం, రాష్ట్రపతిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసింది. అందులోని ప్రధానాంశాలు ఇవీ..
– తాను క్రైస్తవుడిని కావడం వల్లనే జగన్ తనను ఈ జిల్లాకు కలెక్టర్‌గా నియమించారని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ బహిరంగంగానే ప్రకటించారు. గత 6 నెలల్లో జిల్లాలో, 6 వేల మంది క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇది క్రైస్తవ ప్రభుత్వం కావడం వల్ల, ఈ వర్గం వారికోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
– ఆలయ టస్ట్రుల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులను నియమించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రైస్తవులయిన ఆనంద్‌రాజు, రాజశేఖరబాబులను టీటీడీ ట్రస్టులో సహాయ కార్యనిర్వహక అధికారులుగా నియమించారు.
– హిందూ దేవాలయాల భూములను హిందూ-ముస్లిం అవసరాల కోసం జగన్ సర్కారు ఇచ్చేస్తోంది. సింహాచలం భూములను చర్చిలకు అప్పగించింది. కడప జిల్లాలో వీరభద్రస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలను వక్ఫ్‌కు కట్టబెట్టారు.
-పండుగల సమయంలో పవిత్ర స్థలాలను హిందువులు సందర్శించే బస్సు చార్జీలను 50 నుంచి 100 శాతం పెంచుతున్నారు. క్రైస్తవ-ముస్లింలను మాత్రం వారి పవిత్ర స్థలాలకు ఉచితంగా తీసుకువెళుతున్నారు.
– ముస్లిం-క్రైస్తవ మత గురువులకు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో వేతనాలిస్తోంది.
ఇవి కూడా చదవండి… పిండాలకూ.. తప్పని ‘పన్ను’పోటు!
పీఠం.. మఠాల నుంచి బయటకు రారా స్వామీ?
టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది?

1 COMMENT