గాడిదలు కాసేవారికి ఆహారం అందజేత

322

కోవిద్-19 కరోనా వైరస్ వ్యాధి లాక్ డౌన్ సందర్భంగా 13-4-2020 సోమవారం గుంటూరు నగరంలోని వెంకటప్పయ్య కాలనీ 11-12 లైన్ల చివర శ్రీనివాసరావుపేట (రెడ్ జోన్) పీకలవాగు కట్టమీద గాడిదలు కాసుకునే వారికి ఆహారం అందజేసారు ఈ కార్యక్రమాన్ని “ఎపి. బ్రాహ్మణ చైతన్య వేదిక” మరియు “అయ్యప్ప సేవా సమాఖ్య” రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఆహారం అందజేసారు.

వారితో పాటు అన్నార్తులైన,నిరాశ్రయులైన పేదవారికి, ప్రజారోగ్య రక్షణార్ధం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య,. ఆరోగ్య సిబ్బందికి వారి వద్దకే స్వయంగా వెళ్లి రుచి,శుచికరమైన భోజనం,మంచినీరు బిస్కెట్లు అందజేశారు.
ఆహారం కావాల్సిన వారు 9394101081 కి ఫోన్ చెయ్యగలరు. మీ దృష్టికి వచ్చిన అన్నార్తుల కోసం తమకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వడ్డమాను ప్రసాదు, శ్రీలక్ష్మి, రంజిత,భవాని,పార్వతి, రజని, మాడ శ్రీనివాస్,కూరపాటి కిషోర్,మర్రిపాటి శ్రీనివాస్, లలితా సంపత్ కుమార్,సాయి,చరణ్,రామారావు తదితరులు పాల్గొన్నారు