మొబైల్స్‌కు బానిసిగా నేటి తరం

361

ఆరోగ్యానికి దూరంగా…..అనారోగ్యానికి దగ్గరగా…
(రఘునాధ్)

సెల్‌ఫోన్స్ గురించి నేటి తరానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.ఇంకా వారే పెద్దవారికి చెప్తున్నారు.ఎందుకంటే వాళ్ళు వాడకం అలా ఉంది మరి.
అంతా పబ్జీ ,ఫ్రీఫైర్ మయం
‘‘రాత్రి, పగలు ఆ ఫోన్‌ పట్టుకునే కూర్చుంటున్నారు.. తినేందుకు పిలిచినా స్పందించడం లేదు.అసలేం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు..’’ ఇది తల్లుల ఆవేదన.
రేయ్‌.. వాడిని ఎందుకు చంపావురా..? వెనుక చూసుకోరా.. వాడు నిన్ను చంపేస్తాడు.. ఆ ఇంట్లోకి పోయి గన్స్‌ తీసుకోరా..! చంపేయ్‌రా వాడిని..! యస్‌.. విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌..! ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? రోజంతా స్మార్ట్‌ఫోన్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నేటి తరం మాట్లాడే మాటలు. ఇలా పగలు రాత్రి తేడా లేకుండా మొబైల్‌తో గడిపేస్తున్నారు.యువతే కాదు పిల్లలు సైతం వీటికి బానిసలవుతున్నారు. ఈ యాప్‌ల కారణంగా ఆలోచించే శక్తి కోల్పోవడంతో పాటు హింసా ప్రవృత్తి పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.
సమయాన్ని మర్చిపోతున్నారు
స్మార్ట్‌ఫోన్‌, సామాజిక మాధ్యమాలు, పోస్టింగ్‌ల విషయంలో తగ్గిన ఆసక్తి ఇప్పుడు పబ్జీలాంటి ఆటలు, డేటింగ్‌ యాప్‌లపై పెరిగిందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. వీటిపై ఆసక్తి పెరగడంతో యువత చదువును పక్కనపెడుతున్నారు. బుర్రలు మొత్తం ఇవే ఆలోచనలతో నింపేస్తున్నారు. వాటిలో ఉండే గోల్డ్‌, డైమండ్‌ తదితర స్థాయిలను చేరేందుకు సమయం దుబారా చేస్తున్నారు.
రోజంతా సామాజిక మాధ్యమాలు, సోషల్‌ యాప్‌లలో గడపడంతో యువతలో ఆలోచనా శక్తి తగ్గి మానసిక ఒత్తిడి పెరుగుతోంది. విచక్షణ శక్తిని కోల్పోతున్నారు. భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యం తగ్గుతోంది. వెరసి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటికి బానిసవడంతో మానసిక, శారీరక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. యాప్‌ల వినియోగంపై స్వీయ నియంత్రణ అవసరం. ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి అనుకున్నప్పుడు మానసిక వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇదివరకు చక్కగా బయటకి వెళ్ళి సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చేవారు.ఆరోగ్యానికి ఆరోగ్యం,కేటాయిమే సమయం కూడా తక్కువే.కానీ నేటి తరం అల లేదు…మరి ముఖ్యంగా పిల్లలు…ఇంట్లోనే ఉంటూ ఫోన్ పట్టుకుని అదే పనిగా ఆడుతున్నారు.ఇప్పుడు నలుగురు స్నేహితులు కలిసినా మాట్లాడుకోటం మానేసి మొబైల్స్‌లో మునిగి తేలుతున్నారు. దీని వలన చాలా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.