హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

274

హైకోర్టును డాక్టర్ సుధాకర్ ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని సుధాకర్‌ అభ్యర్థించారు. కోర్టు పర్యవేక్షణలో వైద్యం జరపాలని సుధాకర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పిచ్చోడిగా తనను నిరూపించేందుకు అనుగుణమైన మందులు వైద్యులు ఇస్తున్నారని, మెరుగైన వైద్య సేవల కోసం హయ్యర్‌ సెంటర్‌కు తనను పంపించాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ బుధవారం మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

మానసిక ఆస్పత్రిలో తనకు సంబంధం లేని మందులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా స్కిజోఫీనియా వంటి సమస్యలతో బాధపడే రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని వాపోయారు. వైద్యులు ఇస్తున్న మందులతో రియాక్షన్స్‌ వస్తున్నాయని, ఆ మందులతో పెదాలు పొడిబారాయని తెలిపారు. మందుల ప్రభావంతో యూరిన్‌ ఆగిందని, కళ్లు మసకబారాయని, తల తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరంగా తనను వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని లేఖలో సుధాకర్ కోరారు.

1 COMMENT