ఆరోగ్యాలు జాగ్రత్త : గవర్నర్ దత్తన్న

384

” జాగ్రత్తగా ఉండండి. వైద్యుల సూచనలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అవసరం లేకుండా బయట తిరగకండి. ప్రస్తుత పరిస్థితుల్లో కంటికి కనిపించని కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరోగ్యాలు జాగ్రత్త..! కుటుంబాలు జాగ్రత్త ..”అంటూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు నవ యువత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పగుడా కుల బాలస్వామి కి మరియు సంఘం నాయకులను ఉద్దేశించి సూచనలు చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ నాగూరావు నామాజీ గారు, శ్రీ రథంగ్ పాండ్ రెడ్డి గారికి, బీజేపీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీ పగుడాకుల శ్రీనివాసులు గారికి దత్తాత్రేయ గారు ఫోన్ చేసి క్షేమసమాచారాలు అడిగారు. “అందరూ జాగ్రత్తగా ఉండండి – ఆరోగ్యాలు కాపాడుకోండి” అంటూ సూచించారు.

అయితే 45 రోజుల క్రితం (మార్చి 8 2020 న) నారాయణపేట మండలం కోటకొండ లో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ & అంతర్జాతీయ మహిళా దినోత్సవం వైభవంగా నిర్వహించుకున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామానికి దత్తాత్రేయ వచ్చి వెళ్లిన వారానికే కరోనా ప్రభావం ఉగ్రరూపం దాల్చడం తో దత్తన్న ఫోన్ చేసి.. భాజపా నాయకులు, ప్రత్యేకంగా నవ యువత యువజన సంఘం సభ్యుల గురించి యోగక్షేమాలు అడిగి, పలు జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా “గవర్నర్ గారికి నవ యువత” ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షులుగాను, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి, ప్రస్తుత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి ప్రభుత్వంలో కీలకమైన క్యాబినెట్ మంత్రి పదవులు చేపట్టిన పెద్దమనిషి,j గొప్ప మనసుతో కోటకొండ ను గుర్తు పెట్టుకొని “నవ యువత” సభ్యుల ఆరోగ్యాల గురించి వాకబు చేయడం అదృష్టంగా.. ఆనందంగా ఉందని బాలస్వామి పేర్కొన్నారు.