నేచర్ కొరడా ఝలిపిస్తే తప్ప కదలo మనం

445

సముద్రమట్టం పెరిగి, 2070 కల్లా విశాఖపట్నం, వెనీసూ, మద్రాసు, సిడ్ని, మనీలా, కలకత్తా లాంటి నగరాలకి ప్రమాదం రాబోతోందని తెలుసు. జాగ్రత్త పడాలి. దాదాపు రెండు నెలల పాటూ మనం లాక్‌డవున్‌లో ఉండి పోవటంతో, గంగానదితో సహా అన్ని నదులూ స్వఛ్ఛంగా పారుతున్నాయనీ… వందల కిలోమీటర్ల దూరం నుంచీ మంచు పర్వతాలు కనబడుతున్నాయనీ వార్తలు వస్తున్నాయి. ఒక చిన్న ఆలోచన..! సంవత్సరానికి రెండు వారాల పాటూ ఏప్రిల్ లో ఒక వారం, డిసెంబర్‌లో ఒక వారం, ప్రపంచం అంతా లాక్‌డవున్ పెడితే ఎలా ఉంటుంది? ఆ తేదీలు ముందే తెలుసు కాబట్టి అందరూ ప్రిపేర్డ్‌గానే ఉంటారు. జంక్ ఫుడ్లు, లేట్-నైట్లు ఉండవు. ట్రైన్‌లూ, విమానాలూ, ఇంకే రవాణా సౌకర్యమూ ఉండదు కాబట్టి, ఎక్కడివాళ్ళు అక్కడ ముందే సర్దుకుంటారు. కుటుంబాలతో/ తమ ఊళ్లలో గడుపుతారు. ప్రస్తుతం వారాంతమైన ఆదివారం కోసం ఎలా హుషారుగా చూస్తున్నామో, అప్పుడు ఆ వారం రోజుల శలవు ఎప్పుడొస్తుందా అని ఆర్నెల్లు ఎదురు చూస్తాం. కొన్ని కోట్ల డాలర్ల పెట్రోలు ఖర్చు మిగులుతుంది. దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. భూమి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఎలా ఉంటుంది ఈ ఆలోచన?
– యండమూరి వీరేంద్రనాథ్