ఆయన నామమే విజయానికి మూలమంత్రం

472

నేడు కరోనా కారణంగా ప్రపంచమంతా ప్రభావితమైంది. ఈ విపత్కర సందర్భంలో దేశంతో పాటు, ప్రపంచంలో బాధలకు గురవుతున్న వారికి సేవచేసే కర్తవ్యాన్ని భారత్ స్వీకరించిoది.
“”సర్వే భవంతు సుఖినః …వసుధైవ కుటుంబకం”” అనే భావన కలిగిన సంస్కృతి మనది. దానిని మన వాళ్ళు నేటికీ ఆచరించి చూపుతున్నారు. కరోనా తో బాధపడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలకు మందులు, వందల కోట్ల ధనరాశి అందించి మానవతను చాటుకుంటోంది భారత్.

దేశంలో ఉన్న వివిధ ధార్మిక సంస్థలతోపాటు విశ్వహిందూ పరిషత్) యువ విభాగం బజరంగ్ దళ్ పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా అభాగ్యులు, నిరుపేదలకు సహాయం చేసేందుకు 27 వేల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆహార, అన్నదానం కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రెండు లక్షల 75 వేల మందికి ఆదరంగా అన్నదానం చేస్తున్నారు. మూడు లక్షల 25వేల కుటుంబాలకు భోజన పదార్థాలు అందజేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వారికి లక్షల సంఖ్యలో మాస్క్ లు తయారు చేసి అందించడంతో పాటు వైద్య విభాగంలో పని చేస్తున్న అనేకమందికి అండదండగా నిలబడుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న నగరాల్లో కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం.

లంకలో ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు, శ్రీరాముడు అనేక రకాలుగా హనుమంతుడిని అభినందించారు. అప్పుడు హనుమంతుడు స్పందిస్తూ “మీరు ఇచ్చిన శక్తి తప్ప ఇందులో లో నా గొప్పదనం ఏమీ లేదు” అని బదులిస్తూ తన సంస్కారాన్ని చాటుకున్నాడు.
మహా భక్త రహీం దాస్ గురించి తులసీదాస్ ఓ విషయం చెప్పాడు.. “ఎవరి చేయి కింద ఉందో- వారికి చేయూత నివ్వడం దైవ కార్యం గా భావిస్తాను” అని తన సేవా భావాన్ని నిరూపించుకున్న మహా భక్త రహీం దాస్ యొక్క గొప్పతనాన్ని తులసీదాసు రచించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి.

ప్రస్తుతం కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ మే మూడో తేదీ వరకు పొడిగించిన విషయం అందరికి తెలిసిందే. కాబట్టి కొత్త కొత్త కార్యకర్తలను కూడా సేవా కార్యక్రమాల్లో కలుపుకొని ముందుకు వెళ్లాలి. ఈ మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యే వరకు దృఢ సంకల్పంతో సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. అదే సమయంలో ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
ఈ మాట చెప్పేటప్పుడు తబ్లిక్ జమాత్ విషయం ముందుకు వస్తోంది. ఈ సందర్భంలో ముస్లింల లో ఒక వర్గం.. ఈ రోగం ఉన్న వాళ్లను బయటకు తెలియని ఇవ్వడం లేదు . ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వాళ్లను పట్టుకోవడంలో పూర్తిగా సఫలీకృతం కావడం లేదు. వారి మూఢనమ్మకాలకు తోడు, కొంతమంది ముస్లిం నాయకులు తప్పుడు సందేశం ఇస్తున్నారు. సమాజంలో చిచ్చుపెట్టే సంకేతాలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఓవైసీ ప్రకటన దౌర్భాగ్యం గా అనిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వాళ్ళు వీరమరణం పొంది, అమరులుగా వెలుగొందు తారని రెచ్చగొట్టే ప్రకటనలు మనం వింటున్నాం. కరోనా వల్ల చనిపోయిన వాళ్లను పూడ్చి పెట్టండి అంటూ పిలుపునిస్తున్నాడు. అయితే ఈ వైరస్ తో చనిపోయిన వాళ్లను పూడ్చి పెడితే వ్యాధి అనేక రెట్లు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి వ్యాధి బారిన పడి మరణించిన వాళ్లను దహనం చేయాలి. ఈ విషయాన్ని గుర్తించి తప్పుడు మాటలు చెప్పే నేతలను ముస్లిం సమాజం వెలి వేయాల్సిన అవసరం ఉంది. నేడు ముస్లిం సమాజం అబ్దుల్ కలాం, అబ్దుల్ హమీద్, అప్స తుళ్ళ ఖాన్ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. సి ఏ ఏ & కరోనా విషయంలో తప్పుడు మార్గదర్శనం చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా రోగగ్రస్తులైన వారిని గుర్తించి, ప్రభుత్వ యంత్రాంగానికి భజరంగ్ దళ్ కార్యకర్తలు అప్పజెప్పాలి. సోషల్ మీడియాలో కాకుండా సరాసరి ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలి. అలాగే వేరుగా పంపి, మన కేంద్ర కార్యాలయానికి కూడా తెలియజేయాలి. కరోనా విషయంలో ఓ వర్గాన్ని వెనకేసుకు వస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు అసంబద్ధ కథనాలు రాస్తున్నాయి. కానీ ఇలాంటి చర్యల వల్ల మొత్తం మీడియా వ్యవస్థనే అబాసు పాలవుతోంది.

ప్రతి ఒక్కరూ నేడు తమ తమ ఇళ్లలో ఉండాలి అనే ప్రభుత్వ సూచన వచ్చినప్పుడు కార్యకర్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.. అదే సందర్భంలో సేవ కూడా చేయాల్సిందే.. సురక్ష విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిందే! ఈ విషయాలు కార్యకర్తలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. అనేక ఇళ్లలో వయో వృద్ధులు, మహిళలు వంటరిగా జీవిస్తున్న సందర్భాలలో వారికి ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది. కొంతమంది ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వారితో సంపర్కం చేసి మనోబలాన్ని నిర్మాణం చేయాలి. ఇదే సమయంలో కార్యకర్త తన కుటుంబం, బంధుమిత్రులతో కూడా తగినంత గమనం ఉంచాల్సిన అవసరం ఉంది.
భజరంగ్ దళ్ కార్యకర్తలు వివిధ విషయాలను అధ్యయనం చేయాలి. అందుకు బజరంగ్ దళ్ నేషనల్ కన్వీనర్ సోహన్ సింగ్ సోలంకి జి మీకందరికీ పుస్తకాలు పంపించారు. వాటివల్ల మహాపురుషుల చరిత్ర అధ్యయనం చేస్తూ.. వారి జీవితం లో అందించిన విశేష వాక్యాలను మన జీవితంలో అమలు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. బజరంగ్ దల్ ప్రార్థన పూర్తిగా అధ్యయనం చేస్తూ.. సద్గుణ సంపన్నులుగా నిర్మాణం కావడం, అధ్యయనం వల్ల కలిగే ఉపయోగం తీసుకుంటే.. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడు, అందువల్ల రామ నామ జపం హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. తద్వారా శక్తివంతమైన ఉపాసకులుగా తయారు కావాలి. విష్ణు.. బ్రహ్మ.. శివుడు (త్రిమూర్తులు) వీళ్ళందరూ ఏదైనా సాధించారు అంటే …తపో బలం కారణంగానే అనే విషయం గుర్తుంచుకోవాలి. నేడు దేశంలో కన్యల అపహరణ, గో హత్య, మతమార్పిడుల తో పాటు హిందువులు హిందువుల మధ్యనే కొట్లాటలు పెడుతున్నారు.. కుళ్లు కుతంత్రాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి భక్తి ఉపాసన ద్వారానే సాధ్యమవుతుంది. ఈ శాంతి కాలంలో ఉపాసనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి, సమస్యలు పరిష్కరించుకోవాలి.

నేడు ప్రపంచంలో అత్యధిక యువశక్తి భారత్ లో ఉన్నట్లు రుజువైంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రామజన్మభూమి విషయంలో సాధించిన విజయం.. చేసిన ఉద్యమం అని చెప్పుకోవచ్చు. సమస్యను పరిష్కరించుకోవడం …మాన బిందువుల సంరక్షణ కోసం కార్యకర్తల తపస్సు, ఉపాసన ఆధారం అవుతాయి. హనుమంతుడు శారీరక శక్తికి, ఉపాసనకు, బుద్ధి బలానికి ప్రతిరూపం. అతనే మన ఆదర్శం.

లక్షలాది మంది యువకులను తయారు చేశామని మహమ్మదీయ వ్యక్తులు పేర్కొంటున్నారు. “మేం తలుచుకుంటే వంద కోట్ల హిందువులను అంతం చేస్తాం ” అనే ఎంఐఎం పార్టీ వ్యక్తులు సవాల్ విసురుతున్నారు. తపో బలం, ఉపాసన బలం ఆధారంగా ఈ సవాళ్లన్నిటికీ కూడా జవాబు చెప్పే స్థితి నేడు మనం పొందాలి. శారీరక, మానసిక , బుద్ధిబలం సంపాదించాలి. ఈ శాంతి సమయంలో మన కార్యకర్తలు, కార్యానికి సహకరించే దాతలు అందరితో నిరంతరం సంపర్కం కలిగి ఉండటం అవసరం. అనుమతి ఉన్న ప్రదేశాల వరకు వెళ్లి వారితో నిరంతర సంపర్కం చేయాలి. భజరంగ్ దళ్ కార్యకర్తలు విశ్వహిందూ పరిషత్ యొక్క ప్రతిరూపాలుగా భావించుకొని, సంకల్ప వాక్యం ధర్మో రక్షతి రక్షితః అనేదానిని పాలించాలి. అందుకు సంపూర్ణ అనుశాసనం, సంఘటిత శక్తి తోడుగా నిలవాలి. మన హనుమంతుడి జీవితంలో రామకార్యం కోసం సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. అలాగే విభీషణుడిని కూడా చేరదీశాడు హనుమంతుడు. అదేవిధంగా నేడు సేవా కార్యo నిమిత్తం అనేక చోట్ల సంపర్కానికి వచ్చిన ప్రముఖుల జాబితాను సమీకరించు కోవాలి. భవిష్యత్ కార్యాచరణలో వీరందరి సహకారం మనకు ఉపయోగపడుతుంది. పై విషయాలు అన్ని కూడా ఆచరించి, పాలించేoదుకే పరిషత్ ఆవిర్భవించింది. ఈ సమాజ సురక్ష లో సంపర్కం పెంచుకుంటూ శక్తిశాలురo అవుతూ వినయంతో జీవించాలి. మన శక్తి ధార్మిక శక్తి.. హనుమంతుడు అశోకవనంలో సంఘర్షణ చేస్తూ, అక్షయ కుమార్ ని, అనేకమంది మంత్రులను చంపేశాడు.. అశోకవనాన్ని విధ్వంసం చేశాడు. కానీ జానకి కూర్చున్న వృక్షానికి ఏ ప్రమాదం రాకుండా జాగ్రత్త వహించాడు. లంక మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. పరమ భక్తుడైన విభీషణుడి గృహానికి ఏ రకమైన ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ విధంగా భజరంగదళ్ కార్యకర్తలు రాక్షస శక్తిని ఎదిరించడం లో… సజ్జన శక్తిని సంరక్షించడంలో చట్టం పరిధిలో దైవ శక్తిని సదుపయోగం చేసుకోవాలి. ఈ సందర్భంలో శ్రీ రాముడి వాక్యం స్మరించుకోవాలి. మన వినయం సమాజం అర్థం చేసుకోకపోతే, శక్తి ప్రదర్శన జరిపి తీరాల్సిందే. నేడు హిందూ సంస్కృతి.. హిందూ ధర్మాన్ని.. హిందూ సమాజాన్ని అణచివేయాలనే విదేశీ శక్తుల కి భయం కలగాలి. చరిత్రాత్మకమైన ఈ సమయంలో మనమంతా బాధ్యతాయుతంగా కార్యంలో విజయం సాధించాలి. హనుమంతుడు ని ఆదర్శంగా తీసుకుని, తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. కాబట్టి శీలం సద్గుణ సంపన్నులై ఈ కార్యంలో విజయం సాధించాలి. ముఖ్యంగా తన సొంత ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలి. రాముని జీవిత చరిత్ర మొత్తం కూడా కళ్యాణ కారకమే. రాముడు అన్నింటా విజయం సాధించాడు.. ఆయన నామమే విజయానికి మూలమంత్రం. ఈ విధంగా ప్రతి కార్యకర్త నిమగ్నం కావాలి అని సూచిస్తూ… అందరికీ ఉదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..