L G పాలిమర్స్ ప్రమాద ఘటన కు కోటి పరిహారం వెనుక అసలు కధ యిదే

589

విశాఖ పట్నం యల్.జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో కొంతమంది మరణించారు, వందల మంది హాస్పటల్ లో ఉన్నారు, వేలాది మంది ఈ ప్రమాద బారిన గురై ఉన్నారు.

ఇంత భారీ ప్రమాదం జరిగితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్దీ కంపెనీ అని, చాలా మంచి కంపెనీ అని, ప్రమాదానికి గురి అయిన వారికి కోటీ రూపాయలు యిస్థారు, వచ్చేలా చూస్తాను అని మొదట్లో మాట్లాడిన మాటలు…

అసలు ఈ కంపెనీ ఏమిటీ? దీని వెనుక ఎమీ ప్రయోజానాలు ఉన్నాయి, ప్రభుత్వం కు గాని, ప్రభుత్వ పరిపాలకులకు గాని అనే విషయాలు కొన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవలిసిన అవసరం వుంది. ఆది చూద్దాం…

ఈ LG పాలిమర్స్ కంపెనీ గతంలో వారికి యిచ్చిన దాని కన్నా ఎక్కువ భూమి యివ్వడం వలన తిరిగి యివ్వమని గత ప్రభుత్వం నోటిస్ యిస్థే దాని పై కోర్టుకి వేళ్ళి కోర్టు వివాదాలలోకి ప్రభుత్యాన్ని లాగింది, ఈ పాలీమార్ కంపెనీ విస్తరణ కు గత ప్రభుత్యాన్ని అనుమతులు అడిగారు కాని యివ్వలేదు కారణం ఏమిటంటే కాలుష్యనికి కారణమైన కంపెనీ, జనవాసాలు ఉన్న ప్రాంతంలో ఉందనే కారణం తో విస్తరణ కు అనుమతులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత గత సం. మే 10 వ తేదీన అడిగితే కనీసం పర్యవరణ అనుమతులు లేకుండా పర్యవరణ శాఖ తో కేసు కేసు నడుస్థుంగా, ఈ ప్రభుత్వం కేవలం 4.5 లక్షలు డి.డి తీసుకుని కంపెనీ నుండి అఫిడివిట్ తో అనుమతులు యిచ్చారు, ఈ అఫిడివిట్ విషయం పక్కన పెడితే, ఈ లాక్ డౌన్ నడుస్తున్న సమయాము లో అత్యవసరముగా ఓపెన్ చేయడానికి ఎందుకు అనుమతులు యిచ్చారు. ఈ కంపెనీ ఉత్పత్తి అత్యవసరమని గుర్తించి NOC ఎందుకు యిచ్చారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తుంది అంతేగాని నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేయదు, లాక్ డౌన్ ఉండగా ఈ కంపెనీ కి ఎందుకు ఉత్పత్తి చేయడానికి E N I అనుమతులు లేకుండా ఉత్పత్తి అత్యవసరమని చెప్పి reopen కు అనుమతి ఏలా యిచ్చారు, ఈ కంపెనీ తెరవడానికి కారణం ఏమిటి? యిప్పటికే పర్యావరణ సమస్యలు తో కేసులు నడుస్తున్నాయి, కెంపెని తెరవడానికి కాల్యుష నియంత్రణ బోర్డు అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వమే ఉత్పత్తి అత్యవరమని అనుమతులు యిచ్చిందా?

దీని వెనుక ప్రభుత్వ పరిపాలకులుకు వెనుక స్వార్ధ ప్రయోజనాలు ఉన్నాయా? ఎందుకంటే L G పాలిమర్స్ ఉత్పత్తి చేసే మెటిరియల్ కొంటున్నది ఎవరు? ఈ ప్లాస్టిక్ ని రా మెటిరియల్ గా వాడుకోనే కంపెనీలు ఏమిటి? వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. పెద్దలు ఎవరో తెలుసా? నందిని పాలిమర్స్, భారతీ పాలిమర్స్ ఈ రెండు కంపెనీ లు బాటిల్స్ తయారుచేష్థుంది. ఈ బాటిల్స్ లిక్కర్ కంపెనీలకు అమ్మడం కోసం ఈ రెండు కంపెనీలు ఎవరివీ? ప్రభుత్వంలో ఉన్న యిద్దరు పెద్దలవి. ఎవరి ప్రయోజానాలు కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ప్రజలు సంక్షేమాన్ని తాకట్టు పెట్టి, స్వార్ధ ప్రయోజనాలు కొసం, రాజకీయ ప్రయోజనాలు కోసం, మీ స్వప్రయోజనాల కోసం అనుమతులు యివ్వవలిసిన అవసరం ఈ ప్రభుత్య పెద్దలకు ఎమి వచ్చినది.

ప్రమాదం జరిగిన రోజు ఉదయం 11 గం.లకు భారత ప్రధాని నరేంద్ర మోడి గారు అత్యవసర సమావేశం నిర్వహించి ప్రమాదం పై సమీక్ష చేసి వెంటనే సహాయ చర్యలు చెపట్టాలి, ప్రమాదానికి కారణమైన వారిని ఎవరైనా సరే చర్యలు ఉంటాయని ప్రకటించారు, కాని ఈ ప్రభుత్య పెద్దలు వైజాగ్ లో దిగగానే మొట్టమొదటిగా కలిసింది ఎవరిని కంపెనీ ప్రటినిధులుని, ఎవరిని కలవాలి ఎవరైతే భాధితులు ఉన్నారో వారిని, మరణించిన వారి కుటుంబాలు ను పరామర్శ చేసి, వారికి ధైర్యం చెప్పి మేము ఉన్నాము భరోసా యిచ్చి ఏమి జరిగిందో నని అధికారులు తో సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత కంపెనీ ప్రతినిధులు ని కలవాలి. కాని పెద్దలు చేసింది ఏమిటి ఎవరైతే మరణాలకు కారణమైన నిందితులు తో వాళ్ళకీ చక్కగా రెడ్ కార్పెట్ పరచి ఎయిర్ పోర్ట్ లో మాట్లాడారు, దీని వెనుక ప్రయోజనం ఏమిటీ, ఎందుకని పెద్దలు ప్రెయారిటి కనపడుతుంది. యిక్కడ ప్రభుత్యం ప్రేయారిటి ఏమిటంటే ప్రజలు కాదు, కంపెనీ. పెద్దలు ఒకటికి పది సార్లు ప్రపంచ ప్రసిద్ద కంపెనీ అని చెప్పడం.

గతంలో బొపాల్ లో ప్రమాదం జరిగిన కంపెనీ యూనియన్ కార్పెట్ కుడా ప్రపంచ ప్రసిద్ద కంపెనీ యే. ఆ కంపెనీ పై పెట్టిన కేసులు, చట్టాలు ఈ కంపెనీ కి కుడా ఎందుకు వర్తింప చేయడం లేధు. ఇంత ప్రమాదం జరిగితే ఈ కంపెనీ పై పెట్టిన కేసులు 278, 284, 285, 337,338,304 ఇవి పెట్టిన కేసులు, దీనిలో 304 ఒక్కటే నాన్ బెయిల్ బుల్ కేసు, మిగతావి బెయిల్ బుల్ కేసులు. చర్యలు తీసుకోవలిసిన విధానం.

ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడిన వాళ్లని, open చేసేటప్పుడు కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, యల్.జీ పాలిమర్స్ కంపెనీపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పకుండా ప్రమాదం లో మరణించిన కుటుంబoలో ఒకరికి అదే కంపెని లో ఉద్యోగం యిప్పిస్థాము అని చెప్పడం ఏమిటి, అంటే ఇంత ప్రమాదం జరిగిన కుడా కంపెనీ పై చర్యలు తీసుకోరు, అక్కడ నుండి కంపెనీ ఖాళీ చేయించరు. ఖచ్చితంగా కంపెనీ వెనుక పెద్దలు ఉన్నారు అని తెలుస్తుంది కదా.

జనవసాలు మధ్య విద్యంసం సృష్టిoచిన తరువాత కంపెనీ అక్కడే అదే ప్రదేశం లో ఏలా ఉంచుతారు, అలాగే గతంలో ఈ ప్రభుత్వం కంపెనీ పరిసర ప్రాంతాలలో నివశిస్థున్న ప్రజలను ఖాళీ చెయమని నోటిస్ లు యిచ్చారా లేదా, యిచ్చి ఉంటే దీనికి, దానికి సంభందం ఉందా,లేదా దీనిపై కుడా విచారణ చేయాలి. యల్.జీ పాలిమర్స్ కంపెనీ సెక్రటరీ రవీంద్రారెడ్డి కి, పెద్దలకు ఉన్న సంభంధం ఏమిటి, యిది నిజమా, కాదా. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా అత్యవసరంగా open చెయడానికి సహాకరించిన వారిపై ఈ ప్రభుత్వం ఎమీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం కంపెనీ పై కేసు ఎప్పుడు రిజిస్ట్రర్ చేసారు, హైకోర్టు సుమాటో గా కేసును తీసుకున్న తరువాత ప్రభుత్వం కేసు పెట్టింది.

పర్యావరణ అనుమతులు లేకుండా ఉత్పత్తి పెంచడానికి కేవలం 4.5 లక్షలు పూచీకత్తు తో మీరూ అనుమతులు ఏలా యిచ్చారు, దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు గురుంచి రహస్యం దాగదు.

కోటి రూపాయలు యిస్థామoటే తప్పులు దాగవు, పాపాలు పోవు.

పరిహారం ప్రభుత్వం చేయటం కాదు, ప్రభుత్వం యిచ్చే పరిహారం ప్రజలు సొమ్ము, ప్రభుత్వ సొమ్ము కొంత మిగతాది కంపెనీ నుండి యిప్పించాలి.

ఈ మొత్తం వ్యవహారం రిటైర్డ్ జడ్జి గారి తో విచారణ చేస్తె ప్రజలకు వాస్థావాలు తెలుస్తాయి, తెలియాలి కుడా.