టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది?

647

తప్పుల తడకతో ఉత్తర్వులు
భూముల అమ్మకాలపై వెనక్కి తగ్గిన జగన్ సర్కారు
కమలం కన్నెర్రతో దిగివచ్చిన జగన్
ఆ జీఓకు జీఏడీతో సంబంధం ఏమిటో?
ఉత్తర్వుల్లో ఆరోగ్యశాఖ ప్రస్తావన ఎందుకు?
హడావిడిగా కాపీ పేస్ట్ చేశారా?
సర్కారుకు సంబంధం లేదన్న సుబ్బారెడ్డి
మరి ప్రభుత్వం ఉత్తర్వు ఎలా ఇచ్చిందంటున్న విపక్షాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

శ్రీవారి భూములు అమ్మాలన్న ప్రయత్నాలపై హిందూ సమాజం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన సహా చివరకు వామపక్షాలు సైతం వ్యతిరేకించడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వివాదం పెరిగి పెద్దది అవుతుండటం, బీజేపీ ఈ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సీఎం జగన్ నష్టనివారణకు దిగారు. దానిని రద్దు చేస్తూ సోమవారం రాత్రి హడావిడిగా, జీఓఆర్‌టి నెంబర్ 888తో జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి.

కమలం కన్నెర్రతో ఖంగుతిన్న జగన్ సర్కారు


తిరుమల వెంకన్న భూములు నిరుపయోగంగా ఉన్నందున, వాటిని అమ్మివేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గతంలో చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన తీర్మానాన్నే తాము అమలుచేస్తున్నామని, చైర్మన్ సుబ్బారెడ్డి తొలుత ప్రకటించారు. తర్వాత ఈ అంశం జాతీయస్థాయిలో వివాదం కావడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్మకాల వ్యవహారాలపై కన్నెర చేసి, ఉపవాస నిరసనదీక్షకు దిగుతామని హెచ్చరించడంతో సుబ్బారెడ్డి మరో ప్రకటన చేశారు. అమ్మకాలపై తామింకా తుది నిర్ణయం తీసుకోలేదని, రోడ్ మ్యాప్ కోసం ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయని దిద్దుబాటుకు దిగారు. ముందుగా ఇచ్చిన పిలుపు ప్రకారమే..  కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో  మంగళవారం బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు నిర్వహించారు. దీన్ని బట్టి జగన్ సర్కారు, బీజేపీ ఆందోళనకు భయపడి, నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోంది.

రాత్రికి రాత్రే ఉత్తర్వులు..

అటు జాతీయ మీడియాలో కూడా దీనిపై చర్చకు సిద్ధమవుతోందని ఉప్పందడంతో, సర్కారు శరవేగంగా దిద్దుబాటకు దిగింది. సీఎం జగన్ సైతం, జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దానితో సాయంత్రం ఐదుగంటలకల్లా, దానిని రద్దుచేస్తూ ఉత్తర్వులివ్వాలని ప్రవీణ్‌ప్రకాష్ పట్టుపట్టగా, రంజాన్ సెలవు కారణంగా ఉద్యోగులు లేకపోవడంతో, రాత్రికి గానీ ఉత్తర్వు వెలువడలేద ని తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. ‘టీటీడీకి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని గత ప్రభుత్వం నియమించిన బోర్డు, 2016 జనవరి30న తీర్మానం చేసింది. దీనిని నిలిపివేస్తున్నాం. భక్తుల మనోభావాలు గౌరవిస్తూ ఈ అంశాన్ని పున:పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. ఈ 50 ఆస్తులను ధర్మప్రచారం, దేవాలయాల నిర్మాణం, ఇతర ధార్మిక కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉందా అనే విషయంపై మత పెద్దలు, భక్తులు ఇతరులతో సంప్రదింపులు జరిపి మదింపు చేయాలి. అంతవరకూ ఈ ఆస్తుల వేలాన్ని నిలుపుదల చేస్తున్నామ’ని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.  అంతవరకూ బాగానే ఉంది.

మరి.. సుబ్బారెడ్డి మాటలు నిజం కాదా?

కానీ, అసలు అమ్మకాల వ్యవహారం ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని, గతంలో టీటీడీ బోర్డు తీర్మానాన్ని మాత్రమే అమలుచేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి రెండురోజుల క్రితం ప్రకటించారు. కానీ ప్రభుత్వమే దీనిని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వు ఇచ్చిదంటే, ఇదంతా పాలకుల కనుసన్నలోనే జరుగుతున్నట్లు స్పష్టమయింది. నిజానికి.. తిరిగి బోర్డు సమావేశమయి, పాత తీర్మానాన్ని రద్దు చేస్తున్నామని ఒక తీర్మానం చేయాల్సి ఉంటుందని, గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. ఆ కాపీని బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడైన రెవిన్యూ ముఖ్యకార్యదర్శి (ఎండోమెంట్)కు నివేదిస్తే సరిపోతుందని చెప్పారు. మరి ఆవిధంగా కాకుండా, నేరుగా జీఏడీనే రద్దు ఉత్తర్వులు ఇవ్వడం బట్టి.. అమ్మకాలలో ప్రభుత్వ జోక్యం ఉందన్న విషయం స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అసలు టీటీడీపై ప్రభుత్వ పెత్తనమే వద్దని ఆందోళన జరుగుతుంటే, మళ్లీ ఈ ఉత్తర్వులు ఇచ్చారంటే, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు.. సీఎంఓ నుంచే టీటీడీ వ్యవహారాలు నడుస్తున్నట్లు స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పాత ఉత్తర్వును కాపీ పేస్టు చేశారా?

పోనీ, ఆ ఉత్తర్వులయినా స్పష్టంగా ఇచ్చారా? అంటే అదీ లేదు. టీటీడీకి సంబంధించిన ఉత్తర్వులన్నీ రెవిన్యూ (ఎండోమెంట్స్) పేరుతో విడుదవుతుంటాయి. కానీ ఈ జీఓ మాత్రం జీఏడీ జారీ చేయడం, పైగా  భూముల అమ్మకాలలో  ఎంతమాత్రం సంబంధం లేని డిప్యూటీ సీఎం ఓఎస్డీ, స్పెషల్ సెక్రటరి( ఆరోగ్య, సంక్షేమశాఖ), సమాచారశాఖ కమిషనర్‌కు పంపిస్తూ ఉత్తర్వు వెలువడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉత్తర్వు తీరు చూస్తే, పాత ఉత్తర్వును కాపీ పేస్ట్ చేసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. టీటీడీకి సంబంధించి ఏమాత్రం సంబంధం లేని, శాఖలను ఉటంకించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బహుశా కోవిడ్‌పై ఉత్తర్వులిస్తున్న ప్రభుత్వం, ఆ .తొందరలో టీటీడీ జీఓలో కూడా ఆరోగ్యశాఖను చేర్చి ఉండవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జీఏడీ సెక్రటరీ.. టీటీడీ ఈఓను ఆదేశించవచ్చా?

ఈ ఉత్తర్వు విడుదల తర్వాత అధికార వర్గాల్లో మరింత గందరగోళం తెరపైకి వ చ్చింది. 888 జీఓ ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ , సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా జోడు పదవుల్లో పనిచేస్తున్నారు. అంటే సీఎంఓ నుంచి ఆయనే ఆదేశం ఇచ్చి, మళ్లీ  జీఏడీ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా అమలుచేస్తున్నారని అధికారులు వివరిస్తున్నారు. ఈ అధికారంతో టీటీడీ ఈఓకు ఆదేశాలివ్వడం, బిజినెస్ రూల్సుకు విరుద్ధమేనని ఓ సీనియర్ ఏఎస్ అధికారి చెప్పారు.

అది బిజినెస్ రూల్సుకు విరుద్ధమే..

‘టీటీడీ ఈఓ ప్రభుత్వ అధీనంలోకి రారు. ఆయన డెప్యుటేషన్‌పై పనిచేస్తారు. అంటే ప్రభుత్వం వెలుపల నుంచి పనిచేస్తారు. ప్రభుత్వ జీతం మాత్రమే తీసుకునే ఈఓ సర్వీసును, సహజంగా ప్రభుత్వ సర్వీసుగా పరిగణిస్తారు. నిజానికి ఈ జీఓ ప్రవీణ్ ప్రకాష్ ఇవ్వాల్సిన పనిలేదు. సీఎంఓనే, రెవిన్యూ కార్యదర్శి (ఎండోమెంట్)కు.. భూముల అమ్మకాలపై వివాదం జరుగుతున్నందున, ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించి ఉంటే బాగుండేది. అలాకాకుండా నేరుగా ప్రవీణ్ ప్రకాష్ ఎలా ఉత్తర్వు ఇచ్చారో అర్ధం కావడం లేదు. టీటీడీ ఈఓను ఆదేశించడం బిజినెస్ రూల్సుకు విరుద్ధం. దీనిని ఈఓ సీరియస్‌గా తీసుకుంటే, చాలా చిక్కులు ఎదురవుతాయి. కానీ ఇద్దరూ గురు శిష్యులే కాబట్టి, ఆ సమస్య రాదనుకుంటా. ఏదైనా ధర్మానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మంచిదికాదు. ఉత్తర్వులో పేర్కొన్న శాఖలు చూస్తే ఏదో హడావిడిగా పాత జీఓను కాపీపేస్టు చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో ఆరోగ్య శాఖకు సంబంధం ఏమిటో అర్ధం కావడం లేదు.  అసలు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ ఎక్స్‌అఫిషియో సెక్ర టరీ పదవులు రెండూ ఒకే అధికారికి ఉండటంవల్లే ఈ సమస్యలు వస్తున్నాయని’ గతంలో టీటీడీ ఈఓగా కూడా పనిచేసిన ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేతల ఉపవాస దీక్షలు..


తిరుమల, సింహాచలం దేవాలయాలతోపాటు, రాష్ట్రంలోని దేవాలయ భూముల అమ్మకాలకు నిరసనగా కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బీజేపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపవాసదీక్షలు నిర్వహించింది. కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులోని తన నివాసంలో దీక్ష నిర్వహించగా, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, వెంకటేష్‌యాదవ్, యామినీశర్మ, జనసేన నేత శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు. విల్సన్, రమేష్‌నాయుడుతోపాటు.. జాతీయ నాయకులయిన కేంద్రమాజీ మంత్రి జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్,  పురిఘళ్ల రఘరాం వారి వారి నివాసాల్లో ఉపవాసదీక్షలు నిర్వహించారు.

4 COMMENTS

  1. […] 888 జీఓ ఇచ్చిన జగన్ ప్రభుత్వాన్ని స్వామి అభినందించడం ఆశ్చర్యంగా ఉందరి రమణ వ్యాఖ్యానించారు.  ‘అసలు 309 తీర్మానం గురించి జీఓలో ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని పెద్ద లాయర్ అయిన స్వామి తెలుసుకోలేకపోవడమే విచిత్రం. పైస్థాయి అధికారికి, కింది స్ధాయి అధికారి ఎక్కడైనా ఆదేశాలిస్తారా అని సీనియర్ అడ్వకేట్ అయిన స్వామి చెప్పాలి. ప్రభుత్వ నిధులతో ముస్లిం, క్రైస్తవ మత పెద్దలకు వేతనాలివ్వడాన్ని స్వామి స్వాగతిస్తున్నారో లేదా చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లను జగన్ ప్రభుత్వం మాదిరిగా స్వామి కూడా ప్రోత్సహిస్తున్నారా? లేక అసలు ఆ విషయం ఆయనకు తెలియదా’ అని రమణ ప్రశ్నల వర్షం సంధించారు.ఇది కూడా చదవండి.. టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది? […]

  2. […] దీనితో జగన్ సర్కారు 888 జిఓతో ఈ వివాదానికి తెరదించింది. తాజాగా గురువారం భేటీ అయిన టీటీడీ బోర్డు కూడా.. టీటీడీ భూములు అమ్మకూడదని, టీటీడీ ఆస్తులు, కానుకలు కూడా అమ్మకూడదని నిర్ణయించింది. నిరుపయోగంగా ఉన్న భూములు కబ్జా కాకుండా కమిటీ వేయాలని తీర్మానించింది. తొలుత ఈ వివాదంపై స్పందించిన చైర్మన్ సుబ్బారెడ్డి..ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. తర్వాత ప్రభుత్వమే రంగంలోకి దిగి కొత్త జీఓ విడుదల చేసింది. అసలు టీటీడీ పాలకవర్గమే కొత్త తీర్మానం చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఎలా ఉత్తర్వు ఇస్తుందన్న ప్రశ్నలు సచివాలయ అధికార వర్గాలనుంచి వినిపించాయి. ఇది కూడా చదవండి.. టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది? […]

  3. […] – ఆలయ టస్ట్రుల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులను నియమించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రైస్తవులయిన ఆనంద్‌రాజు, రాజశేఖరబాబులను టీటీడీ ట్రస్టులో సహాయ కార్యనిర్వహక అధికారులుగా నియమించారు. – హిందూ దేవాలయాల భూములను హిందూ-ముస్లిం అవసరాల కోసం జగన్ సర్కారు ఇచ్చేస్తోంది. సింహాచలం భూములను చర్చిలకు అప్పగించింది. కడప జిల్లాలో వీరభద్రస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలను వక్ఫ్‌కు కట్టబెట్టారు. -పండుగల సమయంలో పవిత్ర స్థలాలను హిందువులు సందర్శించే బస్సు చార్జీలను 50 నుంచి 100 శాతం పెంచుతున్నారు. క్రైస్తవ-ముస్లింలను మాత్రం వారి పవిత్ర స్థలాలకు ఉచితంగా తీసుకువెళుతున్నారు. – ముస్లిం-క్రైస్తవ మత గురువులకు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో వేతనాలిస్తోంది. ఇవి కూడా చదవండి… పిండాలకూ.. తప్పని ‘పన్ను’పోటు! పీఠం.. మఠాల నుంచి బయటకు రారా స్వామీ? టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది ? […]

  4. […] కాగా ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవమతం విస్తరిస్తున్న వైనంపై.. విశ్వహిందూ పరిషత్  రూపొందించిన ఒక  నివేదికను, కొద్దికాలం క్రితం రాష్ట్రపతి రామనాధ్ కోవిందుకు వీహెచ్‌పి ప్రతినిధి బృందం అందించింది. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ, ఉత్తరాంధ్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వి.శ్రీవెంకటేశ్వర్లు, దక్షిణాంధ్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.సాయిరెడ్డి, తెలంగాణ కార్యదర్శి బండారి రమేష్‌తో కూడిన ప్రతినిధి బృందం, రాష్ట్రపతిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసింది. అందులోని ప్రధానాంశాలు ఇవీ.. – తాను క్రైస్తవుడిని కావడం వల్లనే జగన్ తనను ఈ జిల్లాకు కలెక్టర్‌గా నియమించారని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ బహిరంగంగానే ప్రకటించారు. గత 6 నెలల్లో జిల్లాలో, 6 వేల మంది క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇది క్రైస్తవ ప్రభుత్వం కావడం వల్ల, ఈ వర్గం వారికోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. – ఆలయ టస్ట్రుల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులను నియమించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రైస్తవులయిన ఆనంద్‌రాజు, రాజశేఖరబాబులను టీటీడీ ట్రస్టులో సహాయ కార్యనిర్వహక అధికారులుగా నియమించారు. – హిందూ దేవాలయాల భూములను హిందూ-ముస్లిం అవసరాల కోసం జగన్ సర్కారు ఇచ్చేస్తోంది. సింహాచలం భూములను చర్చిలకు అప్పగించింది. కడప జిల్లాలో వీరభద్రస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలను వక్ఫ్‌కు కట్టబెట్టారు. -పండుగల సమయంలో పవిత్ర స్థలాలను హిందువులు సందర్శించే బస్సు చార్జీలను 50 నుంచి 100 శాతం పెంచుతున్నారు. క్రైస్తవ-ముస్లింలను మాత్రం వారి పవిత్ర స్థలాలకు ఉచితంగా తీసుకువెళుతున్నారు. – ముస్లిం-క్రైస్తవ మత గురువులకు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో వేతనాలిస్తోంది. ఇవి కూడా చదవండి… పిండాలకూ.. తప్పని ‘పన్ను’పోటు! పీఠం.. మఠాల నుంచి బయటకు రారా స్వామీ? టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది? […]