పైలాన్ ద్వంసంలో ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు

540

కావలిలో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్మించిన అమృత్ పథకం పైలాన్ నిర్మాణం ద్వంసం చేసి పథకం మంజూరుకు, అమలుకు కృషి చేసిన వారిని అవమానించడమే.
– కావలి పట్టణం అమృత్ పథకం వర్తింపుకు అర్హత లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి , ప్రస్తుత ఉప రాష్ట్రపతి
గౌరవ నీయులు వెంకయ్య నాయుడు కృషి ఫలితంగా అమృత్ పథకంలో స్థానం దక్కింది.
– వెంగళరావు నగర్ లో కోటి రూపాయలు పైగా అమృత్ నిధులతో పార్కు నిర్మాణం, 70 కోట్లు నిధులతో సమ్మర్ స్టోరేజ్ వద్ద నీటి శుద్ది కర్మాగారం, పట్టణంలో అన్ని ప్రాంతాలకు తాగు నీరు అందించేందుకు అంతర్గత పైప్ లైన్, 6 భారీ నీటి ట్యాంకులు నిర్మాణం పనులు 80 శాతం పూర్తయ్యాయి.
– పట్టణంలోని నిత్యం ప్రవహించే మురుగు నీటిని శుద్ధి చేసి మంచి నీరుగా మార్చి రైతులకు సాగు నీటిగా అందించేందుకు పాపిరెడ్డి చెరువులో మురుగు నీటి శుద్ధి కర్మాగారం నిర్మాణం 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పనులకు అమృత్ నిధులు సుమారు 30 కోట్లు వరకు వెచ్చిస్తున్నారు. సంబంధించిన పనుల ప్రారంభ పైలాన్ నిర్మాణం పట్టణంలో అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రారంభించారు. ఈ పైలాన్ శిలా పలకంపై అప్పటి టీడీపి,వైసీపీ,బీజేపీ ల ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మక పైలాన్ నిర్మాణాన్ని రాత్రికి రాత్రే నామ రూపాలు లేకుండా చేయడం దారుణం.
– ఈ స్థానంలోనే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాల్సి వస్తె ఇందుకు పైలాన్ నిర్మాణం ద్వంసానికి అనుమతులు ఎవరు యిచ్చారో బయట పెట్టాలి.
– ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో 144సెక్షన్ అమలవుతుంది. రాత్రి పూట పొక్లయిన్లతో ప్రభుత్వ ఆస్తిని ద్వంసం చేసి, ట్రాక్టర్లతో తరలి స్తుంటే పోలీసులు ఆరా తీసార?, ఆ సమయంలో ఎవరున్నారో గుర్తించారా?
– ప్రెస్ క్లబ్ శంకు స్థాపన ఫ్లెక్సీ వేసింది ఎవరు?
– ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఏ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి ? అందుకు సంబంధించిన నిబంధనలు, ఏర్పడిన ప్రెస్ అసోసియేషన్ వివరాలు బయట పెట్టాలి..
– ప్రజల సమస్యలు, ప్రజలకు అందాల్సిన ఏదైనా సమాచారం పత్రికలు , మీడియాకు తెలిపేందుకు, అక్కడే పాత్రికేయులు వుండేందుకు సదుపాయాలు కల్పిస్తూ నిర్మించేదే ప్రెస్ క్లబ్. ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం. శంకుస్థాపన కార్యక్రమం రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమిటి.
– ఒకవేళ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని ఉంటే పైలాన్ వెనకాలే స్థలం ఉంది. అన్న కాంటీన్ పక్కనే సమాచార శాఖ కార్యాల యం ఉంది.వీటి నైనా కేటాయించ వచ్చుకదా.

ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. పాత్రికేయులు అర్థం చేసుకోవాలి. చట్టాలు సక్రమంగా అమలు జరిగేలా మేలుకొల్పే పాత్రికేయుల భవనం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించడం సరి కాదు.