దేవాలయ భూములు ఎవడబ్బ సొమ్ము

619

ఇలా అడ్డగోలుగా దేవుడి ఆస్తులు అమ్మే అధికారం ఇప్పుడున్న టీటీడీ కమిటీ కి ఎక్కడిది?? ఈ దేవాలయ భూములు ఈ కమిటీ తన తెలివితేటలతో, కష్టంతోనూ పెంచిందా?? ఈ కమిటీ ఉన్నప్పుడు ఎంత ఆదాయం వస్తుందో అంతే ఖర్చుపెట్టుకోవాలి కానీ పూర్వ కాలం నుండి ఉన్న దేవాలయాల ఆస్తుల్ని ఎలా అమ్ముతారు? ఇది ఏ ఒక్క కమిటీ మెంబర్ వారి సొత్తు కాదు..వందల వేల సంవత్సరాలుగా రాజులు, హిందూ భక్తులు ఇచ్చినటువంటి మొక్కులు, కానుకలు భారంగా ఉన్నాయని అమ్మకానికి పెడుతున్నారు..చేతనైతే ఆస్తులు పెంచండి లేదా కనీసం ఉన్న వాటితో సర్దుకొండి.. అంతేకాని అమ్ముకు పోతూ ఉంటే మీ పతనం తప్పదు… అయ్యా కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందుకు ఈ హిందు ధర్మంపై, దేవుడిపై జరుగుతున్న అన్యాయంపై నోరుమెడపరు?

ఇపుడు తమిళనాడు లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు, రేపు ఆంధ్రాలో ఉన్న ఆస్తులను కూడా అమ్ముతారా? అవకాశం లేదు కానీ ఉంటే ఏడుకొండల ని కూడా అమ్మేద్దామనా? కోట్లాది హిందు ధర్మ విశ్వాసకుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే కేవలం హిందు దేవాలయాల నుండి ఆదాయాన్ని తీసుకుని ఇతర మతాల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న హిందువుల దేవాలయాలలో కేవలం 30000 మంది హిందు దేవాలయ అర్చకులకు నెలకు 5000 ఇస్తున్నారు. అసలు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించని 29000 క్రైస్తవ పాస్టర్లకు,7000 ముస్లిం మత పెద్దలకు నెలనెలా 5000 రూపాయలు ఇస్తున్నారు. ప్రజల పన్నుల డబ్బులు మత ప్రచారానికి, మత పెద్దలకు ఇవ్వకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కి విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తారు? కనీసం దామాషా పద్దతిలో జనాభా ప్రాతిపదికన తీసుకున్నా, అర్చకులకు ఎక్కువ సంఖ్యలో ఇవ్వాలి కదా?

గత ప్రభుత్వం సదావర్తి భూములు పరిరక్షించలేక అమ్మటానికి చెన్నైలో వేలం వేసినప్పుడు నానా యాగీ చేసిన ఇదే పార్టీ ఇప్పుడు తాము అదే పని చేయటం దారుణం. తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్‌ పోయిందని నానీ యాగీ చేసిన వాళ్లు చివరకి ఏం తేల్చారు

తాము చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుంటారా? లేక తప్పుని నిరూపించే సమర్థత లేదని తప్పుకుంటారా?

ఈరోజు ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న వాళ్లు నోరు తెరిచి సమాధానం చెప్పాలి.

యామిని శర్మ
రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ మహిళ అధ్యక్షురాలు