మానవ హక్కుల సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాంబ

522

కరప: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ మానవ మానవహక్కులు, స్త్రీ శిశు సంక్షేమ కమిషన్ (జాతీయ స్వచ్ఛంద సంస్థ) రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కరప గ్రామానికి చెందిన డి హెచ్ వి సాంబశివరావు ను రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియమించారు. కార్యదర్శిగా ఆయన పదవీకాలం ముగియడంతో సాంబశివరావును ఉపాధ్యక్షుడిగా ప్రమోట్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మండలం అఖిల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో ఈ సంస్థ తరపున పూర్తిస్థాయిలో పనిచేయడం, రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కాకినాడలో నిర్వహించి విజయవంతం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించి తద్వారా సంస్థ కు గుర్తింపు తెచ్చారు.దీంతో కార్యదర్శి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించామని అఖిల్ తెలిపారు .తనపై నమ్మకంతో తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన అఖిల్ కు సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడైనా, ఎవరికైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, అన్యాయం జరిగినా, తమ సంస్థ ప్రతినిధులు అక్కడికి వెళ్లి నిజనిర్ధారణ చేసి బాధితులకు అండగా నిలుస్తారని సాంబశివ రావు వెల్లడించారు.ఇప్పటికే ఆయన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అర్చక సమాఖ్య చీఫ్ అడ్వైజర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా పలు స్వచ్ఛంద సంస్థలకు సేవలందిస్తున్నారు. ఉపాధ్యక్షులుగా నియమితులైన సాంబశివరావును వివిధ సంఘాల ప్రతినిధులు ద్రోణంరాజు రవికుమార్ , శ్రీ గిరిరాజు నరసింహ బాబు, ఉండవల్లి వీర్రాజు చౌదరి, అల్లంరాజు బాబి,జిల్లెల్ల ప్రసాద్, ఎర్రా విక్రమ్, ఎంవివి సత్యనారాయణ రెడ్డి, ముద్రగడ రమేష్, వి సుందర శేషావతారం తదితరులు అభినందించారు.