దేశ ప్రజలకు,బిజెపి కార్యకర్తలకు అభినందనలు:నడ్డా

573

బహుముఖ అభివృద్ధి కై, దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రెండవ పదవీకాలం ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ , కేంద్రం హోం మంత్రి అమిత్ షా  తరపున మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా  దేశ ప్రజలకు, కోట్లాది మంది బిజెపి కార్యకర్తలకు అభినందనలు తెలుపారు.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా  సందేశం :

🔸 భారత ప్రధాని  నరేంద్ర మోదీ  మొదటి పదవీ కాలం భారత దేశం దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలను ఏర్పరచటంలో నిమగ్నమై ముందుకు సాగింది.

🔸 మోదీ ప్రభుత్వ రెండవ పదవీ కాలం యొక్క మొదటి సంవత్సరంలో దేశ అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవటంలో మోదీ సర్కార్ 2.0 ప్రసిద్ది చెందింది.

🔸ఈ ఒక సంవత్సరంలో దేశంలో ప్రజా ప్రయోజన నిర్ణయాలను మోదీ గారి ప్రభుత్వం అమలు చేసింది. మోదీ గారి నిర్ణయాల వలన దేశ ఐక్యత, సార్వభౌమత్వం, ప్రజలకు సాంఘిక మరియు ఆర్ధిక న్యాయం అందించడంతో పాటు, సైద్ధాంతిక పరిపూర్ణత చేకూరింది.

🔸సవాళ్ళను అవకాశాలుగా మార్చటంలోనే మోదీ గారి నాయకత్వం యొక్క సామర్థ్యం ప్రతిబింబించింది. గత 6 సంవత్సరాల్లో దేశ ప్రజలు మోదీ గారి సమర్థవంతమైన పాలన చూశారు.

🔸 కొరోనా కష్టకాలంలో పెను సవాలును ఎదుర్కోవడంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజల భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చి కొరోనాకు వ్యతిరేకంగా అద్భుత ఫలితం సాధించారు. జనతా కర్ఫ్యూ , సామాజిక దూరం , మాస్కులు ధరించడం, ఆరోగ్య సేతు సురక్షా కవచం, ఆరోగ్య సిబ్బంది కృషి, చర్యలు, పోలీసుల కృషి వంటి పలు అంశాల విషయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతి అభ్యర్థనకు పూర్తి విశ్వాసంతో ప్రజలు అపూర్వమైన మద్దతు ఇచ్చారు.

🔶 స్పష్టమైన విధానం మరియు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలతో అయినా భారత్ పోరాడగలదు మరియు సమస్యలు పరిష్కరించగలదు అని ప్రధాని శ్రీ మోదీ గారు ప్రపంచానికి చూపించారు.

🔶 ప్రధాన మంత్రి ఒక ప్రధాన సేవకుడిగా , ఒక సంరక్షకుడిగా దేశవాసులను ప్రోత్సహించడానికై అద్భుతంగా పని చేసారు.

🔶ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో
1. ప్రజల భాగస్వామ్యం,
2. ప్రజల నమ్మకం,
3. ప్రజల సహకారం,
4. పూర్తి అవగాహన
నాలుగు బలమైన స్తంభాలుగా నిర్మితమైనాయి.

🔶 మోదీ గారి పిలుపు మేరకు 18 మార్చి 2020 న ప్రధాని కేర్ ఫండ్ స్థాపించబడింది. మరియు 6500 కోట్ల రూపాయలు ఈ ఫండ్‌లో ఒక్క వారంలోనే జమ చేయబడినవి అనే విషయాన్ని గర్వంగా చెబుతున్నాను.

🔶 దీని ద్వారా మన ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశం మొత్తం మనసారా ఆర్థిక సహాయం కోసం ఎలా సహకరించడానికి ముందుకు వస్తుందో తెలియవచ్చినది.

🔶 ఈ రెండు నెలల్లో కరోనా వంటి తీవ్రమైన వ్యాధితో పోరాడటానికి బలమైన ఆరోగ్య నిర్మాణం ఏర్పరచబడింది.
🔶 ఏప్రిల్ నెలలో రోజుకు 10,000 పరీక్షలు ఉన్న దేశంలో,నేడు రోజుకు 1.6 లక్షల కంటే ఎక్కువ పరీక్షలు చేయబడుతున్నవి.

🔶 నేడు దేశంలో సుమారు 1000 ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి.

🔶కొరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పిపిఏ కిట్లు ప్రారంభంలో 0 గా ఉన్నా, నేడు 600 కు పైగా సిద్ధంగా ఉన్న దేశీయ తయారీదారుల ద్వారా దేశంలో రోజుకు 4.5 లక్షలకు పైగా పి.పి.ఇ కిట్లు తయారుచేస్తున్నారు.

🔶దేశంలో దాదాపు 60,000 కి పైగా వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు, వీటిలో 58,000 కు పైగా మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేయబడుతున్నాయి. వీటిలో, పిఎం ఫండ్ కేటాయించిన మొత్తం నుండి సుమారు 50,000 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తారు.

🔶650 పైగా కరోనా పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి.

🔶ఈ రోజు మన దేశం కొరోనా అంటువ్యాధితో పోరాడటానికి ఆరోగ్య వనరులతో స్వయం సమృద్ధిగా ఉంది మరియు ఇది రుజువు అయి నిరూపంచబడినది.

🔶ఈ మానవశక్తిని, స్వయం శక్తిని భుజాలుగా చేసుకుని ప్రధాని నేడు స్వావలంబన భారతదేశం యొక్క లక్ష్యాల వైపు పయనిస్తున్నారు.

🔶 రక్తం , చెమటతో ఈ పెద్ద దేశాన్ని నిర్మించడంలో తమ అమూల్యమైన సహాయాన్ని అందించిన వారు మన కార్మిక సోదరులు. ఈ రోజు, ఈ విపత్తు సమయంలో, గౌరవనీయ ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి వలస కార్మికుడిని వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి సహకరించింది.

🔶మా సంకల్పంలో మేము కొత్త విధానాలు మరియు సలహాలను పొందుపరుస్తున్నాము మరియు దానిని సరళీకృతం చేయడానికి మరియు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాము.

🔶 విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను,విద్యార్థులను ఇంటికి తీసుకురావటానికి ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద ప్రయత్నం చేస్తున్నది.

🔶 కొరోనా సంక్షోభం వల్ల పట్టాలు తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను సున్నితంగా తీర్చిదిద్దడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ స్వదేశీ, స్వావలంబన నినాదం ఇచ్చి దేశంలో ఆత్మవిశ్వాసాన్ని పునరుజ్జీవింపజేసారు.

🔶 అలాగే స్థానికత కోసం స్థానిక సంస్థలను ప్రోత్సహించారు.

🔶కొరోనా – ఇది సుదీర్ఘ యుద్ధం, దీనిలో మనమందరం సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వాడుతూ నియంత్రణతో ముందుకు సాగాలి.

🔶 ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధానిగా మోదీ తన మొదటి ప్రసంగం లో నా ప్రభుత్వం పేదలకు అంకితం చేయబడింది అన్న మాటలు మీకు గుర్తుండే ఉంటాయి.

🔶ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషమ పరిస్థితిలో కూడా గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకై 2020 మార్చి 26 న 1,70,000 కోట్ల కేటాయింపులను ప్రధాని ప్రకటించారు.

🔶 ఈ కార్యక్రమంలో నగదు బదిలీ ద్వారా దేశంలోని 9 కోట్లమందికి పైగా ఖాతాలలో కిసాన్ సమ్మన్ నిధి కింద ఒకొక్కరికి ₹ 2000 లు వేయబడినవి.

🔶 ఇప్పుడు డబ్బు వ్యక్తి ఖాతా కి నేరుగా వెళుతున్నది.

🔶80 కోట్ల ప్రజలకు 5 కిలోల గోధుమలు, ఒక కిలో పప్పుధాన్యాలు మూడు నెలల పాటు అందిస్తున్నారు.

🔶ఒకే దేశం- ఒకే రేషన్ కింద పేద కుటుంబానికి ఉచిత రేషన్ అందిస్తున్నారు.

🔶3 కోట్ల మంది వికలాంగులు మరియు వితంతువులకు వారి ఖాతాకు ₹ 1000 ధనాన్ని అందించారు.

🔶నగదు సంక్షోభం లేకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, 20కోట్ల జన ధన్ మహిళా ఖాతాదారులకు మూడు నెలల పాటు వారి ఖాతాకు ₹ 500 సహాయం పంపబడింది.

🔶8కోట్ల పేద కుటుంబాలకు ఉజ్జ్వాలా పథకం కింద మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు.

🔶 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు రోజుకు 182 నుండి 202 కు పెంచబడ్డాయి. ఇది ఇప్పుడు 13.62 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మోదీ గారు ఉపాధి హామీ పథకం కోసం భారత చరిత్రలో అత్యధికంగా 1,00,000 కోట్లు కేటాయించారు.

🔶కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు రూ.50,00,000 భీమా సౌకర్యం ఇచ్చారు.

🔶గౌరవనీయ ప్రధాని ప్రపంచంలోనే అతిపెద్ద హాలిస్టిక్ కొరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు.

🔶 గౌరవనీయమైన ప్రధాని ఈ క్లిష్ట సమయంలో దేశంలోని అన్ని వర్గాలకు సహాయం అందించడానికి 20,00,000 కోట్ల స్వయం సమృద్ధి ప్యాకేజీని ఇచ్చారు. మరియు ఈ ప్యాకేజీ కింద MSME లకు 3,00,000 కొల్లాటరల్-ఫ్రీ రుణాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి.

🔶కిసాన్ క్రెడిట్ కార్డు కోసం రూ .2,00,000 కోట్లు కేటాయించారు.

🔶 వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. రుణాలు ఇవ్వడానికి కోసం 5000 కోట్లు కేటాయించారు. దీని వలన 50,00,000 మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది.

🔶 ప్రపంచ సంక్షోభంలో, వలస కూలీల ఆహారం మరియు బస ఏర్పాట్ల కోసం 3500కోట్ల రూపాయలు ప్రకటించిన గౌరవనీయ ప్రధానమంత్రి తన దేశం గురించి మాత్రమే ఆందోళన చెందలేదు, పైగా వసుధైక కుటుంబాన్ని నమ్ముతూ, 113 దేశాలకు ఔషధాలు అందించారు. ఈ రోజు ప్రపంచం మొత్తం చూసిన మానవత్వం మరియు సేవలకు ఇది ఉదాహరణ.

🔶మోదీ ప్రభుత్వం తన రెండవ పదవీ కాలం లో కూడా, భారతదేశం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది.

🔶 దేశం యొక్క భద్రత కోసం ప్రతి ఒక్కరినీ గౌరవించటానికి, దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచడానికి, ప్రతి వ్యక్తిని సమాన అవకాశంలోకి తీసుకురావడానికి, గౌరవనీయ ప్రధాని ఇటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు భారత చిత్ర్నాన్ని మార్చింది.

🔶 కాంగ్రెస్ పాలనలో చారిత్రక తప్పిదాలను, పేరుకున్న సమస్యలకు మూలకారణాన్ని పరిష్కరించడంతో పాటు, భారతదేశ చిత్రాన్ని మార్చే పని చేసిన మోదీ జీ నాయకత్వంలో ఈ ఒక సంవత్సరంలో కూడా ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయోజనాలకు సమర్థవంతమైన పని చేసింది.

🔶మోదీ జీ నాయకత్వంలో ఈ ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం 370 సివిల్ సవరణ చట్టం, నాగరికతా చట్టం, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ వంటి పెండింగ్ కేసులకు శాంతియుత మరియు న్యాయ పరమైన పరిష్కారం ఇవ్వడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడింది.

🔶370, 35ఎ లు దేశం యొక్క సమగ్రత కోసం కానీ, జమ్మూ కాశ్మీర్ ప్రజల హితం కై కానీ లేవు. 1950 నుండి ఉన్న ఈ సమస్యలను మోదీ ప్రభుత్వం మూలాల నుండి సమూలంగా పరిష్కారించింది.

🔶ఈ నిర్ణయం ద్వారా, మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి కల అయిన ఒకే గుర్తు, ఒక విధానం, ఒకే ప్రధాని అనే తీర్మానం 100 శాతం నెరవేరింది.

🔶సెక్షన్ 370 ను, 35A ని రద్దు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్ప బలం మరియు దానికై అమిత్ షా గారి ఆలోచబలం మనం చూశాము.

🔶 ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతం యొక్క సామర్థ్యం దేశ ప్రధాన స్రవంతిలో చేర్చి, అక్కడి వెనుకబడిన వారికి రాజ్యాంగ హక్కులను కల్పించారు.

🔶పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీని కింద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లలో హింసకు గురై భారతదేశంలో నివసిస్తున్న హిందూ బౌద్ధ సిక్కు క్రైస్తవులు మరియు పార్సీ శరణార్థులకు హిందుస్తాన్ పౌరసత్వం ఇవ్వడానికి సదుపాయం కల్పించారు.

🔶ముస్లిం తల్లుల, ముస్లిం సోదరీమణులను ట్రిపుల్ తలాక్ బాధ నుండి తప్పించడానికై మోదీ ప్రభుత్వం రెండవ పదవి కాలంలో ముందు అడుగు వేసింది.

🔶భారతీయుల ఆరాధ్య దైవం రామ మందిరం నిర్మాణం కేసు పరిష్కరించబడింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి రాజ్యాంగ బద్ధంగా రామ్‌లాలా యొక్క గొప్ప ఆలయం కోసం ప్రయత్నించింది. కాంగ్రెస్ పదేపదే ఆటంకాలు పరచటానికి ప్రయత్నిస్తూనే ఉన్నా, సంవత్సరాల తరువాత, దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఐదుగురు న్యాయమూర్తులతో కలిసి ఏకగ్రీవంగా వివాద భూమిని రామ్‌లాలాకు అనుకూలంగా నిర్ణయించింది. మరియు 135 కోట్ల మంది భారతీయుల కల నెరవేరింది.

🔶ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక గొప్ప ఆలయం నిర్మాణం కోసం ప్రభుత్వం శ్రీ రామ జన్మభూమి ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో భవ్యరామాలయ కల నెరవేరుతుంది.అక్కడ భవ్య దేవాలయం నిర్మించబడుతుంది.

🔶యుఎపిఎ చట్టం ప్రకటనలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా, మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులపై బలమైన దాడి చేసింది.

🔶 దేశంలో చెడ్డ కార్యకలాపాల నివారణకు సవరణ బిల్లు UAPA ని ఆమోదించింది పార్లమెంటు.

🔶తన దూరదృష్టి విధానాలతో టీం ఇండియా స్ఫూర్తిని బలోపేతం చేస్తూ మోడీ ప్రభుత్వంలో భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేశారు.

🔶ప్రజా ప్రయోజన స్ఫూర్తి, దేశ హితం యొక్క కోరిక, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి చేయాలనే సంకల్పం(సబ కా సాత్- సబ్ కా వికాస్), అంత్యోదయ ద్వారా నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే ఆలోచన మోదీ జీ పని తీరులో స్పష్టం గా కనిపిస్తుంది.

🔶ప్రగతి మార్గంలో 2014 లో భారత జన నాయకుడిగా మారి ముందుకు వెళుతూ దేశానికి గర్వకారణం గా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశానికి నాయకత్వం వహిస్తున్నారు.

🔶నేను పునః భారతీయ జనతా పార్టీ తరపున, ఈ అపూర్వమైన విజయం మరియు నిర్ణయాత్మక 1 సంవత్సరం గురించి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు వారి ప్రభుత్వానికి, మరియు సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయమైన మోదీ జీ నేతృత్వానికి కోట్లాది ప్రణామాలు చేస్తున్నాను.

🔶వారి మార్గంలో మరింత బలంతో ముందుకు వెళ్ళాలని కార్యకర్తలకు నా అభ్యర్థన తెలియజేస్తున్నాను.

జై హింద్.. జై భారత్…