మర్కజ్ మరణాల తర్వాతయినా మారరా?

441

కొత్తగా తెరపైకి దేవ్‌బంద్, అజ్మీర్ యాత్రికులు
మజ్లిస్ నేతలా? మజాకానా?
నిజామాబాద్‌లో క్వారంటైన్‌కు నేతల మోకాలడ్డు
పోలీసులకు చెమటలు పట్టించిన మజ్లిస్ డిప్యూటీ మేయర్
పోలీసులు యాత్రికులను బుజ్జగించినా బేఖాతర్
హైదరాబాద్ పాతబస్తీలో విచ్చలవిడిగా వాహనాలు
నిష్ఫలమవుతున్న పోలీసు శ్రమ
బెదిరిపోతే బతుకే దుర్లభమంటున్న మేధావులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దాని బారి నుంచి తప్పించుకుని, కోలుకునేలోపు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన వారు అంటించిన వైరస్‌తో, భారత్ అతలాకుతలమవుతోంది. దానికి వందలు, వేల సంఖ్యలో పాజిటివ్ లక్షణాలున్న రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కోహ్లీ సిక్సర్లు, సెంచరీల మాదిరిగా.. రాష్ట్రాలు కరోనా బాధితుల నెంబర్లతో పోటీ పడుతున్నాయి. చివరకు వారి పుణ్యాన చికిత్స చేస్తున్న వైద్యులు, ఆ వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులకూ వైరస్ అంటుకుంటోంది. మర్కజ్‌కు వెళ్లిన వారు చేస్తున్న నిజాల సమాధిని తవ్వితీసేందుకు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు అభినందనల బదులు.. రాళ్లు, ఇటుకలు బహుమానంగా లభిస్తున్నాయి.

ఇప్పటివరకూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని వెతికి పట్టుకుని, వారిని క్వారంటైన్ చేసేందుకు పోలీసులు తన శక్తి ధారపోస్తున్నారు. ఇది చాలదన్నట్లు.. కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చిన వారిలోనూ కరోనా లక్షణాలున్నట్లు తేలిన నిజం.. పోలీసు, వైద్యులను తలపట్టుకునేలా చేసింది. తాజాగా నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన  కరోనా కేసులకు, దేవ్‌బంద్ లింకు ఉండటమే దానికి కారణం. దాదాపు పదిమంది అక్కడి దర్గాకు వెళ్లివచ్చినట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. అక్కడికి వెళ్లి వివరాలను యాత్రికులు దాచిపెడుతున్న క్రమంలో.. పోలీసులే వారి నెంబర్లు, సిగ్నల్స్, గూగుల్ లోకేషన్ ఆధారంగా వారు పర్యటించిన ప్రాంతాలపై ఆరా తీశారు. దానితో వారంతా దేవ్‌బంద్, అజ్మీర్‌దర్గాకు వెళ్లినట్లు తేలింది. అప్పుడెప్పుడో స్వాతంత్య్రానికి ముందు తెల్లదొరలకు సహాయనిరాకరణ చేసిన  ఉద్యమం చూశాం. ఇప్పుడు సమాచార నిరాకరణ ఉద్యమాన్ని చూస్తున్నాం. అంతే తేడా!

ఆకాశమంత నోరు తెరిచి, కరోనా మహమ్మారి జనాలను కబళించేందుకు అడుగులువేస్తోంది. ఈ పరిస్థితిలో పోలీసులకు సహకరించాల్సిన రాజకీయ పార్టీలు, రహస్యంగా దాక్కున మర్కజ్ యాత్రికులను వెలికితీస్తున్న పోలీసులపై దాడులు, బెదిరింపులకు దిగడం అమానవీయమే కాదు. అరాచకం కూడా! కరోనా మన మతాన్ని ఏమీ చేయదు. హాయిగా రోడ్లకు మీదకు రండని సందేశం ఇస్తున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్ల చర్యలు కచ్చితంగా అరాచకమే.

నిజామాబాద్‌లో కరోనా లక్షాలున్నవారికి గుర్తించిన పోలీసులు, వైద్యులు అక్కడికి వెళ్లి వారందరినీ క్వారంటైన్‌కు పంపించేందుకు చేసిన ప్రయత్నాలను, మజ్లిస్ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ ఇద్రీస్‌ఖాన్ అడ్డుకోవడం విమర్శలకు దారితీసింది. నిజానికి కరోనా అనుమానితులు ఉంటున్న ప్రాంతాన్ని పోలీసులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అంటే పరిస్థితి చేయిదాటిందని అర్ధం. పాజిటివ్ లక్షణాలున్న వారితో, మిగిలిన వారికి ప్రమాదం రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రెడ్‌జోన్ ప్రకటిస్తుంది.

ఈ విషయం తెలిసిన డిప్యూటీ మేయర్ వంటి బాధ్యతగల నాయకుడు, పోలీసులకు సహకరించాల్సింది పోయి.. వారి విధులకు అడ్డుపడి బెదిరించిన వైనం, ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. అప్పటికీ క్వారంటైన్ అంటే భయపడాల్సిన పనిలేదని అక్కడి పోలీసులు, వైద్యులు  బుజ్జగించారు. అయినా సరే వారిని, మాననీయ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారు. సరే.. ఆయన సహా మరికొందరు మజ్లిస్ నేతలపై  పోలీసులు కేసు పెట్టినప్పటికీ, అలాంటి చిన్న శిక్షలు సరిపోవన్నది జనాభిప్రాయం.

ఇక కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ను, హైదరాబాద్ రాజధానిలో పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. ఏ ఒక్క వాహనాన్నీ అనుమతించడం లేదు. జనం గుమిగూడితే లాఠీలకు పనిచెబుతున్నారు. సామాజికదూరం పాటించాలని లాఠీలతోనే సందేశమిస్తున్నారు. కానీ, పాతబస్తీలో మాత్రం ఈ నిబంధనలు చెరిగిపోతున్నాయి. కార్లు, ఆటోలు, జనం విచ్చలవిడిగా తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తలాబ్‌కట్ట, రెయిన్‌బజార్, మీరాలంమండి ప్రాంతాల్లో ఈ దృశ్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నిజానికి నగరంలో 150 కంటైన్మెంట్ జోన్‌లలో,  50 పాతబస్తీలోనే ఉన్నాయి. చంచల్‌గూడ, నూర్‌ఖాన్‌బజార్‌లో ఇప్పటికే రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. అయినా సరే, ప్రజలలో కించిత్తు క్రమశిక్షణ కూడా కనిపించకపోగా, బేఖాతరిజం పెచ్చరిల్లుతోంది. పోలీసులు ఎంత శ్రమిస్తున్నా, మరె ంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. వారిలో భూతద్దం వేసి వెతికినా ఈ క్లిష్ట సమయంలో కూడా మార్పు కనిపించడం లేదు.

కరోనాకు కులం, మతం, ప్రాంతం, భాషబేధాలేమీ ఉండవు. క్రైస్తవ, ముస్లిం దేశాలలో విజృంభిస్తోన్న కరోనాకు, రోడ్లకు రోడ్లే శ వాల గుట్టలవుతున్నాయి. క్రైస్తవానికి పుట్టినిల్లయిన ఇటలీలో పోప్ సహాయకుడికే కరోనా సోకింది. అగ్రరాజ్యాల అధ్యక్షులు, ప్రధానులు కరోనా బారిన పడి, ఐసోలేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అరబ్ దేశాలు, కరోనా భయంతో మిగిలిన దేశస్తులను వెళ్లగొడుతున్నాయి. దుబాయ్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ట్రాలీపై కావాలని ఉమ్మేసిన ఓ వ్యక్తి , సొంత మతానికి చెందిన వాడయినప్పటికీ, ఆ దేశం మరణశిక్ష విధించనుంది. ఆ దేశాల్లో ఇప్పుడు రోగులకు వైద్యం చేసే డాక్టర్లు లేరు. శవాలు పూడ్చిపెట్టే ధైర్యం లేక, గొయ్యి తీసి సామూహిక దహనం చేస్తున్న విషాద దృశ్యాలు కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా మన దేశంలో మాత్రం ఇలాంటి మూర్ఖనేతలు ఇంకా పాతరాతియుగంలోనే జీవించడం, సమాజానికి పెను ప్రమాదమే. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు- పోలీసులు తమ ప్రాణాలే పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న అవకాశాన్ని..  సద్వినియోగం చేసుకోకుండా, రోగాన్ని దాచిపెట్టి, అది సమాజానికి అంటించాలనుకునే పైశాచిక మనస్తత్వంపై.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిందే.  ఈ సంతుష్టీకర రాజకీయకాలంలో ఆ ధైర్యం చేసే మొనగాడు ఎవరన్నది ప్రశ్న!

1 COMMENT

  1. […] తాజాగా భారత్‌దేశంలో కరోనా కల్లోలం తగ్గుముఖం పట్టి, జనజీవనం మళ్లీ గాడిలో పడుతున్న సమయానికి.. అదే తబ్లిగీ జమాత్ సంస్థ ప్రధాన కార్యాలయమైన నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారి వల్ల,  దేశం మళ్లీ ప్రమాదపు అంచుల్లోకి వెళ్లింది. దానితో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమయింది. బతికుంటే బలుసాకు తినవచ్చన్న తత్వానికి సగటు జీవి అలవాటుపడ్డాడు. అన్ని రాష్ట్రాల్లో మరణమృదంగం అవిశ్రాంతంగా మోగుతూనే ఉంది. జమాత్ సంస్థ చీఫ్ పోలీసుల కళ్లు గప్పి అదృశ్యమయ్యాడు. నిజాముద్దీన్‌కు వెళ్లిన సంస్ధ సభ్యులంతా, వివరాలు చెప్పకుండా నేలమాళిగల్లో దాక్కుంటున్నారు. వారి కోసం పోలీసులు కుటుంబసభ్యులకు దూరమై, తిండీ తిప్పలు మానుకుని, జల్లెడ వేస్తున్నారు. అయినా, ఇప్పటివరకూ జమాత్‌పై నిషేధం వేటు వేయకపోవడమే విచిత్రం!ఇది కూడా చదవండి:  మర్కజ్ మరణాల తర్వాతయినా మారరా?  […]