రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదటి ముస్లిం ప్రచారక్ మృతి

440

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదటి ముస్లిం ప్రచారక్ మాననీయ గుల్షన్ అబ్దుల్లా షేక్ అలియాస్ ప్రహ్లాద్ షిండే ముంబై సమీపంలోని పాన్వేల్ వద్ద అనారోగ్యంతో మరణించారు..!!

వారు విశ్వ హిందూ పరిషత్ (VHP) కొంకణ్ ప్రాంత ధర్మజాగరణ్ బాధ్యతలో ఉన్నారు..!!

గుల్షన్ షేక్ గా జన్మించిన షిండే ముంబైలోని తన సొంత పట్టణమైన మాతెరన్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ లో చేరారు.!!

ఆయన అత్యుత్తమ నిర్వాహకుడు జనసమీకరణలో దిట్ట అయిన శ్రీ షిండే సంఘ కార్యములో చురుకుగా పాల్గొనేవారు..వారి శిక్షణ పిమ్మట రాయ్గడ్ సమీపంలోని పెన్ నగరంలో సంఘ ప్రచారక్ గా నియమితులయ్యారు..!!

అతను 1985 నుండి 1992 వరకు గోవాలో మరియు పన్వేల్ లో సంఘ ప్రచారక్ గా పని చేసారు. తరువాత అయన వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో హిందూమతంను స్వీకరించారు..అప్పటినుంచీ తనపేరును ‘ ప్రహ్లాద్ షిండే ‘ గా మార్చుకున్నారు..!!

అయోధ్యలో రాముడి గుడి , గోసంరక్షణ , మతమార్పిడులు తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి ” అని షిండే అంటుండేవారు..!!

“గత వారం పన్వేల్ సమీపంలోని కర్నాల వద్ద రామజన్మభూమి పై ప్రహ్లాద్ తన చివరి ప్రసంగాన్ని ఇచ్చారు , వారి మరణం సంఘ్ కే కాదూ యావత్ హిందూ సమాజానికే తీరని నష్టం ..!! వారు గొప్ప #రామభక్తులు..!!
వారి పవిత్రాత్మ శ్రీరాముని చరణాలకు చేరుగాక..!!
#జయశ్రీరామ..!! source with చెలికాని కేశవ