తెలంగాణకు నష్టం ఉండకపోవచ్చు

417

మిడతల దండు 1993 తర్వాత మళ్లీ ఇప్పుడే మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పదోజోన్‌ డైరెక్టర్‌ వైజీ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. ఇవి తెలంగాణ సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉన్నాయని, రాష్ట్రంలోకి వస్తాయా? రావా? అనేది రెం డురోజుల్లో తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్ర ధాన పంటలన్నీ పొలాల నుంచి ఇండ్లకు చేరటం తో అవివచ్చినా నష్టం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. కూరగాయల పం టలు నష్టపోయే ప్రమాదముందని చెప్తున్నారు.

దేశవ్యాప్తంగా తీవ్ర నష్టం

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాల్లో మిడత ల దండు కలకలం రేపుతున్నది. ఏప్రిల్‌ 11న పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించి, రాజస్థాన్‌లోని సగం జిల్లాలకు విస్తరించి, వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహరాష్ట్ర మీదుగా కదులుతున్నాయి. ఈ దండు ను నియంత్రించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇ వి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మి డతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారిచేస్తాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.

పసందైన వంటకం

ఎడారి మిడతలు ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ఆసియా ఖండాల్లోని పలు దేశాల ప్రజలకు రుచికరమైన ఆహారం కూడా. వాటిని వేపుడు చేసుకొని ఎంతో ఇష్టంగా తింటారు. వాటిలో ప్రొటీన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానిషి శరీరానికి అవసరమైన అయోడిన్‌, పాస్పరస్‌, ఐరన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌, కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మిడతల వంటకాలపై ‘స్కై ప్రాన్స్‌’ (ఆకాశంలోని రొయ్యలు) పేరిట ఓ రెసెపీ పుస్తకం కూడా ప్రచురించారు.

ఎడారి మిడత జీవిత చక్రం

బరువు : 2 గ్రాములు
పొడవు : 2-3 అంగుళాలు
ఒకసారి పెట్టే గుడ్లు :80-160
జీవితకాలం : 3- 6 నెలలు

ఒక దండులో గరిష్ఠంగా ఉండే
సంఖ్య : 4- 8 కోట్లు
గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చేకాలం : 2 వారాలు
పిల్లలు దండులో చేరటానికి పట్టే కాలం : 4-6 వారాలు