తెలంగాణలో తలసాని టాప్!

అటు సీఎంఆర్ఎఫ్కు విరాళాల సేకరణ
ఇటు పేదలకు ఉచిత బియ్యం పంపిణీ
(మార్తి సుబ్రహ్మణ్యం)
తలసాని శ్రీనివాసయాదవ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ సీనియర్ మంత్రుల్లో ఒకరైన తలసాని, ఇప్పుడు కరోనా పరిస్థితిలో ప్రభుత్వపక్షాన అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు. సాధారణ సమయంలో చురుకుగా పనిచేసే ఆయన, ఈ విపత్తు సమయంలో శరవేగంగా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో రోడ్లపైకి వచ్చి, ప్రభుత్వ నిర్ణయాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న నలుగురైదురు మంత్రుల్లో తలసాని ఒకరు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టి నీళ్లలో తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ వర్షాలతో బస్తీలు జలమయం అయినప్పుడు కూడా వర్షంలో తడుస్తూనే, అధికారులతో కలసి బస్తీలను సందర్శించిన రోజులూ లేకపోలేదు. ఏదైనా విపత్తు వస్తే, ముందుగా ఆయన అప్రమత్తమయి, అధికారులను పరుగులు పెట్టించి అక్కడికక్కడే సమీక్షలు నిర్వహించే అలవాటున్న తలసాని.. కరోనా సమయంలో అదే విధానం కొనసాగిస్తుండటం విశేషం. ఇదికూడా చదవండి.. ‘తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!’
కరోనా వల్ల పనులు లేక, జీవనోపాథి కోల్పోయిన వారిని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, నగదు రూపంలో ఆదుకుంటున్నాయి. అయితే, తలసాని కూడా ఈ విపత్తు సమయంలో వారిని వ్యక్తిగతంగా ఆదుకుంటున్న తీరు, అందరి అభినందనలు అందుకుంటోంది. సామాన్యుల నుంచి విలేకరుల వరకూ ఆయన ఈ విపత్తు సమయంలో, బియ్యం, నిత్యావసర సరకులతోపాటు, కడు పేదవారికి ఆర్ధిక సాయం కూడా అందిస్తూ అందరి హృదయాలలో నిలిచిపోయారు. ఇదికూడా చదవండి.. ‘ దటీజ్.. తలసాని! ’ చాలామంది రాజకీయ నేతలు, కరోనా పేరుతో వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేస్తూ, వాటిని సొంత కార్యక్రమంలా ప్రచారం చేసుకుంటుంటే.. తలసాని మాత్రం అందుకు భిన్నంగా, వ్యాపారులు, ప్రముఖుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు సేకరిస్తుండటం విశేషం. ఆ రకంగా ఇప్పటికి 8 కోట్ల రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్కు దాతలను తీసుకువెళ్లి ఇప్పిస్తున్నారు. ఒక్క సనత్నగర్ నియోజకవర్గం నుంచే దాదాపు 8 కోట్ల రూపాయల విరాళాలను సీఎంరిలీఫ్ఫండ్కు ఇప్పించారంటే, అక్కడి వ్యాపారులు, ప్రముఖుల మనసులలో ఆయన ఏ స్థాయిలో స్థానం సంపాదించారో స్పష్టమవుతోంది.
ఇవికాకుండా.. సినీ ప్రముఖులతో కూడా, కోట్ల రూపాయలు సీఎంరిలీఫ్ఫండ్కు విరాళాలు ఇచ్చేలా కృషి చేసిన తలసాని చొరవ వల్ల.. ఒక్క హైదరాబాద్ నగరం నుంచే, సీఎంరిలీఫ్ఫండ్కు భారీ నగదు చేరడం ఓ విశేషం. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వానికి, ఈ క్లిష్ట సమయంలో విరాళాల రూపంలో పెద్ద మొత్తంలో చేరే నగదు.. సామాన్యులకు సాయం చేసేందుకు దోహదపడుతుంది. ఇదికూడా చదవండి.. ‘ కరోనాపై యుద్ధంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు ’
Very interesting points you have noted, appreciate it for putting up. “‘Tis an ill wind that blows no minds.” by Malaclypse the Younger.
I like this weblog very much, Its a really nice position to read and incur information. “The absence of war is not peace.” by Harry S Truman.