టిటిడి ఆస్తులు అమ్మకాల్లో స్వామి స్వరూపానంద కీలకపాత్ర

549
*దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను కూడా అమ్మటానికి  రంగం సిద్ధం
సోమవారం ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ* కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దాతలు ఇచ్చిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లో టిటిడి బోర్డు అమ్మడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది ఈ భూముల అమ్మకాల్లో విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద  కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పీఠం లోనే ఆస్తుల అమ్మకానికి సంబంధించి చర్చలు జరిపారని దానిలో భాగంగానే రిషికేశ్ లో 40 సెంట్ల విలువైన భూమిని స్వామి స్వరూపానంద కు కట్టబెట్టే కుట్ర దాగుందని అలాగనే ప్రముఖ తెలుగు సినీనటి కాంచన 15 కోట్ల విలువ చేసే తన సొంత ఆస్తిని స్వామివారికి 2010లో అప్పటి ఈవోగా పనిచేసిన ఐ వై ఆర్ కృష్ణారావు చేతుల మీదుగా లిఖితపూర్వకంగా స్వామివారికి అందజేయటం జరిగిందని ఈ ఆస్తిని కూడా అమ్మకానికి పెట్టడం పై *ఐవైఆర్ కృష్ణారావు నోరుమెదపాలని డిమాండ్ చేశారు* *స్వామి స్వరూపానంద గత ప్రభుత్వాలలో టీటీడీ అంశాలపై నానాయాగీ చేసేవారిని టిటిడి లో ఇంత అక్రమాలు జరుగుతుంటే నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు?* వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగించేలా స్వామి వారి అపురూప ప్రసాదమైన తిరుమల లడ్డూలను స్వామి వారికి నైవేద్యం కూడా సమర్పించకుండా భక్తులు స్వామి వారిని దర్శించకుండానే బయటికి తీసుకు వచ్చి స్వీట్ షాప్ లో మిఠాయిలు అమ్మినట్లు గా స్వామి వారి కైంకర్యంని అత్యంత అవమానకరంగా స్వామి వారిని కించ పరిచే విధంగా టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వం చేయటాన్ని స్వామివారి పట్ల అపరాధం చేసినట్లుగానే భావించి స్వామి వారే స్వయంగా   స్థలాలు లడ్లు అమ్మకము చేసే ఈ అపరాధానికి రాష్ట్ర అధినేతకు టిటిడి బోర్డు కు తగిన శిక్ష విధిస్తాడు అని గతంలో కూడా కోటానుకోట్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించి ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న  రాష్ట్ర మహానేతకు వేయికాళ్ల మండపం కూల్చివేసిన అధినేతకు ఎటువంటి శిక్షలు విధించారో అందరికీ విధితమే అధికార మదం తో దేవుడి పట్ల వ్యవహరిస్తున్న తీరు కి తగిన శిక్ష భగవంతుడే విదిస్తారని హెచ్చరించారు. *సచ్చిలత, సుపరిపాలన అని చెప్పే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వారి కుటుంబం ఏనాడైనా తమకున్న లక్షల కోట్ల ఆస్తులలో ఎప్పుడైనా సరే ఒక సెంటు భూమిని టిటిడికి దానం ఇవ్వగలరా అని ప్రశ్నించారు?* మీరు ఇవ్వకపోగా స్వామి వారి మీద భక్తి అనురక్తితో రాజులు, దాతలు ఇచ్చిన భూములను అమ్మటానిక వైయస్ జగన్ కు అధికారం కట్టబెట్టిందని అని ప్రశ్నించారు.? ముఖ్యమంత్రి 13 జిల్లాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు చర్చిల ఆస్తులను ఎందుకు అమ్మలేక పోతున్నారని ఒక హిందూ దేవాలయాల ఆస్తుల్ని మాత్రమే ఎందుకు అమ్మ చూస్తున్నారని  ప్రశ్నించారు రాష్ట్రంలో పెద్ద దేవాలయ ఆస్తులు అమ్మితే తదుపరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కు సంబంధించిన ఆస్తులన్నింటినీ అమ్ముకోవచ్చని వ్యూహ రచన చేశారని దీన్ని కచ్చితంగా అడ్డుకొని తీరుతామని *దీనిపైన న్యాయపోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు* తక్షణమే టిటిడి ఆస్తుల అమ్మకాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో వెంకటేశ్వర స్వామి భక్త బృందం తో కలసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
*ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వడ్డమాను ప్రసాదు, గుంటుపల్లి అజిత్ శర్మ, మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు, సుబ్రహ్మణ్య శర్మ, యజ్ఞ నారాయణ తదితరులు పాల్గొన్నారు.*