ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్సుకు రాజ్యాంగ బద్ధత ఉందా ?

619

ఆంధ్ర ప్రదేశ్ పంచాయత్ రాజ్ చట్టం, 1994ను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఒక ఆర్డినెన్సు ను జారీచేయడం ద్వారా వేగవంతంగా రాజకీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్డినెన్సు మేరకు ఆ మరుసటి రోజున 617, 618, 619 నంబర్లతో మూడు జీవోలను ప్రభుత్వం జారీచేసింది. 

రాజ్యంగంలో అధ్యాయం – 9 జతచేస్తూ, ఆర్టికల్ 243, 243ఎ, 243ఒ లతో కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా అప్పటి ఏపీ ప్రభుత్వం ఏపీ పంచాయత్ రాజ్ చట్టం, 1994ను తీసుకు వచ్చింది. 

ఆర్టికల్ 243కె ప్రకారం పంచాయత్ రాజ్ ఎన్నికలు జరిపే అధికారం గవర్నర్ నియమించే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తో కూడిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఉంటుంది. ఆర్టికల్ 243కె (2)  ప్రకారం గవర్నర్ నిర్ణయించిన ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పనిచేసే పరిస్థితులు, పదవీకాలం ఉంటాయి. అయితే ఒక సారి నియామకం జరిగిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ప్రయోజనాలకు భిన్నంగా అవి ఉండరాదు. 

ప్రస్తుతం జారీచేసిన ఆర్డినెన్సు కన్నా పూర్వమే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఏర్పాటు చేశారు. అప్పటికే పంచాయత్ రాజ్ వ్యవస్థలో మూడంచెల ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా మూడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మొదటగా, చట్ట సవరణ చేస్తూ జారీచేసిన ఆర్డినెన్సు రాజ్యాంగ బద్దత. రెండో అంశం, ఆర్డినెన్సు చెల్లుబాటు అయితే అప్పటికే నియామకం జరిగిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలంపై ప్రభావం చూపుతుందా? ఈ ఆర్డినెన్సు జారీకి ముందే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఎన్నికల పక్రియను కొత్త రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కొనసాగించవచ్చా?

మొదటి అంశానికి సంబంధించి చట్టంలో సవరణ తీసుకు వచ్చే అధికారం చట్టసభకు ఉండడంతో ఈ ఆర్డినెన్సు రాజ్యాంగబద్దమే కాగలదు. అటువంటి సవరణలు చేసే అధికారాన్ని చట్టసభలకు ఆర్టికల్ 243కె కలిగిస్తుంది. 

రెండో ప్రశ్నకు సంబంధించి ఆర్డినెన్సు ను చదివిన్నట్లయితే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను తాజాగా ఆ రోజు నాటి నుండి ఏర్పాటు చేసిన్నట్లు ఉంది. దానితో అప్పటికే నీయమకమై ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై ఆర్టికల్ 243కె ప్రకారం ఇది ఎటువంటి ప్రభావం చూపలేదు. 

ఏపీ పంచాయత్ రాజ్ చట్ట సవరణకు ముందు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె క్రింద ఆ చట్టంలోని  సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఏర్పాటు చేశారు.  ఉప సెక్షన్ 2 ప్రకారం ప్రభుత్వ సిఫార్స్ మేరకు ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ కార్యదర్శికన్నా తక్కువ లేని హోదా గల అధికారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా గవర్నర్ నియమించవచ్చు. 

ఉప సెక్షన్ 3 ప్రకారం వారి సర్వీస్, పదవీకాలం గవర్నర్ నిర్ధేశించిన మేరకు ఉంటుంది. ఈ నిబంధనలను సన్నిహితంగా పరిశీలిస్తే ప్రభుత్వానికి సంక్రమిపచేసిన సర్వీస్ నిబంధనలు, పదవీకాలం, ఈ చట్టంలోని నిబంధనలు ఒకేవిధంగా లేవని స్పష్టం అవుతుంది. 

ఆర్డినెన్సు జారీ చేయడానికి ముందు నాటి పంచాయత్ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 200లో ఎటువంటి పదవీ కాలాన్ని, సర్వీస్ నిబంధనలను పేర్కొనలేదు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమించే ఒక వ్యక్తి అర్హతను మాత్రమే ప్రస్తావించింది. సెక్షన్ 200 క్రింద సంక్రమింప చేసిన అధికారాల మేరకు పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలుగా నిర్ణయిస్తూ, 65 సంవత్సరాల వయో పరిమితిని ఏర్పాటు చేస్తూ, ఇతర సర్వీస్ నిబంధనలను రూపొందించారు. 

అయితే పాత చట్టంలోని సెక్షన్ 200 స్థానంలో కొత్తగా మరో సెక్షన్ 200 తీసుకొస్తూ ప్రస్తుత ఆర్డినెన్సు ను తీసుకు వచ్చారు. దానిని సరిగ్గా చదివితే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఏర్పాటు చేసిన్నట్లు అర్ధం అవుతుంది. పైగా,  ఈ పదవికి నీయమించడానికి హై కోర్ట్ న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలని అర్హతను నిర్ణయించారు. 

పదవీకాలం మూడు సంవత్సరాలు మాత్రమే అని, దానిని మరో మూడు సంవత్సరాల మేరకు పొడిగించవచ్చని కూడా ఆర్డినెన్సు పేర్కొన్నది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకాన్ని కొనసాగించినప్పుడు ఇతర సర్వీస్ నిబంధనలు వారి ప్రయోజనాలకు భిన్నంగా ఉండరాదు. 

ఆర్డినెన్సు లోని ఉప సెక్షన్ 5 ప్రకారం ఇది అమలులోకి వచ్చిన తేదీ నుండి ఏ వ్యక్తి అయినా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నీయమితులై ఉండి, పదవిలో ఉంటె పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్సు ను ఒక సారి చదివితే కొత్తగా తీసుకు వచ్చిన సెక్షన్ 200 ప్రకారం ఈ నిబంధనను తీసుకువచ్చిన్నట్లు అర్ధం అవుతుంది. 

అయితే, పాత చట్టంలోని ఆర్టికల్ 200ను సవరించకుండా,  పూర్తిగా కొత్తగా మరో సెక్షన్ 200 చేర్చడంతో సంబంధిత నిబంధనకు సవరణ తీసుకువచ్చిన్నట్లు కాబోదు. పూర్తిగా కొత్త నిబంధన తీసుకువచ్చిన్నట్లు అవుతుంది.  

ఈ సెక్షన్ ను మార్పు చేయడానికి ముందు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న చర్యలను `కొనసాగించడం’ పై ఈ ఆర్డినెన్సు మౌనం వహించింది. ఆర్డినెన్సు ను చదివితే అంతకు ముందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను రద్దు చేసి, కొత్త నిబంధన ద్వారా కొత్త రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఏర్పాటు చేసిన్నట్లు అవుతుంది. కానీ, పాత ఎన్నికల కమీషన్ ప్రారంభించిన ఎన్నికల పక్రియ గురించి మాత్రం ఆర్డినెన్సు మౌనం వహిస్తుంది. 

ఇది చట్టాన్ని ఉపసంహరించుకోవడం కాకపోవడమతొ జనరల్ క్లాజెస్ చట్టం, 1897, ఏపీ జనరల్ క్లాజెస్ చట్టం 1891 నిబంధనలు వర్తించడం అనుమానాస్పదం కాగలదు. పాత ఎన్నికల కమీషన్ చేపట్టిన ఎన్నికల ప్రకియ కొనసాగింపును దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను అన్వయించవలసి ఉంది. ఈ విషయమై ఆర్డినెన్సు మౌనం వహించడమే కాకుండా, ఆ ప్రకియను కొనసాగిస్తున్నట్లు కూడా అర్ధం రావడం లేదు. ఆర్డినెన్సు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ నే మార్చడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె ప్రకారం ఆర్డినెన్సు మనుగడ సాగింపలేదనే వాదనకు విలువ ఉండదు. 

ఈ చట్టం పరిధిలోకి వచ్చే అన్ని పంచాయత్ రాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా తయారీ,  పర్యవేక్షణ,నియంత్రణల కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఏర్పాటు చేయాలని ఆర్డినెన్సు పేర్కొంటుంది. అంటే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను నియమించినట్లు కాగలదు.  కాబట్టి నియామకం జరిగిన తర్వాత సర్వీస్ నిబంధనలకు సంబంధించి ఆర్టికల్ 243కె లో చేసిన మార్పులు వర్తింపవు. 

పదవీకాలం అన్నది సర్వీస్ నిబంధనల క్రిందకు రాబోదని అలహాబాద్ హై కోర్ట్ పేర్కొనడంతో ఆర్టికల్ 243కె  క్రింద పదవీకాలంలో చేసిన ఏ మార్పుకు కూడా రక్షణ లభించదు. ఆ తీర్పు ప్రకారం పదవీకాలంకు, సర్వీస్ నిబంధనలకు భిన్నమైనది అయినా ప్రస్తుతం మొత్తం నిబంధననే మార్హ్సి వేయడంతో అదిక్కడ వర్తింపదు. ఆ తీర్పును సరిగ్గా చదివితే ఆ కేసులో ఒక చట్టంలోని నిబంధన ప్రత్యామ్నాయం కాదని స్పష్టం అవుతుంది. చట్టంలో పదవీకాలం మారుస్తూ కేవలం ఒక సవరణ మాత్రమే చేశారు. 

కాబట్టి, ఏపీ పంచాయత్ రాజ్ చట్టం, 1994లో ఇంతకు ముందున్న సెక్షన్ 200కు ప్రత్యామ్నాయంను ఆర్డినెన్సు లో జారీ చేయడంతో ఇది రాజ్యాంగ బద్ధత గలది కాగలదు. కానీ అంతకుముందున్న రాష్ట్ర ఎన్నికల కమీషన్ జారీ చేపట్టిన ఎన్నికల పక్రియ ప్రశ్నార్ధకం కానున్నది. ఈ సందిగ్దతను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్డినెన్సులో ఎన్నికల పక్రియను కొనసాగిస్తే తగు సవరణ చేసిన పక్షంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల పక్రియను కొనసాగించడానికి వీలు ఏర్పడుతుంది. 

-చిత్తరువు రఘు, హై కోర్ట్ న్యాయవాది,(ఆంధ్రప్రదేశ్  & తెలంగాణ)