జగన్‌కు ఝలక్‌ల మీద ఝలక్కులు!

295

నిమ్మగడ్డను నియమించాలని హైకోర్టు ఆదేశం
టీడీపీ, బీజేపీ, జనసేన హర్షం
కోర్టులతో కయ్యానికి తెరదించితే మంచిది
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలగించిన నిమ్మగ డ్డరమేష్‌కుమార్‌ను,  తిరిగి ఆ పదవిలో నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. జగన్ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నిమ్మగడ్డను  తప్పించేలా సవరించిన ఆర్డినెన్స్ చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టులు న్యాయాన్ని పరిరక్షిస్తున్నాయని వ్యాఖ్యానించాయి. అటు..  హైకోర్టు, సుప్రీంకోర్టులలో వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో.. ఇకనయినా జగన్ సర్కారులో ఇకనయినా మార్పు వ స్తుందా అన్న చర్చ జరుగుతోంది.ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

జగన్ తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి..

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారానికి ఏపీ హైకోర్టు తెరదించింది. ఆయనను ఎస్‌ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయితీరాజ్ చ ట్టంలో  ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ను పూర్తిగా మార్చేస్తూ, జగన్ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితిలో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం సర్కారుకు లేదని తేల్చింది. ఈ క్షణం నుంచి రమేష్ ఎస్‌ఈసీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

తాజా పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్న, అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టినట్టయింది. ఇప్పటికే 65 కేసుల్లో హైకోర్టు జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యలు చేసింది. అయినా, ఆయన సర్కారు న్యాయవ్యవస్థను ఢీకొట్టాలన్న ధోరణిలోనే వెళుతుండటాన్ని, సొంత పార్టీ నేతలు కూడా స్వాగతించలేకపోతున్నారు. అసలు జగన్ తొలుత ఎస్‌ఈసీ గురించి మాట్లాడకుండా మరొకరితో మాట్లాడిస్తే బాగుండేదని కొందరు, రాజ్యాంగబద్ధ సంస్థలతో శత్రుత్వం కొనితెచ్చుకోవటం ఎందుకని మరికొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇది కూడా చదవండి.. హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా?

సుప్రీంకు వెళ్లడం వృధా అంటున్న వైసీపీ సీనియర్లు..

ఈ క్రమంలో నిమ్మగడ్డ వ్యవహారంపై.. మళ్లీ సుప్రీంకోర్టుకు అపీలు వెళ్లడం వృధాప్రయాస అన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇకనయినా హైకోర్టు తీర్పులను గౌరవించి, వాటిని అమలు చేయడం ద్వారా.. తాను కోర్టులతో పోరాడటం లేదన్న సంకేతాలిస్తే మంచిదని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉన్నందున, ఇప్పటినుంచే కోర్టులతో ఘర్షణ వైఖరి అవలంబించడం తెలివైన పనికాదని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టు వరసగా కొట్టివేస్తుందంటే, న్యాయవాదుల ఎంపికలో ఆయన కోణం సరైనదికాదన్నది స్పష్టమవుతోందటున్నారు.

సీనియర్ల సలహాలు తీసుకోనందుకే..

సున్నిత అంశాలపై జగన్ సీనియర్ల సలహాలు తీసుకోకపోవడం వల్లనే,  ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని మరికొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపై హైకోర్టు ఇచ్చే తీర్పులపై సుప్రీంకు వెళ్లకపోవడమే మంచిదని, మెజారిటీ నేతలు సూచిస్తున్నారు. చంద్రబాబు, వైఎస్ మాదిరిగా.. ఉన్న వారితో పనిచేయించుకునే తెలివితేటలు, లౌక్యం ఇంకా జగన్‌కు అబ్బినట్లు లేవంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు కొట్టివేస్తున్నాయంటే, జగన్మోహన్‌రెడ్డి పరిపాలనా తీరు బాగుండటం లేదన్న అభిప్రాయం ప్రజల్లో స్థిరపడితే దాని వల్ల నష్టపోయేది పార్టీయేనంటున్నారు.

ప్రజల్లో ధైర్యం పెంచిన కోర్టు..

ఈ పరిణామంతో జగన్ ప్రభుత్వం మరింత అప్రతిష్ఠకు గురయిందన్న భావన నెలకొంది. దీనివల్ల తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తే, కోర్టు రక్షిస్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయంటున్నారు. భూసేకరణ సహా వివిధ అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నందున.. ఇకపై ప్రభుత్వం తమ జీవితాలకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా, న్యాయం చేసేందుకు కోర్టు ఉందన్న ధైర్యం ఏర్పడిందంటున్నారు. సహజంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడే దాని అనుభవంతో మనిషి రాటుతేలతారని, కానీ జగన్మోహన్‌రెడ్డిలో అలాంటిదేమీ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి.. బురద చల్లి… సారీ చెబితే సరిపోతుందా?

కనగరాజ్ నియామకం చెల్లదు: జంధ్యాల

తాజా కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎస్‌ఈసీగా నియమించిన కనగరాజ్ నియామకం చెల్లదని.. ఈ కేసులో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ పక్షాన వాదించిన, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పష్టం చేశారు. సర్కారు ఆర్డినెన్స్ చెల్లదని మొదటి నుంచీ తాము చేసిన వాదన, హైకోర్టు తీర్పుతో నిజమయిందన్నారు. ఆర్డినెన్స్ రద్దు కావడంతో నిమ్మగ డ్డ కమినషర్‌గా ఉన్నట్టేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన అనేక కేసులలో విజయం సాధించిన జంధ్యాల.. నిమ్మగడ్డ కేసులో వినిపించిన వాదనలు, చూపిన రుజువులు గెలిచినట్టయింది.

1 COMMENT