అన్నదాతా.. సుఖీభవ!

827

పేదల ఆకలి తీరుస్తున్న ‘గ్రేటర్’
నగర జీవులకు కేసీఆర్ సర్కారు అన్నదానం
ఆపద్బంధువుగా మారిన అన్నపూర్ణ క్యాంటీన్లు
కేటీఆర్ చొరవతో కడుపు నింపుతున్న క్యాంటీన్లు
వెల్లువెత్తుతున్న దాతల ఔదార్యం
మంత్రి  తలసాని, మేయర్ బొంతు నిరంతర సమీక్ష
(మార్తి సుబ్రహ్మణ్యం)

అన్నం పెట్టిన వారిని ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవిస్తుంటారు. అదే కష్టకాలంలో, బుక్కెడు బువ్వకూడా దొరకని ఆపత్కాలంలో ఆకలితో నకనకలాడుతున్న అభాగ్యులకు.. రోజూ అన్నం పెట్టే వారిని ఎవరైనా మనసారా ఆశీర్వదిస్తారు. కరోనా కష్టకాలంలో  హైదరాబాద్ నగరంలోని పేదలు, వలస జీవులకు ప్రతిరోజూ కడుపునిండా భోజనం పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆపన్నులు అన్నదాతా సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నానికి, దాతలు కూడా పెద్ద మనసుతో ముందుకురావడంతో పేదల కడుపు నిండుతున్నాయి.

కడుపు నింపుతున్న కేటీఆర్ ఆదేశాలు

కరోనా సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లు, పేదల ఆకలితీర్చే ఆపద్బంధువుగా మారాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో, రంగంలోకి దిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, అన్నపూర్ణ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరించడం, పేదలకు వరంగా మారింది. దీనిని నగరానికి చెందిన సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మంత్రి తలసాని తన పర్యటనలో ఈ పంపిణీ వ్యవస్థపై అధికారులను ఆరా తీస్తున్నారు. ఇదికూడా చదవండి.. తెలంగాణలో తలసాని టాప్!

అన్నపూర్ణ క్యాంటీన్ల పునరుద్ధరణతో ఊరట


లాక్‌డౌన్ నేపథ్యంలో, నగరంలో ఉన్న వలస కూలీలు, మూత పడిన హాస్టల్ విద్యార్ధులు ఆకలితో అల్లాడకూడదన్న లక్ష్యంతో, మంత్రి కేటీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లను పునరుద్ధరించారు. దానితోపాటు 342 మొబైల్ క్యాంటీన్లు సమకూర్చారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చొరవతో, ఈ క్యాంటీన్లే.. ఇటీవల ఏపీ వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగులను ఆదుకున్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ 41లక్షల 41 వేల మందికి ఆహారం అందించడం గొప్ప విషయం. ఇదికూడా చదవండి.. తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!

దాతల పెద్ద మనసు..

ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలకు దాతల సహకారం కూడా తోడవడం, పేదల ఆకలి తీరేందుకు ఒక కారణమవుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తనయుడు సాయికిరణ్,  తన మిత్రులతో కలసి ఇటీవల జీహెచ్‌ఎంసీకి ఇతోధిక సాయం అందివ్వగా, ఆయన తండ్రి తలసాని కేవలం తన నియోజకవర్గంలోని ప్రముఖులతో గ్రేటర్‌కు విరాళాలు ఇప్పించారు. ఇదికూడా చదవండి.. ‘తండ్రిని మించిన తనయుడు తలసాని సాయి’ ఆవిధంగా ఇప్పటివరకూ 692 మంది దాతలు ఇచ్చిన 520మెట్రిక్ టన్నుల బియ్యం, 2,854 రేషన్‌కిట్లు, 6,44,300 ఆహారప్యాకెట్లను అధికారులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, విడిగా పంపిణీ చేయడం వల్ల తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వాటిని జీహెచ్‌ఎంసీ ద్వారానే పంపిణీ చేయాలన్న ఆదేశంతో, దాతలు నేరుగా అధికారులకే సరకులు అందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీపై తొలినుంచీ దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ పంపిణీ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆపద సమయంలో అన్నార్తుల కడుపునింపిన ఎవరైనా గొప్పవారే!

1 COMMENT

  1. I’ve been surfing on-line more than three hours today, but I never discovered any fascinating article like yours. It is beautiful value sufficient for me. In my opinion, if all website owners and bloggers made good content as you did, the net will be a lot more helpful than ever before.