జనతా కర్ఫ్యూలో.. ఎవరూ పస్తులు ఉండవద్దు:విశ్వహిందూ పరిషత్

580

లాక్ డౌన్ సందర్భంగా ఏ ఒక్కరు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి రావద్దని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారు అన్నారు. దినసరి కూలీలు, పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేసుకునే వలస కూలీలు… ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నం పెట్టేందుకు విశ్వహిందూ పరిషత్ ఎల్లవేళలా ముందు ఉంటుందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ కు ఫోన్ చేస్తే లబ్ధిదారులకు సరుకులు అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మొదటి విడత లాక్ డౌన్ ఈనెల 14వ తేదీ పూర్తవడంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశానుసారం రెండో విడత లాక్ డౌన్ మే 3 వరకు మళ్లీ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో విశ్వహిందూ పరిషత్ సేవా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. రెండో విడతలో మొదటిరోజు 15వ తేదీ బుధవారం రోజున పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి 11 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు.మొత్తంగా 20వ రోజు… రెండో విడతలో మొదటిరోజు కోటి, బషీర్ బాగ్, ఫిల్మ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలలో సరుకులు అందజేశారు.

విశ్వహిందూ పరిషత్  ఫోన్ నెంబర్ కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నాం.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం జి, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు, కార్యదర్శి బండారి రమేష్ గారు, క్షేత్ర సామాజిక సమరసతా ప్రముఖ్ భాస్కర్ జి, రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు గారు పాల్గొన్నారు.

గచ్చిబౌలి, కొండాపూర్ నుంచి విశ్వహిందూ పరిషత్ కు ఫోన్ వచ్చింది.. దాదాపు 2500 మంది కార్మికులం అస్సాం , బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నామని. అయితే పని ఒత్తిడి వల్ల  ఇంచార్జ్ శివరాం గారు స్పందించే లోపే, బాధితులు విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ ఆఫీస్ ని సంప్రదించారు ఫోన్ లో. దీంతో గురువారం ఉదయం ఢిల్లీ నుంచి మళ్లీ ఇక్కడికి ఫోన్ వచ్చింది… వెంటనే వెళ్లి సమస్య పరిష్కరించాలని. అయితే ఉదయాన్నే 9 గంటలకు శేర్లింగంపల్లి చేరుకున్నాము. మసీదుబండ లో నిర్మిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్ దగ్గర పని చేస్తున్న బెంగాల్, అస్సాం వలస కార్మికులను కలిశాము. దాదాపు 2000 పైగా కూలీలు ఉన్న ప్రాంతం ఓ గ్రామాన్ని తలపిస్తోంది. కూలీలను కలవాలంటే ముందుగా సెక్యూరిటీ దాటుకొని అర్థ కిలోమీటర్ల లోపలికి వెళ్లాలి. కానీ లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ వాళ్ళు ససేమిరా అనుమతి ఇవ్వడం లేదు. దీంతో తోసుకుంటూ లోపలికి వెళ్ళాము. అక్కడ కార్మికులతో మాట్లాడుతుండగానే.. సెక్యూరిటీ, సిబ్బంది, వాచ్మెన్లు, సూపర్వైజర్లు ఇలా 20 మంది దాకా వచ్చి మాతో గొడవకు దిగారు. అనుమతి లేనిదే లోపలికి వచ్చి ఎలా భోజనాలు పంచుతారని ఘర్షణ సృష్టించారు. ఈ క్రమంలో కూలీలంతా మాకు అండగా నిలబడ్డారు. మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్లు చేస్తున్న దౌర్జన్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. దీంతో వారికి, మాకు వాదోపవాదాలు జరిగాయి.” అమ్మ పెట్టదు -అడుక్కు తిననివ్వదు” అన్నట్లు ఉన్నాయి మీరు చేసే అరాచకాలు అని మందలించాము. ఒక సందర్భంలో లో పరిస్థితి చేయి దాటి పోయే వరకు వచ్చింది. ఎంత మంది కార్మికులకు భోజనాలు, నిత్యావసర సరుకుల అవసరమో అన్ని కూడా మేము సమకూరుస్తామని గట్టిగా చెప్పడంతో వాళ్లు సద్దుమణిగారు. ఇదే విషయాన్ని అక్కడి పోలీసు అధికారులు కూడా వివరించాము. ఆ తర్వాత వెంబడే అరగంటలో వేయి మందికి సరిపడా ఆహారపు పొట్లాలు సిద్ధం చేసి, పదిమంది బిజెపి కార్యకర్తలు వెళ్లి పంపిణీ చేశారు. ప్రతినిత్యం భోజనాలు అందిస్తామని, నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేస్తామని కూలీలకు భరోసా ఇచ్చి వచ్చాము. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్,విశ్వహిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు, వెంకటేష్ గౌడ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. తరువాత కార్యకర్తలు అందరం కలిసి జ్ఞానేంద్ర ప్రసాద్ ఇంట్లో భోజనం చేసాము.

అనంతరం మియాపూర్ లోని పాత కోర్టు దగ్గర వివిధ ప్రాంతాలకు ఆహార పొట్లాలు సరఫరా చేశారు. రామకృష్ణ మిషన్ అందించే ఆహార పొట్లాలు స్వయంగా పోలీసు వాహనంలోనే వచ్చి వితరణ చేయడం విశేషం. కోర్టు దగ్గర నుంచి కార్యకర్తలు వారి వారి స్థలాలకు తీసుకెళ్లి ఆహారాన్ని పంచుతున్నారు.