చంద్రబాబు ప్రెస్ మీట్

326
ఈ కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ప్రపంచం అంతా పడుతున్న ఇబ్బందులు, స్థానికంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలాసార్లు చెబుతూ వచ్చాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు, ప్రజలకు సమాచారం ఇస్తూ వస్తున్నాం.
మనం ఎన్నడూ కనీవినీ ఎరుగని వైరస్ ఇది. గతంలో వైరస్ లు కొన్నిప్రాంతాలకే పరిమితం. ఇది ప్రపంచంలో అన్నిదేశాలను పట్టి పీడిస్తోంది. ప్రజలంతా భయపడుతున్న కనబడని శత్రువు. అన్నిరకాల టచ్ పాయింట్ల ద్వారా శరవేగంగా విస్తరిస్తోంది.
నియంత్రణ ఒక్కటే దీనికి మార్గాంతరం. బైటనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ చేయాలి. 14రోజుల ఇన్ క్యుబేషన్ పీరియడ్, ఈ సమయంలో ఎప్పుడైనా బైటడవచ్చు, 28రోజుల్లో కూడా బైటపడవచ్చు.
కేంద్రం లాక్ డౌన్ చేయకపోతే మనం పాథటిక్ కండిషన్స్ లోకి వెళ్లేవాళ్లం.
లాక్ డౌన్- 2 పీరియడ్ మే 3కు పూర్తి అవుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పెరిగిపోతుంది.
ప్రపంచంలో ఇప్పటివరకు 24.80లక్షలు కేసులు వచ్చాయి. లక్షా 60వేల మంది చనిపోయారు. మనదేశంలో 591మంది చనిపోయారు
మహారాష్ట్రలో కేసులు, మరణాలు అత్యధికం. 53మంది మీడియా ప్రతినిధులకు కూడా సోకింది.
మన రాష్ట్రంలో 757మందికి సోకింది, 22మంది చనిపోయారు, 96కేసులు మాత్రమే రికవరీ అయ్యాయి, ఇంకా 661కేసులు రికవరీ కావాల్సివుంది.
నిన్న ఒక్కరోజే 1,318కేసులు పెరిగాయి దేశంలో. ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ అత్యధికంగా పెరిగాయి
నిన్న ఒక్కరోజే తెలంగాణలో 29, కర్ణాటకలో 18, కేరళలో 6పెరిగితే ఏపిలో 76కేసులు పెరిగాయి. చాలా ఆందోళనకర అంశం ఇది.
కరోనాను దాచిపెట్టినా, కావాలని కప్పెట్టినా, దానివల్ల కలిగే అనర్ధాల గురించి తొలినుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. నాతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంటే, వైసిపివాళ్లు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు.
అన్ని రాజకీయ పార్టీలతో ఆన్ లైన్ లో ఒక సమావేశం పెట్టండి. మీకు నచ్చిన అధికారులు, మేధావులను పిలవండి, అభిప్రాయాలు తీసుకోండని చెప్పినా ఈ ప్రభుత్వం లెక్క పెట్టలేదు. దీనిని నేను ఖండిస్తున్నాను.
ఇది 5కోట్ల ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం, మీ స్వంత అంశం కాదు. అందరం కలిసి సమష్టిగా చేయాల్సిన యుద్దం. ఇది దేశ మనుగడకు సంబంధించిన విషయం, ఒక రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. ఒక బాధ్యతగా ప్రవర్తించాలి అందరం.
చాలా రాష్ట్రాలు అనేక ల్యాబ్ లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. పకడ్బందీగా టెస్టింగ్ లు చేస్తున్నాయి. కానీ మనదగ్గర ఎందుకు గందరగోళం చేస్తున్నారు..?
ఏపిలోని 13జిల్లాలలో 11రెడ్ జోన్ లో ఉన్నాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేసి హాట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెడితే తప్ప దీనిని నివారించలేం.
వైద్యులకు ఇచ్చే రక్షణ పరికరాల(పిపిఈలు) విషయం ఎందుకు నిర్లక్ష్యం చేశారని అడుగుతున్నాను. కరోనా రోగికి చికిత్స చేసినందుకు నెల్లూరులో డాక్టర్ కు కూడా సోకింది. చివరికి ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సోకింది. చెన్నైలో ఆయన చనిపోతే మృతదేహాన్ని కూడా స్వగ్రామానికి తెచ్చే పరిస్థితి లేదు. ఆ డాక్టర్ అంత్యక్రియలు కూడా అక్కడే చేయాల్సి వచ్చింది.
కర్నూలు జిల్లాలో ఎందుకీ పరిస్థితి వచ్చింది..? అక్కడ పేదల డాక్టర్ కూడా కరోనా రోగికి చికిత్స చేసి చనిపోయాడు.
రాష్ట్రంలో పిపిఈలన్నీ ఒక పద్దతి ప్రకారం ఉన్నాయా..? డాక్టర్ల గౌన్లు, మాస్క్ లు రక్షణ ఇచ్చేవేనా..? వాటి నాణ్యత పరీక్షించారా..? వీటన్నింటిపై ప్రాపర్ ఆడిటింగ్ చేయాలి, క్వాలిటీ టెస్ట్ చేయాలి. వీళ్లంతా కరోనాపై పోరాడే ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది గుర్తుంచుకోవాలి.
నిన్న ఒక ఏఎస్ ఐ చనిపోయాడు. కరోనా రోగులకు చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు త్యాగాలు చేసేందుకు సిద్దం అయినవాళ్లను రక్షించే విధానం ఇదేనా.?
ముందు మెడ్ టెక్ జోన్ పై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మా ముందుచూపు వల్లే మెడ్ టెక్ జోన్ వచ్చిందని చెప్పారు. ఒక గంటలో ఫలితాలు వచ్చేస్తాయి, ఇది మా సీఎం విజన్, వెంటిలేటర్లు, కరోనా కిట్లు ఇక్కడే చేస్తాం అని మంత్రి మేకపాటి చెప్పారు
ఏ2 ఇష్టానుసారం అందరిగురించి మాట్లాడతారు. ఇది మావిజన్ దేశానికే సరఫరా చేస్తున్నాం అన్నారు. ఈ రోజు సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.
ఒక్కో కిట్ రూ 730కు కొన్నామని చెప్పారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం సేమ్ బ్రాండ్ సేమ్ కంపెనీ కిట్ రూ 337 ధరకు తెప్పించింది. ఇప్పుడు పట్టుబడినాక తగ్గిస్తామని అంటున్నారు.
ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం న్యాయం..?
ప్రభుత్వ పిలుపును గౌరవించి ప్రజలు లాక్ డౌన్ పాటిస్తుంటే, వాళ్ల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇదేనా చేసేది..?
కిట్లు విషయంలో కక్కుర్తి పడితే మిమ్మల్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి. మేము ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతారు. కర్నూలులో మీరు చేసింది తప్పు అని ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతారా..?
రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆక్వా రైతాంగం అనేక కష్టాలు. హార్టీ కల్చర్ ఉత్పత్తులకు ధర లేదు. పండ్లు కుళ్లిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. వీటిని రైతు బజార్లకు సరఫరా చేయలేమా..? మొబైల్ రైతుబజార్లలో ఇంటింటికి అమ్మించలేమా..? మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రభుత్వమే కొని రైతు బజార్లలో, మొబైల్ రైతుబజార్లలో అమ్మవచ్చు. ఆ భారం ప్రభుత్వం భరించివుంటే రెండువిధాలా ప్రజలకు లాభం చేకూరేది.
అరటి, పుచ్చ, కర్బూజ అన్ని రకాల పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకటనలే తప్ప రైతులను ఆదుకున్నది లేదు. ప్రజల్లో ఎందుకని విశ్వాసం కల్పించలేక పోతున్నారు..?
ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు మేము పనిచేస్తున్నాం అని మంత్రులు ప్రకటనలు గుప్పిస్తారు. అమలు చేసేవాళ్లు ఆదేశాలు ఇవ్వడం ఏమిటి..? ఇది మీ చేతగాని తనం కాదా.. మీ వైఫ్యల్యం కాదా..? ఇంతవరకు మీరు రైతులకు చెప్పిన మాటలు ఒక్కటన్నా అమలు అయ్యిందా..?
పండించిన పంటకు ధర రాక నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రఘురామి రెడ్డి పురుగుమందు తాగి ఆత్మహత్య
కృష్ణా జిల్లా ముండ్లపాడు గ్రామంలో కొత్తపల్లి మోహన్ రావు పురుగుమందు తాగి ఆత్మహత్య
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పులివెందులలో పౌలిరెడ్డి అనే రైతు గుళికలు మింగి చనిపోయాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో మహిళా రైతు మంగమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడ రైతులకు మీరు భరోసా ఇచ్చారు..? ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడానని నామీద సాయంత్రానికల్లా విరుచుకు పడతారు.
టిడిపి, బిజెపి, జనసేన ఏ పార్టీ నాయకులు మాట్లాడినా వాళ్లపై విమర్శలు గుప్పిస్తారు. మొన్న కన్నాపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.
ఎందుకు ఏఎస్ ఐ చనిపోయాడు..? అతనికి సరైన రక్షణ పరికరాలు ఇచ్చారా..? పోలీసులకు సరైన భద్రతా పరికరాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది..?
పాలకొల్లులో పోలీసులు వెంటపడేసరికి టిఫిన్ బండివద్ద టిఫిన్ తినే వ్యక్తి పరుగెత్తుతూ కుప్పకూలి చనిపోయాడు. చింతలపూడి నియోజకవర్గం వెంకటాపురంలో ఇంకో వ్యక్తి చనిపోయాడు. కర్నూలులో పోలీసులు వెంటపడేసరికి పరుగెత్తి మరో యువకుడు చనిపోయాడు.
నిన్న మందులు తేవడానికి వెళ్లి సత్తెనపల్లిలో ముస్లిం యువకుడు లాఠీచార్జ్ లో చనిపోయాడు
ఇది సరైనదేనా..? ఇవన్నీ కొన్ని సంఘటనలు మాత్రమే..
ఈ రోజు కొవ్వూరులో యూపి నుంచి వచ్చిన వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలలో మన వలస కార్మికులను ఆదుకోమని లేఖలు రాస్తున్నాం. వాటికి స్పందించి అక్కడి రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి. ఇక్కడ ఉండే వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా..? వాళ్లు తిండిలేక రోడ్డున పడే పరిస్థితి తెచ్చారు.
క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి చనిపోవడం ఏంటి..? క్వారంటైన్ లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తే వాళ్లకు పాజిటివ్ బైటపడితే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక చికిత్స ఇవ్వాలి. ఎక్కడికి పోతున్నాం మనం.. ఇది లాకప్ డెత్ లాంటిదే. గుంటూరు జిల్లా నరసరావుపేట లో, పెడనలో, చింతలపూడి మండలంలో చనిపోయారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేవాళ్ల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోలేక పోయారు..? తిరుపతి నుంచి స్వగ్రామానికి వెళ్తూ బాపట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఇంకొకరు కుప్పకూలి చనిపోయారు.
ప్రాణాలు ఉంటాయా పోతాయా అని అందరూ ఆందోళనలో ఉంటే ఇప్పుడు కూడా, ప్రతిరోజూ పంచాయితీ ఎన్నికలు పెడతాం అంటారా ఎవరైనా..?
ఎన్నికలు వాయిదా వేసి రమేష్ కుమార్ మంచిపని చేశాడని ప్రజలు మెచ్చుకుంటే, సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తే ఆయనకు మీరిచ్చిన బహుమతి ఏంటి..? ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయనను పదవి నుంచి తొలగిస్తారా..?
మేము ఏపికి వస్తే క్వారంటైన్ లో పెడతామని బెదిరిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యార్ధులు ఏపికి వస్తే వాళ్లను లాఠీఛార్జ్ చేసి తరిమేశారు. అలాంటిది ప్రభుత్వమే చెన్నై నుంచి కనగరాజ్ ను అంబులెన్స్ లో ఎలా తీసుకొస్తారు..?
ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఛైర్మన్ ల నియామకం చేస్తున్నారు. ఎందుకింత ఆత్రత..? టిడిపిపై ఫేక్ న్యూస్ పెట్టి దుష్ప్రచారం చేసిన మీరు ఇప్పుడేం చేస్తున్నారు..? ఒకే సామాజిక వర్గం వాళ్లను నియమిస్తే ఆ సామాజిక వర్గానికి ఏమైనా లాభమా..?
ముఖ్యమంత్రి పారాసిటమాల్ వ్యాఖ్యల వల్ల ప్రపంచం అంతా ఎంత చులకన అయ్యాం..? ముఖ్యమంత్రే అంత తేలిగ్గా తీసుకుంటే ప్రజలు ఎలా తీసుకుంటారు..దానివల్ల అందరూ అశ్రద్ద చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంపలు కూలే పరిస్థితి తెచ్చారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి.? 15% సోకితే మన దగ్గర వాళ్లందరికీ ఆసుపత్రులు ఉన్నాయా..?
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మేము కట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను యుద్దప్రాతిపదికన 1500పడకలతో ఆసుపత్రిగా మార్చారు. అలాంటి స్ఫూర్తి ఇక్కడ ఎందుకు కొరవడింది..?
కరోనా మరణాలను ఎందుకు దాచిపెడుతున్నారు..? మీ బూతులకు మేము భయపడి గమ్మన ఉంటే మేము కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం.
మౌనంగా ఉంటే చరిత్ర మమ్మల్ని క్షమించదు. ప్రజల ప్రాణాలను కాపాడలేం. ఆ ఉద్దేశంతోనే బాధ్యతగల నాయకులుగా మేము మాట్లాడుతున్నాం.
అన్నా కేంటిన్లు ఇప్పుడు ఉంటే ఎంతమంది పేదలకు భోజనం దొరికేది..?
వైసిపి ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ వ్యాపింపజేయడం సరైందికాదు.
శ్రీకాళహస్తిలో అక్కడి వైసిపి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ఊరేగింపుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ రోజు 13మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? తప్పు చేసినవాళ్లను ఎందుకు ఈ ముఖ్యమంత్రి నిలదీయలేక పోయాడు..?
గుంటూరులో కూడా అదే జరిగింది. ఆ రోజే మీ ఎమ్మెల్యే చేసిన దానిని నిలదీసివుంటే ఈ రోజు గుంటూరులో కొన్ని వందలమందికి కరోనా సోకేదేనా..? ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటుంటే మేమెలా సహకరిస్తాం..?
సోషల్ మీడియాపై కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టడానికి ఒక నల్ల చట్టం తెచ్చారు. మరీ ఈ వైసిపి ఎమ్మెల్యేలపైన ఏం చర్యలు తీసుకున్నారు..?
ఇది చాలా దుర్మార్గం, దీనిని నేను ఖండిస్తున్నాను.

పొరుగు రాష్ట్రాలు అన్నిరకాల సరుకులతో ప్రత్యేక ప్యాకేజిలు ఇస్తుంటే మీరు నాలుగైదు కిలోలు ఇచ్చి సరిపెడతారా..? పక్కరాష్ట్రాలను చూసైనా నేర్చుకోరా..?
కేరళలో 2నెలలకు సరిపోయే 17రకాల సరుకులు 95లక్షల కుటుంబాలకు ఇచ్చారు.
నవరత్నాలు ఇస్తామని ఆశలు పెట్టిన మీరు, ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే ఈ రోజు కనీసం ఇంటింటికీ రేషన్ ఇవ్వలేరా..? డిపోలకు వచ్చి క్యూలైన్ లో నిలబడి తీసుకోమంటారా..?
అదే కేరళలో వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికి రేషన్ ఇచ్చారు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నామీరెందుకు ఇవ్వలేక పోయారు..?
కేరళలో సన్ ఫ్లవర్ ఆయిల్ 1లీటర్, కొబ్బరినూనె అరలీటర్, ఉఫ్పు కిలో, గోధుమ పిండి 2కిలోలు, రవ్వ కిలో, మినుములు కిలో, పెసలు కిలో, టి 250గ్రాములు, 16కిలోల బియ్యం 17రకాల సరకుల ఇచ్చారు.

కేరళలో డాక్టర్లకు, ఆరోగ్య సిబ్బందికి పెద్దఎత్తున భద్రతా పరికరాలు ఇచ్చారు.
నా దగ్గర మాస్క్ లేదన్న డాక్టర్ ను మీరు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. మా వద్ద రక్షణ ఉపకరణాలు లేవని జూనియర్ డాక్టర్లు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోరా..?
దాతలు కూడా ఇచ్చేది వీళ్ల పేరుచెప్పి ఇవ్వాలట. దానిపై ప్రత్యేకంగా జీవోలు తెచ్చారు ఎంత నీచం ఇది.. మీ పేరుచెప్పి దాతలు ఎలా ఇస్తారు..? మా వాళ్ల ద్వారా ఇవ్వాలి, మా వాలంటీర్ల ద్వారా ఇవ్వాలని ఒత్తిడి చేస్తారా..?
ఏ ఊరివాళ్లు ఆ ఊళ్లో కూరగాయలు పంచితే మీ అభ్యంతరం ఏంటి..?
ఈ కష్టకాలంలో సేవాభావం ఉండాలని, ప్రతి ఒక్కరూ నలుగురికి సాయం చేసి ఆదుకోవాలని ప్రధాని పిలుపు ఇస్తే, మీరిలా ఎందుకు చేస్తున్నారు..? పేదలను ఆదుకునే దాతలపై కేసులు పెడతామని బెదిరిస్తారా..?
ప్రతి ఒక్కరూ పది మందికి సాయపడాలి. అందరిలో సేవాభావం రావాలి. భద్రతా ఏర్పాట్లు చేసుకుని దాతలే స్వయంగా పంపిణీ చేస్తే మీకెందుకు అభ్యంతరం..?
కేరళలో 71.4% రికవరి రేటు ఉంటే, మనవద్ద 12.7% ఉంది. ఎందుకీ వ్యత్యాసం..?
సరిగ్గా చేయకపోవడం వల్లే మన రాష్ట్రంలో అనేక రోజులు ఉండాల్సివస్తోంది క్వారంటైన్ లో. హాస్పటల్ లో రికవరీ కాకుండా 19రోజులు ఉన్నారు. రెండు దఫాలుగా నెగిటివ్ వస్తేనే ఇతర రాష్ట్రాలలో ఇంటికి పంపుతున్నారు. అదికూడా మనదగ్గర జరగడంలేదు.
కేరళలో 2మరణాలు జరిగితే మనదగ్గర 22 చనిపోయారు.
నియంత్రణ చేసిన రాష్ట్రాలు సత్ఫలితాలు సాధించాయి. ప్రతిపక్షాలపై దాడి చేసే రాష్ట్రాలు విఫలం అయ్యాయి.
ఇప్పటికైనా రాష్ట్రంలో వైసిపి నేతల ధోరణి మారాలి, ప్రతిపక్షాలపై ఎదురుదాడి మానాలి.
కరోనా కిట్ ధర చూస్తేనే మీ నిజ స్వరూపం అర్ధం అయ్యింది. ఎవ్వరూ మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. మీ మొండి వైఖరి విడనాడండి.
మీరు ఇచ్చే బియ్యం తినడానికి పనికొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి పేద కుటుంబానికి కనీసం రూ 7,500నుంచి రూ 10వేలు ఆర్ధిక సాయం అందించాలి. అప్పుడైనా వాళ్లకు కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కోగలరు. రాష్ట్రంలో రైతులను తక్షణమే ఆదుకోవాలి. పేదలను ఆదుకోవాలి.
విజయసాయి రెడ్డి ఊరంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఆయనకి ఉన్న అధికారం ఏంటి అన్ని ఊళ్లు తిరగడానికి ..? ఒక ఎమ్మెల్యే బెంగళూరు నుంచి 6వాహనాల్లో 39మంది అనుచరులను వెంటేసుకుని వస్తాడు, మదనపల్లిలో అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహిస్తాడు.
ఇంకో ఎమ్మెల్యే కాళ్లపైన పూలు జల్లించుకుంటారు. ఏంటి మీ వింత ప్రవర్తన, ఇది సరైన విధానమేనా..?
ఇవన్నీ ఇకనైనా ఆపండి. ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి. ఇది రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన సమయం.
వైసిపి నాయకులు ప్రవర్తన జుగుప్సగా ఉంది. దానిని ఖండిస్తున్నాం. ఇప్పటికి రాష్ట్రం చెల్లించిన మూల్యం చాలు. ఇంకా భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ప్రజలను ఆదుకోవడంలో ఇతర రాష్ట్రాలతో పోటీబడండి. కష్టాలలో ఉన్న సాటి మానవులను ఆదుకోండి.
ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఇంకా మరికొంత కాలం కొనసాగించాలి. నియంత్రణ చేస్తేనే కరోనాను నిరోధించగలం. లేకపోతే భారీ సంఖ్యలో ప్రాణాలు పోతాయి.

వైసిపి వాళ్ల నోటికి హద్దు ఆపు లేకుండా పోయాయి. పేదల ప్రాణాలు కాపాడేందుకు కొనే కిట్లు ఇవి. షార్ట్ టెండర్ ఎందుకని పిలవలేదు..? మీకు కావాల్సిన సండూర్ కంపెనీకి ఎందుకిచ్చారు..? చత్తీస్ గఢ్ ప్రభుత్వం అదే కంపెనీ, అదే బ్రాండ్ కొన్నదా లేదా..? దీనిని అడిగిన కన్నా లక్ష్మీనారాయణతో నేను లాలూచి పడ్డానా..? ఆయనకు నేను డబ్బులిచ్చానని ఆరోపణలు చేస్తారా..? ప్రజల ఆరోగ్యంపై మీకున్న శ్రద్ద ఇదేనా..?

‘‘గివ్ బ్యాక్ టు సొసైటి’’ అన్నదానిపైనే నా ఆలోచనలు:
నిన్న నాకు అభినందనలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు సేవచేసే శక్తి ఇవ్వాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు. గివ్ బ్యాక్ టు సొసైటి అనేదే నా మార్గం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంపైనే నా దృష్టి ఉంటుంది. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి పెనుతుపాన్ వచ్చినా ఆదుకున్నాం, ఒడిశాలో తుపాన్ తో అస్తవ్యస్థం అయినా ఆదుకున్నాం. మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయి.
గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా అన్నింటినీ అధ్యయనం చేస్తున్నాం. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ సహకారం తీసుకుంటున్నాం.

ఆర్టీజిఎస్ ను ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు ప్రతి కేసును నిశితంగా అధ్యయనం చేసే వీలుండేది. కాల్ సెంటర్ ను కూడా నాశనం చేశారు. ప్రతి కేసును జియో ట్యాగింగ్ చేసి, జియో ఫెన్సింగ్ చేయడం ద్వారా టోటల్ లాక్ డౌన్ చేయగలిగేవాళ్లం. వాళ్లందరికీ మందులు, ఇంటింటికే నిత్యావసరాలు పంపగలిగేవాళ్లం. పకడ్బందీ పర్యవేక్షణ, సమగ్ర చికిత్స ద్వారా రెడ్ జోన్ ను ఆరంజ్ కు తీసుకు రాగలిగేవాళ్లు. అటువంటి మెకానిజమ్ తీసుకురావాలి. మందుల కోసం బైటకొచ్చి సత్తెనపల్లిలో లాగా చనిపోయే పరిస్థితి రాకూడదు.
ఒక పక్క కరోనా వైరస్ నియంత్రణ చేస్తూనే మరోపక్క రాష్ట్రంలో హాస్పటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయాలి.
పిపిఈలు లేకపోతే డాక్టర్లు అంతా చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. డాక్టర్లే చనిపోతే ఇంక ఎలా చికిత్స చేస్తారు రక్షణ పరికరాలు లేకుండా..?

ప్రజాహితం కోసమే ప్రధానితో చర్చించాను. లాక్ డౌన్ ను ప్రశంసిస్తూనే చేయాల్సిన వాటిపై సూచనలు ఇచ్చాం. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంటే మీరెందుకు వాళ్లపై విరుచుకు పడుతున్నారు..? మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఆమాత్రం స్ఫూర్తి మీకు లేదా..?
తనతో విభేదించే ప్రతిపక్షాల నాయకులతో కూడా ప్రధాని నరేంద్రమోది మాట్లాడారు. వాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయనకుండే ఓపిక మీకు లేదా..?
ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే ఎందుకంత అజం మీకు..? ఎందుకింత అసహనం పెంచుకుంటున్నారు..? ఈ రాష్ట్రం ఏమన్నా మీ జాగీరా..? ఏడాది ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఎందుకింత మిడిసిపాటు..?
ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతారేమో అనే భయంతో ప్రజలంతా నిస్సహాయులుగా మారారు.
కనిగిరి ఎమ్మెల్యే చేసింది తప్పు అని ఖండించారా..? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేసింది తప్పని ఖండించలేరా..? అదే మా మీద మాత్రం ప్రతిరోజూ విరుచుకుపడతారా..?
మేము విరాళాలు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఎవరికి ఇచ్చాం..? ముఖ్యమంత్రి సహాయ నిధికే ఎందుకిచ్చాం..? మావాళ్లు సంశయంగా ఉన్నా సీఎంఆర్ ఎఫ్ కే ఎందుకిచ్చాం..?
ముఖ్యమంత్రి అనేది ఒక వ్యవస్థ.. ఆ వ్యవస్థను గౌరవించి ఇచ్చాం. ప్రజలను కాపాడుకుందాం, అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం అని ప్రధాన ప్రతిపక్షంగా సహకరించడానికి సిద్దంగా ఉంటే మా మీద దుమ్మెత్తి పోస్తారా..?
రాష్ట్రం తగులబడుతున్నా, మీరు చేస్తోంది తప్పు అని సీనియర్ నాయకుడిగా చెప్పకపోతే ప్రజల్లో దోషిగా మిగిలిపోతాను. అందుకే పదేపదే హెచ్చరిస్తున్నాను, ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాను. మీకు సహకరించడానికి సిద్దంగా ఉన్నాం, ఆన్ లైన్ లో అఖిలపక్ష సమావేశం పెట్టండి. అని అనేకసార్లు చెప్పాం.
ఇప్పుడీ పరిస్థితుల్లో కూడా రాజధాని తరలింపు ఆగదని విజయసాయి రెడ్డి ఈ రోజు చెబుతున్నారు. అంటే రాజకీయాలు చేస్తోంది ఎవరు..? అమరావతి ప్రజలను కవ్వించేలా మాట్లాడుతోంది ఎవరు..? ఇది అహంకారం కాకపోతే ఏంటి..? మీ అహంకారం వల్లే రాష్ట్రం నష్టపోతోంది.
మేండేట్ ఇచ్చారని ఇష్టానుసారం చేయడం సరైంది కాదు. ఆ మేండేట్ ఇచ్చేది ప్రజలే, ఆ నెంబర్ తీసేది ప్రజలే.
ఇది నేనేదో కోపంతో చెప్పడం లేదు, రాష్ట్ర హితం కోరి చెబుతున్నా.