కరోనా కాలంలో కమలం కరసేవ!

162

కోటి  మాస్కుల పంపిణీ లక్ష్యం
శరవేగంగా సొంత తయారీ
శ్రేణులను సమాయత్తం చేస్తున్న సంజయ్
ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంటుప్రజలకు బియ్యం పంపించిన కిషన్‌రెడ్డి
రక్తదానాలకు సిద్ధమవుతున్న కార్యకర్తలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు.. తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంజయ్ నేతృత్వంలో, వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రం జన్‌ధన్ ఖాతాల ద్వారా,  పేదలకు 500 రూపాయల నగదు అందించింది. దానితోపాటు తెలంగాణలో 11 కిలోల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు  మాస్కులు, శానిటైజర్లు లక్షల సంఖ్యలో దిగుమతి చేసుకుని, వాటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే పార్టీ నేతలు అన్ని జిల్లాల్లో, వ్యక్తిగతంగా వాటిని పంపిణీ చేస్తున్నారు. దానికి అదనంగా పార్టీపరంగా ఒక్కో కార్యకర్త ఐదుగురు పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఆరకంగా లక్షలాదిమందిపేదలకు బీజేపీ కార్యకర్తలు ఆకలి తీరుస్తోంది.

కోటి మాస్కుల తయారీపై సంజయ్ దృష్టి

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. భారీ స్థాయిలో మాస్కులు కుట్టిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు కోటి  మాస్కులు అందించే ప్రణాళికకు సంజయ్ శ్రీకారం చుట్టి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు లక్షకు తగ్గకుండా, పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం పార్టీ మహిళా కార్యకర్తలు, డ్వాక్రా బృందాల సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లాకు 50 వేల మాస్కులు మహిళా కార్యకర్తలతో తయారుచేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇక ఇప్పటికే భారీ సంఖ్యలో శానిటైజర్లు తెప్పించారు. కాగా మాస్కుల తయారీ డెమోను సంజయ్ స్వయంగా పరిశీలించారు.

సిద్ధమవుతున్న రక్తదాతలు!

ఇదిలాఉండగా.. సంజయ్ రక్తదానంపై దృష్టి సారిస్తున్నారు. కారణం  రాష్ట్రంలో రక్తం కొరత విపరీతంగా ఉండటమే. నెలకు 5 వేల రక్తం అవసరం కాగా, ప్రస్తుతం 700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. లాక్‌డౌన్ కారణంతో, రక్తదాతలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. 38 ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకుల్లో, 12 బ్యాంకుల్లో రక్తనిల్వలు అయిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని గుర్తించిన బీజేపీ నాయకత్వం.. తమ యువమొర్చా ఆధ్వర్యంలో, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాల్లోనే 5 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.  ఫలితంగా కొంత రక్తనిల్వలు పెంచి, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉంచాలన్నది పార్టీ నాయకత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. దానికితోడు, బీజేపీ కార్యకర్తలు  కూడా రక్తదానం చేసేలా సంజయ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ, క్లిష్ట పరిస్థితిలో శరవేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది.

బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కిషన్‌రెడ్డి

కాగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి.. ఒకవైపు ఢిల్లీలో ఏర్పాటుచేసిన కంటల్‌ర్రూమ్ నుంచి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే, మరోవైపు తన నియోజకవర్గంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలోని పేదలకు ఐదుకిలోల బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు పంపిణీ చే

1 COMMENT

  1. […] బీజేపీ కేంద్రంలో మూడుసార్లు అధికారంలో ఉండి, టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. ఖైరతాబాద్, ముషీరాబాద్, మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, ఉప్పల్, అంబర్‌పేట నియోజకవర్గాలు త ప్ప.. అదనంగా ఒక్క కొత్త సీటు కూడా సాధించలేకపోవడంబట్టి, హైదరాబాద్‌లో పార్టీ ఏ స్థాయిలో ‘సంప్రదాయ రాజకీయం’పేరిట చతికిల పడిందో స్పష్టమవుతోంది. కొత్త వారు పార్టీలోకొచ్చిన తర్వాత, వారిని గౌరవించకపోగా, అవమానించే సంప్రదాయం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. దానితో విసుగుపుట్టిన నేతలు, వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన ఓ సీనియర్ నేత, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తన సొంతు ఖర్చుతో పారిశుద్ధ్య కార్మికులు, పార్టీ పేద కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇది కూడా చదవండి.. కరోనా కాలంలో కమలం కరసేవ! […]