విశాఖకు ఏపీ సీఎం జగన్

520

ఎల్జీ పాలిమర్స్ లో ఈ తెల్లవారు జామున జరిగిన ప్రమాదం కారణంగా వేలాది మంది ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.  విషవాయువులు వలన ఊపిరాకడ ఇప్పటికే ముగ్గురు మరణించినట్టు సమాచారం.  మహిళలు, చిన్నారులు, 55 సంవత్సరాలు పైబడిన వ్యక్తులపై దీని ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఏ వాహనం అందుబాటులో ఉంటె వాటిలో యువత బాధితులను తరలించారు. పోలీసులు సైతం రంగంలోకి దిగి ఐదు గ్రామాల ప్రజలను తరలించారు. చాలా మంది ప్రజలు ఇంకా ఇళ్లలోనే ఉన్నారని, వారంతా ఎలా ఉన్నారు.. ఉన్నారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉన్నది.  ప్రమాదం తీవ్రస్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  1984 లో భోపాల్ గ్యాస్ లీకేజ్ కారణంగా ఎంత ప్రభావం సంభవించిందో తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు.  కాసేపట్లో జగన్ విశాఖకు బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది.  పరిస్థితిని సమీక్షించేందుకు, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు జగన్ విశాఖ వెళ్తున్నారు.