విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న సిబ్బంది త్యాగాలకు ప్రతిరూపం

340

విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న సిబ్బంది త్యాగాలకు ప్రతిరూపం , అభినందనీయం,ఆదర్శనీయం:కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు:దేశ వ్యాప్తంగా ఆందోళనలు సృష్టిస్తున్న కరోనా మహమ్మారి పై అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్స్,ఆసుపత్రి సిబ్బంది,పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ,విద్యుత్ సిబ్బంది సేవలు మరియు ప్రింట్ మరియు ఎల్ట్రానిక్ మీడియా,బ్యాంక్ లు వాటి సిబ్బంది అందరి సేవలు అభినందనీయమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అభిప్రాయ పడ్డారు. దీనిపై భాజాపా జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా గారి పిలుపు మేరకు పైన తెలిపిన యావన్మంది సిబ్బందికి అభినందనలు తెలిపేందుకు సంతకాల సేకరణ ద్వారా అభినందన పత్రం విడుదల చేసారు .అనంతరం ఆయనే స్వయంగా ఆయన నివాసప్రాంత వీధిలో ఇంటిఇంటికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు