తెలంగాణలో నియంత్రిత సాగు విధానంపై అనుసరించాల్సిన విధానాలపై బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు విధానం నియంత్రితమైంది కాదు.. నిర్భంధ సాగు విధానం అని ఖండించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ వ్యవసాయ సంస్కరణలకు, పంట కాలనీలకు వ్యతిరేకం కాదు. కానీ ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా, నిపుణులను సరిగా సంప్రదించకుండా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్భంధ సాగు విధానాన్ని తీసుకురావడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోంది. అసలు ఈ పంటలకు రైతుబంధుకు లంకె పెట్టడాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. పంట మార్పిడి విధానం విజయవంతం కావాలంటే కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచించిన విధంగా భూసార పరీక్షలు నిర్వహించి, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేస్తే విజయవంతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాని అశాస్త్రీయంగా పంట సాగు విధానం తీసుకురావడం ఏమాత్రం సరికాదు, రైతులకు నష్టదాయకం. అసలు రాష్ట్రంలో భూసార కార్డులు ఇచ్చేందుకు కేంద్రం విడుదల చేసిన రూ. 125 కోట్లు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఇంతవరకూ ఏ రైతుకూ భూసార పరీక్షలు చేసి కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. మరి, ఏ ఆధారంతో పంట మార్పిడి చేయాలంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చింది నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్భంద సాగు విధానం.

త్వరలోనే ఈ విషయంపై రైతుసంఘాల నాయకులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి దీనిపై సమగ్ర కార్యచరణను బిజెపి రూపొందిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పంటసాగు విధానంపై కూలంకుశంగా చర్చించాలి. అదేవిధంగా రైతు సంఘాలతో సైతం ఈ విధానంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

ఈ సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్. ఇంద్రసేనారెడ్డి, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు, గోలి మధుసూధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner