ప్రజల నడ్డి విరుస్తున్నారు:బీద రవిచంద్ర

435

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం (NTR భవన్) నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర M.L.C.  మాట్లాడుతూ….

👉 పాదయాత్ర మొదలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై వేయమని ప్రగాల్బాలు పలికిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు దొడ్డిదారిన అదనపు విద్యుత్ ఛార్జీలను వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

👉 కరోనా మాటున విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి , కేటగిరి లను మార్చి కొత్తరకం విద్యుత్ చార్జీల దోపిడీ కి ప్రభుత్వం తెరలేపింది.

👉 సంవత్సరానికి 900 యూనిట్ లు వినియోగించే వారిని A కేటగిరి , 2700 యూనిట్ల వరకు B కేటగిరీ , 2700 యూనిట్లకు పైగా వినియోగించే వారిని C కేటగిరీ గా గుర్తించి విద్యుత్ బిల్లులు ఇస్తుండగా నేడు నెలకి 75 యూనిట్లు వాడే వారికి A కేటగిరీ, 75-225 యూనిట్ లు వాడే వారికి B కేటగిరి, 225 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే వారికి C క్యాటగిరి తారీఫ్ ప్రకారం బిల్లు ల భారం వేస్తున్నారు.

👉 గత ఏడాది సరాసరి తీసుకుంటే కోటి నలభై ఐదు లక్షల వినియోగదారులలో C కేటగిరీ లో నెలవారీగా 500 యూనిట్లు వినియోగించిన వారు కేవలం లక్షా 35 వేల మంది కాగా నేటి ప్రభుత్వ వైఖరి తో 50 లక్షల మంది C కేటగిరీలోకి చేరారు.

👉 ఏడాది మొత్తం విద్యుత్ చార్జీల సరాసరి తీయకుండా దొడ్డి దారిన నెలవారీ సరాసరి తీసుకున్న కారణంగా A కేటగిరి వినియోగదారులు B లోకి, B కేటగిరి వినియోగదారులు C కేటగిరి లోకి చేరారు.

👉 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ ఎస్టీ వినియోగదారులు నేడు నెలవారీ స్లాబులు నిర్ణయించడం వల్ల మొత్తం బిల్లు కట్టాల్సి రావడంతో ఘోరంగా మోసపోతున్నారు.

👉 స్లాబుల నిర్ణయించడం తో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ను వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీ వర్గాలపై 1000 వరకు విద్యుత్ చార్జీల భారం పడుతోంది.

👉 రూ.1000/- వరకు విద్యుత్ చార్జీలు చెల్లించే సాధారణ మధ్య తరగతి ప్రజలకు 12 వేల రూపాయలకు పైగా విద్యుత్ బిల్లుల భారం పడింది.

👉 లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లులు కట్టలేక పోయిన వారికి అపరాధ రుసుము ఉండదని చెప్పిన ప్రభుత్వం నేడు 100 రూపాయల జరిమానా విధిస్తోంది.

👉 రాష్ట్రంలో 20 మిలియన్ల యూనిట్ల విద్యుత్ లోటుతో అధికారంలోకి వచ్చిన టిడిపి మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధించింది.

👉 తెదేపా ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ రంగం లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచి విద్యుత్ కోతలను ప్రజలు మరిచేలా విద్యుత్ నిరంతరాయంగా అందించడం జరిగింది.

👉 విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వివరణ అంతా బూటకం , కల్లిబొల్లి మాటలు కట్టిపెట్టి విద్యుత్ బిల్లుల విధానాలను మార్చకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు సిద్ధంగా ఉన్నాం.

పై ఈ సమావేశంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి గారు , నగర టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు , TNSF జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు , ఉచ్చి.భువనేశ్వరి ప్రసాద్, TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్రుల్లా , సాయి కిషోర్ , మహేంద్ర బాబు గడ్డం , రసూల్ తదితరులు పాల్గొన్నారు.