బహిరంగ చర్చకు సాక్షి మీడియా సిద్దమా

612

ఇస్కపల్లిలో జరిగిన అభివృద్ది పై బహిరంగ చర్చకు సాక్షి మీడియా సిద్దమా , వారం గడువు ఇస్తా…. నా పై ఆరోపణలు రుజువు చేయండి లేని పక్షంలో క్షమాపణ చెప్పండి — బీద రవిచంద్ర , శాసన మండలి సభ్యులు , జిల్లా టిడిపి అధ్యక్షులు

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు , శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జాతీయ రహదారి (NH 5) నందుగల సాక్షి ఎడిషన్ కార్యాలయం లో సాక్షి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు గారికి, తనపై వచ్చిన అవాస్తవ కథనాలను రుజువు చేయాలని కోరుతూ లేఖ అందించడం జరిగింది.

ఈ సందర్భంగా బీద రవిచంద్ర గారు మాట్లాడుతూ……….

👉 జిల్లా టిడిపి అధ్యక్షులుగా , శాసన మండలి సభ్యులుగా వున్న నా పై గడిచిన నాలుగు సంవత్సరాలుగా సాక్షి మీడియా లో అనేక అవాస్తవ కథనాలు ప్రచురితం చేస్తున్నారు.
👉 సాక్షి పత్రికలో పదే,పదే నా పై వచ్చే కథనాలు అవాస్తవమని, పత్రిక సమావేశాల ద్వారా వివరణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది .
👉 అబద్ధపు ప్రచారాలతో, అవాస్తవ కథనాలతో సాక్షి మీడియా నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని వేధిస్తోంది.
👉 ఎన్నికల ముందు కూడా మా కుటుంబ సభ్యుల మధ్య , సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని మరియు నా భార్య పేరును సైతం అవాస్తవ కథనాల్లో జొప్పిస్తూ సాక్షి మీడియా మానసికంగా వేధించింది.
👉 నా కంపెనీలపై, వ్యాపారాల పై అర్థం పర్థం లేని వార్తలు రాసింది, ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా సాక్షి మీడియా తీరు మారడం లేదు.
👉 మే 26 న మత్స్యకారుల వరప్రదాయిని ఫిష్ ల్యాండ్ పేరుతో సాక్షి పత్రికలో రాసిన కథనంలో 20 సంవత్సరాలుగా మత్స్యకార గ్రామాలను అడ్డుపెట్టుకొని బీద రవిచంద్ర రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని వ్రాశారు.

👉 నా పై వచ్చిన కథనంపై సాక్షి మీడియాకు 7 రోజుల గడువు ఇస్తున్నా….. ఇస్కపల్లి లో బహిరంగ చర్చకు సాక్షి మీడియా రావాలని ఆహ్వానిస్తున్నా.
👉 సాక్షి మీడియాలో వచ్చిన కథనాలలో వాస్తవాలు ఉంటే నిరూపించండి , నేను రాజకీయాల్లోకి వచ్చాక మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేశానో , లేదో ప్రజల వద్దకే వెళ్లి ప్రశ్నిద్దాం.
👉 ఇస్కపల్లి మత్స్యకార గ్రామాలలో తెదేపా హయాం లో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు నేను సిద్ధం గా వున్నాను.
👉బీద రవిచంద్ర గారి నాయకత్వం లో ఇస్కపల్లి మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందలేదని ప్రజలు చెబితే సాక్షి మీడియా కి బహిరంగ క్షమాపణ చెబుతా….
👉సాక్షి మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవాలు నిరూపించ లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సాక్షి మీడియా సిద్ధమా ?
👉 మత్స్యకార గ్రామాలలో ఉన్న లైట్ హౌస్ ను , 1999 లో నే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ది .
👉తెదేపా హయాంలో నిర్మించి, నేడు శిథిలావస్థకు చేరిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు 21 సంవత్సరాల తర్వాత మళ్లీ పునర్నిర్మిం చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించాము. మేము ప్రతిపాదించినా ప్రభుత్వం మారడంతో మీకు అవకాశం వచ్చింది.
👉 లైట్ హౌస్ కి, టూరిజం సెంటర్ కి తెలుగుదేశం పార్టీ హయాంలో భూములు ఉచితంగా ఇచ్చాం .
👉 ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు మత్స్యకార గ్రామాలకు తీసుకువచ్చి అభివృద్ది కి కృషి చేశా.
👉 లైట్ హౌస్ , టూరిజం సెంటర్ లు , గృహనిర్మాణాలు, కాలువలపై బ్రిడ్జి లు , సిమెంట్ రోడ్లు, పాఠశాల భవనాలు , తుఫాన్ షెల్టర్ లు మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయించాము.
👉సాక్షి మీడియా కు తాము వ్రాసిన అవాస్తవ కథనాల పై నమ్మకం వుంటే ఇస్క పల్లి గ్రామానికి వచ్చి రుజువు చేయాలని బహిరంగ సవాల్ విసురుతున్నాను.

ఈ కార్యక్రమం లో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి , మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి , డా.z. శివ ప్రసాద్ , ఆనం వెంకటరమణారెడ్డి , TNSF జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు , ప్రధాన కార్యదర్శి అమ్రుల్లా , ST సెల్ అధ్యక్షులు రంగారావు , సురేంద్ర బాబు, పి. సాయి కిషోర్, గడ్డం మహేంద్ర బాబు , మోను , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.